Gopichand Villain: సూర్య సినిమాలో విలన్‌గా గోపీచంద్ రీఎంట్రీ.. ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టిన టీమ్.. అసలు నిజమేంటంటే?

Gopichand Villain: సూర్య 49వ చిత్రంలో టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ విలన్‌గా నటించబోతున్నారంటూ గత రెండు రోజులుగా వస్తున్న వార్తలపై ఆయన టీమ్ స్పందించింది. కళైపులి థాను నిర్మిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ నెగెటివ్ రోల్ చేస్తున్నారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని టీమ్ అధికారికంగా ఖండించింది.

Published on: Nov 18, 2026, 21:36:46 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Gopichand Villain: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) 49వ సినిమాలో టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ విలన్ గా నటించబోతున్నారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియా, సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కళైపులి థాను (Kalaipuli Thanu) నిర్మించనున్న ఈ భారీ యాక్షన్ చిత్రంలో సూర్యకు ధీటైన విలన్‌గా గోపీచంద్ కనిపించనున్నారని వార్తలు రావడంతో ఇరు భాషల ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

Gopichand Villain: సూర్య సినిమాలో విలన్‌గా గోపీచంద్ రీఎంట్రీ.. ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టిన టీమ్.. అసలు నిజమేంటంటే?
Gopichand Villain: సూర్య సినిమాలో విలన్‌గా గోపీచంద్ రీఎంట్రీ.. ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టిన టీమ్.. అసలు నిజమేంటంటే?

అయితే ఈ ఊహాగానాలకు తాజాగా గోపీచంద్ టీమ్ అధికారికంగా తెరదించింది. సూర్య సినిమాలో గోపీచంద్ విలన్‌గా నటిస్తున్నారనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం గోపీచంద్, 'ఘాజీ' ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'భరతవర్ష'లో హీరోగా నటిస్తున్నారు.

తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు: గోపీచంద్ టీమ్ విజ్ఞప్తి

రెండు దశాబ్దాల క్రితం 'జయం', 'నిజం', 'వర్షం' చిత్రాల్లో తనదైన విలనిజంతో తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన గోపీచంద్.. మళ్లీ 22 ఏళ్ల తర్వాత తమిళ సినిమా ద్వారా నెగెటివ్ రోల్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన గోపీచంద్ బృందం ఒక ప్రకటన విడుదల చేసింది.

సూర్య 49వ సినిమాలో గోపీచంద్ విలన్ పాత్ర పోషిస్తున్నారంటూ వస్తున్న కథనాలు పూర్తిగా నిరాధారమైనవని టీమ్ కొట్టిపారేసింది. గోపీచంద్ పేరును ప్రస్తావిస్తూ ఇలాంటి తప్పుడు వార్తలను, ఊహాగానాలను ప్రచారం చేయవద్దని మీడియా సంస్థలను, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను కోరింది.

గోపీచంద్ తదుపరి ప్రాజెక్టులకు సంబంధించి ఏవైనా అప్‌డేట్స్ ఉంటే కేవలం నటుడి అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా మాత్రమే వెల్లడిస్తామని స్పష్టం చేసింది.

'భరతవర్ష'తో భారీ కంబ్యాక్‌కు సిద్ధమవుతున్న గోపీచంద్

వరుస యాక్షన్ చిత్రాలతో అలరిస్తున్న గోపీచంద్.. ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 33వ చిత్రం 'భరతవర్ష' (Bharatha Varsha) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 'ఘాజీ', 'అంతరిక్షం' చిత్రాల దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

క్రీస్తుశకం 642వ సంవత్సరం నాటి చారిత్రక నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో గోపీచంద్ మునుపెన్నడూ చూడని శక్తివంతమైన యోధుడి పాత్రలో కనిపించనున్నారు. రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించింది. దీంతో గోపీచంద్ పూర్తి ఫోకస్ ప్రస్తుతం హీరోగా చేస్తున్న సినిమాలపైనే ఉందని స్పష్టమవుతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More