Gopichand Villain: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) 49వ సినిమాలో టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ విలన్ గా నటించబోతున్నారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియా, సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కళైపులి థాను (Kalaipuli Thanu) నిర్మించనున్న ఈ భారీ యాక్షన్ చిత్రంలో సూర్యకు ధీటైన విలన్‌గా గోపీచంద్ కనిపించనున్నారని వార్తలు రావడంతో ఇరు భాషల ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ ఊహాగానాలకు తాజాగా గోపీచంద్ టీమ్ అధికారికంగా తెరదించింది. సూర్య సినిమాలో గోపీచంద్ విలన్‌గా నటిస్తున్నారనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం గోపీచంద్, 'ఘాజీ' ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'భరతవర్ష'లో హీరోగా నటిస్తున్నారు.
తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు: గోపీచంద్ టీమ్ విజ్ఞప్తి
రెండు దశాబ్దాల క్రితం 'జయం', 'నిజం', 'వర్షం' చిత్రాల్లో తనదైన విలనిజంతో తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన గోపీచంద్.. మళ్లీ 22 ఏళ్ల తర్వాత తమిళ సినిమా ద్వారా నెగెటివ్ రోల్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన గోపీచంద్ బృందం ఒక ప్రకటన విడుదల చేసింది.
సూర్య 49వ సినిమాలో గోపీచంద్ విలన్ పాత్ర పోషిస్తున్నారంటూ వస్తున్న కథనాలు పూర్తిగా నిరాధారమైనవని టీమ్ కొట్టిపారేసింది. గోపీచంద్ పేరును ప్రస్తావిస్తూ ఇలాంటి తప్పుడు వార్తలను, ఊహాగానాలను ప్రచారం చేయవద్దని మీడియా సంస్థలను, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను కోరింది.
గోపీచంద్ తదుపరి ప్రాజెక్టులకు సంబంధించి ఏవైనా అప్డేట్స్ ఉంటే కేవలం నటుడి అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా మాత్రమే వెల్లడిస్తామని స్పష్టం చేసింది.
'భరతవర్ష'తో భారీ కంబ్యాక్‌కు సిద్ధమవుతున్న గోపీచంద్
వరుస యాక్షన్ చిత్రాలతో అలరిస్తున్న గోపీచంద్.. ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 33వ చిత్రం 'భరతవర్ష' (Bharatha Varsha) షూటింగ్లో బిజీగా ఉన్నారు. 'ఘాజీ', 'అంతరిక్షం' చిత్రాల దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
{{/usCountry}}వరుస యాక్షన్ చిత్రాలతో అలరిస్తున్న గోపీచంద్.. ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 33వ చిత్రం 'భరతవర్ష' (Bharatha Varsha) షూటింగ్లో బిజీగా ఉన్నారు. 'ఘాజీ', 'అంతరిక్షం' చిత్రాల దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
{{/usCountry}}క్రీస్తుశకం 642వ సంవత్సరం నాటి చారిత్రక నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో గోపీచంద్ మునుపెన్నడూ చూడని శక్తివంతమైన యోధుడి పాత్రలో కనిపించనున్నారు. రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించింది. దీంతో గోపీచంద్ పూర్తి ఫోకస్ ప్రస్తుతం హీరోగా చేస్తున్న సినిమాలపైనే ఉందని స్పష్టమవుతోంది.