Thriller Web Series: ఓటీటీలో మలయాళం థ్రిల్లర్సే కాదు.. ఈ 5 మరాఠీ థ్రిల్లర్స్ చూడండి.. నెక్ట్స్ లెవెల్ థ్రిల్ గ్యారెంటీ

Thriller Web Series: మైథాలజీ, మూఢనమ్మకాలు, గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ కథలతో మరాఠీ వెబ్ సిరీస్‌లు ఇప్పుడు ఓటీటీల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. థ్రిల్లర్ అంటే మలయాళమే కాదు మరాఠీ కూడా అన్నట్లుగా ఈ సిరీస్ దూసుకెళ్తున్నాయి. జీ5, సోనీలివ్, ప్రైమ్ వీడియోలాంటి వాటిలో వీటిని చూడొచ్చు.

Published on: Nov 27, 2026, 05:42:11 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Thriller Web Series: భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా మరాఠీ వెబ్ సిరీస్‌లు తమ లోతైన కథనం, ప్రాంతీయ జానపద కథలు, మూఢనమ్మకాల వెనుక దాగి ఉన్న రహస్యాలు, గ్రిప్పింగ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లతో ఓటీటీ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి.

Thriller Web Series: ఓటీటీలో మలయాళం థ్రిల్లర్సే కాదు.. ఈ 5 మరాఠీ థ్రిల్లర్స్ చూడండి.. నెక్ట్స్ లెవెల్ థ్రిల్ గ్యారెంటీ
Thriller Web Series: ఓటీటీలో మలయాళం థ్రిల్లర్సే కాదు.. ఈ 5 మరాఠీ థ్రిల్లర్స్ చూడండి.. నెక్ట్స్ లెవెల్ థ్రిల్ గ్యారెంటీ

సస్పెన్స్, క్రైమ్, హారర్ థ్రిల్లర్ జానర్లను ఇష్టపడే వారి కోసం ప్రముఖ ఓటీటీ వేదికలైన అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్, జీ5లలో అందుబాటులో ఉన్న 5 అత్యుత్తమ మరాఠీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

1. సమాంతర్ (Samantar) – చేతి రేఖల వెనుక దాగి ఉన్న విధి రహస్యం

సతీష్ రాజ్‌వాడే, సమీర్ విద్వాన్స్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ లో స్వప్నిల్ జోషి, నితీష్ భరద్వాజ్ లాంటి వాళ్లు నటించారు. ఐఎండీబీ రేటింగ్ 8.2/10గా ఉండగా.. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎంఎక్స్ ప్లేయర్ లలో చూడొచ్చు.

రెండు సీజన్లుగా వచ్చిన ఈ సూపర్ హిట్ సిరీస్, వేర్వేరు కాలాల్లో పుట్టినప్పటికీ ఒకే రకమైన విధి రాత ఉన్న ఇద్దరు వ్యక్తుల కథ. మధ్యతరగతి యువకుడు, నాస్తికుడైన కుమార్ మహాజన్ (స్వప్నిల్ జోషి) ఒక జ్యోతిష్యుడిని కలిసినప్పుడు షాకింగ్ నిజం తెలుస్తుంది.

అతని అరచేతి రేఖలు సుదర్శన్ చక్రపాణి (నితీష్ భరద్వాజ్) అనే వృద్ధుడి రేఖలతో అచ్చం సరిపోతాయి. కుమార్ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న ప్రతి కష్టం, ప్రమాదం గతంలో సుదర్శన్ జీవితంలో ఇప్పటికే జరిగిపోయి ఉంటాయి. తన భవిష్యత్తును మార్చుకోవడానికి కుమార్ సుదర్శన్‌ను వెతుక్కుంటూ వెళ్లడంతో కథ ఉత్కంఠభరితంగా మారుతుంది.

2. మన్వత్ మర్డర్స్ (Manvat Murders) – 1970ల నాటి సంచలన నరబలి కేసులు

ఆశిష్ అవినాష్ బెండే డైరెక్షన్ లో వచ్చిన మరో సూపర్ వెబ్ సిరీస్. అశుతోష్ గోవారికర్, సాయి తమ్హంకర్, సోనాలి కులకర్ణి, మకరంద్ అనాస్పురే నటించారు. 7.1 రేటింగ్ తో సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

1970వ దశకంలో మహారాష్ట్రలోని మన్వత్ గ్రామంలో జరిగిన వాస్తవ వరుస హత్యలు, క్షుద్ర పూజల నేపథ్యంలో ఈ క్రైమ్ సిరీస్ తెరకెక్కింది. మాజీ పోలీస్ అధికారి రమాకాంత్ ఎస్. కులకర్ణి జ్ఞాపకాల ఆధారంగా రూపొందిన ఈ కథలో, ప్రముఖ దర్శక-నటుడు అశుతోష్ గోవారికర్ పోలీస్ ఆఫీసర్ రమాకాంత్ పాత్రలో ఒదిగిపోయారు.

గ్రామంలో వరుసగా యువతులు, మహిళలు హత్యకు గురవుతున్న తీరును శాస్త్రీయ, మానసిక కోణంలో విశ్లేషిస్తూ, గ్రామంలోని మూఢనమ్మకాలు, కొందరి దురాశను ఆయన ఎలా బయటపెట్టారనేది ఆద్యంతం కట్టిపడేస్తుంది.

3. దేవ్‌ఖేల్ (Devkhel) – 15 ఏళ్లుగా హోలీ పౌర్ణమి రాత్రి జరిగే మరణాల మిస్టరీ

చంద్రకాంత్ గైక్వాడ్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సిరీస్ లో అంకుశ్ చౌదరి, ప్రజక్తా మాలి లాంటి వాళ్లు నటించారు. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కు 7.1 రేటింగ్ ఉంది.

రత్నగిరి జిల్లాలోని దేవ్‌తాలి అనే ఊహాజనిత గ్రామంలో జరిగే పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. ఆ గ్రామంలో గత 15 ఏళ్లుగా ప్రతి సంవత్సరం హోలీ పౌర్ణమి (షిమ్గా పండుగ) రాత్రి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మరణిస్తుంటాడు. పాపులు చేసిన పాపాలకు 'శంకాసురుడు' అనే దైవశక్తి శిక్ష విధిస్తోందని గ్రామస్తులు బలంగా నమ్ముతుంటారు.

అయితే ఒక పెద్దమనిషి హత్య తర్వాత రంగంలోకి దిగిన హేతువాద పోలీస్ ఇన్‌స్పెక్టర్ విశ్వాస్ సరంజమే (అంకుశ్ చౌదరి), ఆ మూఢనమ్మకాన్ని ఛేదించి హత్యల వెనుక ఉన్న అసలు మానవ మృగాలను ఎలా పట్టుకున్నాడనేదే ఈ సిరీస్ కథ.

4. డిటెక్టివ్ ధనంజయ్: రహస్యజాల్ (Detective Dhananjay: Rahasyajaal)

శ్రీరంగ్ గాడ్బోలే డైరెక్షన్ లో అధినాథ్ కొఠారే, పుష్కరాజ్ చిర్పుట్కర్ నటించిన ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎండీబీలో 6.4 రేటింగ్ సొంతం చేసుకుంది.

ఒక హత్య కేసులో అన్యాయంగా ఇరుక్కున్న అమాయకుడిని నిర్దోషిగా నిరూపించడానికి డిటెక్టివ్ ధనంజయ్, అతని అసిస్టెంట్ చోటూ శిర్గావ్ పట్టణంలో విచారణ ప్రారంభిస్తారు.

ఈ క్రమంలో ఒక యూట్యూబర్ ఇచ్చిన క్లూ ఆధారంగా ఒక పురాతన నాగదేవత ఆలయంలోని పజిల్స్‌ను ఛేదించి, భూగర్భంలో నడుస్తున్న భారీ డైమండ్ స్మగ్లింగ్ రాకెట్‌ను బయటపెడతారు. అవినీతి పోలీసుల అడ్డంకులను దాటుకుని అసలు సూత్రధారిని ఎలా పట్టుకున్నారనేది ఆసక్తికరంగా సాగుతుంది.

5. అంధర్ మాయ (Andhar Maya) – పురాతన భవంతిలో శాపం, వరుస మరణాలు

భీమ్‌రావ్ ముండే డైరెక్షన్ లో కిషోర్ కదమ్, రుతుజా బాగ్వే నటించిన ఈ వెబ్ సిరీస్ కూడా జీ5 లోనే అందుబాటులో ఉంది. ఐఎండీబీలో 6.4 రేటింగ్ ఉంది.

హారర్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి 'అంధర్ మాయ' ఒక చక్కటి ఆప్షన్. తమ కుటుంబ పెద్దల కర్మకాండలు నిర్వహించడానికి ఖాతు కుటుంబ సభ్యులంతా తమ పూర్వీకుల ఇంటికి వెళ్తారు. ఆ ఇంటి కేర్‌టేకర్ గోన్యా (కిషోర్ కదమ్) వారిని సాదరంగా ఆహ్వానిస్తూనే, తొందరపడి ఇల్లు వదిలి వెళ్లవద్దని వింతగా హెచ్చరిస్తాడు.

ఆ ఆస్తిని అమ్మేయాలనే దురాశతో వచ్చిన ఆ కుటుంబ సభ్యులు తిరిగి వెళ్లే సమయంలో ఒక్కొక్కరుగా వింత పరిస్థితుల్లో మాయమవ్వడం, చనిపోవడం మొదలవుతుంది. ఆ ఇంట్లో తిరుగుతున్న ఒక చిన్నారి ఆత్మ రహస్యం, కుటుంబం దాచిన చీకటి నిజాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి.

ABOUT THE AUTHOR

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.