Panchayat Season 5: బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్ ఐదో సీజన్ వచ్చే నెలలోనే.. ఫులేరా వేచి చూస్తోంది.. ప్రైమ్ వీడియో అప్డేట్

Panchayat Season 5: ప్రైమ్ వీడియో పాపులర్ కామెడీ డ్రామా 'పంచాయత్ సీజన్ 5' విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 3 నుంచి ఈ కొత్త సీజన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నాలుగో సీజన్‌లో క్రాంతి దేవి విజయం తర్వాత ఫులేరాలో భూషణ్ పెత్తనం, సచివ్ జీ ఎదుర్కొనే కొత్త సవాళ్ల చుట్టూ కథ సాగనుంది.

Published on: Nov 18, 2026, 14:12:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Panchayat Season 5 OTT Release: ఓటీటీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘పంచాయత్’ మళ్లీ సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ బ్లాక్‌బస్టర్ సిరీస్ ఐదో సీజన్ విడుదల తేదీని బుధవారం (నవంబర్ 18) అధికారికంగా ప్రకటించింది.

పంచాయత్ వెబ్ సిరీస్ సీజన్ 5 అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్
పంచాయత్ వెబ్ సిరీస్ సీజన్ 5 అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్

జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'పంచాయత్ సీజన్ 5' డిసెంబర్ 3, 2026 నుంచి స్ట్రీమింగ్ కానుంది. వచ్చే ఏడాది వరకు వేచి చూడాలన్న ఊహాగానాలకు తెరదించుతూ, ఈ ఏడాదే ఫులేరా గ్రామంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లేందుకు మేకర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

బన్రాకస్ ప్రమోషనల్ స్టంట్‌కు తెర.. కొత్త పోస్టర్ వైరల్

బుధవారం ప్రైమ్ వీడియో తన సోషల్ మీడియా ఖాతాల్లో 'పంచాయత్ 5' కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ రిలీజ్ డేట్‌ను వెల్లడించింది. ఈ పోస్టర్‌లో కొత్త ప్రధాన్ భర్త భూషణ్ అలియాస్ బన్రాకస్ (దుర్గేష్ కుమార్) కిందపడి ఉన్న సచివ్ జీ (జితేంద్ర కుమార్) వైపు వేలు చూపిస్తూ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. “కొంచెం గొడవ, కొంచెం ప్రేమ ఉంటుంది.. ఫులేరా మీ కోసం ఎప్పుడూ వేచి చూస్తూనే ఉంటుంది” అనే క్యాప్షన్‌తో మేకర్స్ ఈ పోస్టర్‌ను పంచుకున్నారు.

అంతకుముందు నవంబర్ 15న, ఈ సీజన్‌ను బన్రాకస్ 'బందీగా' ఉంచాడని, అందుకే 2026లో 'పంచాయత్ 5' విడుదల కావడం లేదని ప్రైమ్ వీడియో ఒక సరదా ప్రమోషనల్ పోస్ట్ పెట్టింది. దీంతో నిరాశ చెందిన అభిమానులకు, అదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని స్పష్టం చేస్తూ డిసెంబర్ 3 రిలీజ్ డేట్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చింది.

ఫులేరాలో మారిన అధికార సమీకరణాలు: సీజన్ 5 కథేంటి?

ది వైరల్ ఫీవర్ (TVF) నిర్మించిన ఈ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ ఫులేరా పంచాయతీ ఎన్నికల వేడితో ముగిసింది. ఆ ఎన్నికల్లో మంజు దేవి (నీనా గుప్తా)పై క్రాంతి దేవి (సునీతా రాజ్‌వర్) విజయం సాధించి కొత్త ప్రధాన్‌గా ఎన్నికయ్యారు. అయితే తెర వెనుక అసలు అధికారం మాత్రం ఆమె భర్త భూషణ్ శర్మ (బన్రాకస్) చేతుల్లోకి వెళ్లింది.

ఇప్పుడు ఐదో సీజన్‌లో కథ కొత్త మలుపు తిరగనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను భూషణ్ నిలబెట్టుకుంటాడా, లేక అతని మాటలన్నీ కేవలం రాజకీయ జిమ్మిక్కులుగానే మిగిలిపోతాయా అన్నది ఆసక్తికరంగా మారింది.

పాత ప్రధాన్ జీ (రఘుబీర్ యాదవ్) వర్గానికి అండగా ఉన్న అభిషేక్ త్రిపాఠి (జితేంద్ర కుమార్), ఇప్పుడు బన్రాకస్ పెత్తనం కింద ఎలా ఉద్యోగం చేస్తాడన్నది ప్రధాన కథాంశం కానుంది. గ్రామ రాజకీయాల నడుమ అభిషేక్, రింకీ (సాన్వికా) మధ్య చిగురించిన ప్రేమబంధం ఏ తీరానికి చేరుతుందో ఈ సీజన్‌లో చూడాలి.

పంచాయత్ సీజన్ 5 విశేషాలు

దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కిన 'పంచాయత్ సీజన్ 5'ను దీపక్ కుమార్ మిశ్రా, చందన్ కుమార్, అరుణాభ్ కుమార్ సంయుక్తంగా రూపొందించారు. ఈ సీజన్‌లో జితేంద్ర కుమార్, రఘుబీర్ యాదవ్, నీనా గుప్తా, దుర్గేష్ కుమార్, సునీతా రాజ్‌వర్‌లతో పాటు ఫైజల్ మాలిక్ (ప్రహ్లాద్ చా), చందన్ రాయ్ (వికాస్), సాన్వికా, అశోక్ పాఠక్ (బినోద్) తదితరులు కీలక పాత్రల్లో అలరించనున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More