...
...
Next Story

Comedy Web Series: ప్రైమ్ వీడియోలోని ఈ లేటెస్ట్ వెబ్ సిరీస్ నచ్చిందా? ఓటీటీలోని ఈ 5 రూరల్ ఇండియా కామెడీ సిరీస్ చూడండి

Comedy Web Series: ఓటీటీలో ప్రతి ఒక్కరూ మెచ్చే, ఫ్యామిలీతో హాయిగా చూడగలిగే వెబ్ సిరీస్ లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. మరి అలాంటి బ్యాక్‌డ్రాప్ లో వచ్చిన టాప్ 5 వెబ్ సిరీస్ ఏవి? వాటిని ఎక్కడ చూడొచ్చో తెలుసుకోండి.

Published on: Oct 6, 2026, 13:45:03 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Comedy Web Series: అమెజాన్ ప్రైమ్ వీడియోలో లేటెస్ట్ గా వచ్చిన 'దుపహియా 2' (Dupahiya 2) రిలీజ్ తర్వాత ఓటీటీలో చిన్న పట్టణాలు, రూరల్ బ్యాక్‌‌డ్రాప్ డ్రామాలకు మళ్లీ విపరీతమైన డిమాండ్ పెరిగింది. మెట్రో నగరాల్లో ఉద్యోగాలు చేస్తూ సొంత ఊరి జ్ఞాపకాలను మిస్ అవుతున్న ప్రతి ఒక్కరినీ ఈ కథలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా హోమ్‌సిక్‌నెస్‌తో బాధపడుతుంటే, మనసుకి ప్రశాంతతనిచ్చే ఈ 5 బెస్ట్ ఫీల్ గుడ్ వెబ్ సిరీస్‌లను అస్సలు మిస్ కాకూడదు.

'దుపహియా 2' క్రేజ్, ఆల్ టైమ్ ఫేవరెట్ ‘పంచాయత్’

Comedy Web Series: ప్రైమ్ వీడియోలోని ఈ లేటెస్ట్ వెబ్ సిరీస్ నచ్చిందా? ఓటీటీలోని ఈ 5 రూరల్ ఇండియా కామెడీ సిరీస్ చూడండి
Comedy Web Series: ప్రైమ్ వీడియోలోని ఈ లేటెస్ట్ వెబ్ సిరీస్ నచ్చిందా? ఓటీటీలోని ఈ 5 రూరల్ ఇండియా కామెడీ సిరీస్ చూడండి

గజరాజ్ రావు, స్పర్శ్ శ్రీవాస్తవ కాంబినేషన్‌లో వచ్చిన 'దుపహియా 2' రూరల్ ఇండియా అందం, అక్కడ ఉండే ప్రశాంతతను కళ్లకు కట్టినట్లు చూపించింది. ఆ వెబ్ సిరీస్ ఇచ్చిన ఫీల్ నచ్చిన వారికి ఓటీటీలో మరికొన్ని అద్భుతమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ఇలాంటి నేటివిటీ డ్రామాల్లో ఆల్ టైమ్ క్లాసిక్‌గా నిలిచింది 'పంచాయత్' (Panchayat). 2020 లాక్‌‌డౌన్ టైమ్‌లో స్టార్ట్ అయిన ఈ వెబ్ సిరీస్.. ఇప్పటికే 4 సీజన్లు పూర్తి చేసుకుని అమెజాన్ ప్రైమ్ వీడియోలో బిగ్గెస్ట్ హిట్ సిరీస్‌గా కొనసాగుతోంది.

ఫులెరా అనే చిన్న గ్రామానికి పంచాయతీ కార్యదర్శిగా వెళ్లిన అభిషేక్ త్రిపాఠి (జితేంద్ర కుమార్) కథే ఇది. ప్రధాన్ జీ (రఘుబీర్ యాదవ్), మంజు దేవి (నీనా గుప్తా), ప్రహ్లాద్ (ఫైజల్ మాలిక్), బనరాకస్ (దుర్గేష్ కుమార్) లాంటి క్యారెక్టర్లు ప్రతీ ఇంట్లో మనుషుల్లా కలిసిపోయాయి.

మిడిల్ క్లాస్ ఎమోషన్స్ 'గుల్లక్', ‘యే మేరీ ఫ్యామిలీ’

సొంత ఇల్లు, మిడిల్ క్లాస్ కష్టాలు, ఆప్యాయతలను క్యూట్‌గా చూడాలనుకుంటే 'గుల్లక్' (Gullak) పర్ఫెక్ట్ ఛాయిస్. ఉత్తర భారతదేశంలోని ఒక చిన్న పట్టణంలో నివసించే మిశ్రా కుటుంబం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

ఇక 90ల కాలంలో పెరిగిన వారికి 'యే మేరీ ఫ్యామిలీ' (Yeh Meri Family) ఒక స్వీట్ మెమరీ. 1998 జైపూర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో 12 ఏళ్ల హర్షాల్ గుప్తా పాత్ర ద్వారా చిన్నతనం జ్ఞాపకాలను చూపిస్తారు. టీవీ రిమోట్ కోసం తోబుట్టువుల పోరాటాలు, సమ్మర్ హాలిడేస్ హంగామా మనల్ని పాత రోజుల్లోకి తీసుకెళ్తాయి. ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

'గ్రామ్ చికిత్సాలయ', ‘ఘర్ వాప్సీ’

పల్లెటూరి వైద్య విధానం, అక్కడ ఉండే రూరల్ పాలిటిక్స్‌ను ఫన్నీగా చూపించిన వెబ్ సిరీస్ 'గ్రామ్ చికిత్సాలయ' (Gram Chikitsalay). అమోల్ పరాశర్ (డాక్టర్ ప్రభాత్) ఒక గ్రామీణ హెల్త్ సెంటర్‌కు వచ్చి అక్కడ ఉండే సిస్టమ్‌తో ఎలా పోరాడాడు అనే ఆసక్తికర కథనం ప్రైమ్ వీడియోలో ఉంది.

ఉద్యోగం పోగొట్టుకుని బెంగళూరు నుంచి ఇండోర్‌లోని సొంత ఇంటికి తిరిగి వచ్చిన శేఖర్ (విశాల్ వసిష్ఠ) కథే 'ఘర్ వాప్సీ' (Ghar Waapsi). నగరాల్లో లైఫ్ సెట్ కాక ఊరికి తిరిగొచ్చినప్పుడు సమాజం నుంచి ఎదురయ్యే ప్రశ్నలు, ఫ్యామిలీ ఇచ్చే సపోర్ట్ ఈ సిరీస్‌లో హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. ఈ సిరీస్ జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks