...
...
Next Story

OTT Top Releases: ఈ వారం ఓటీటీలో రచ్చ చేయబోతున్న టాప్ 5 క్రేజీ సినిమాలు, సిరీస్‌లు.. బింజ్ వాచర్లకు పండగే.. డోంట్ మిస్!

OTT Top Releases: ఈ వారం ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు మైండ్ బ్లాకింగ్ సినిమాలు, సిరీస్‌లు రెడీ అయ్యాయి. అయితే వీటిలో ఈ 5 చాలా స్పెషల్ గా కనిపిస్తున్నాయి. ఇందులో డిఫరెంట్ జోనర్లు ఉన్నాయి. డార్క్ యాక్షన్ థ్రిల్లర్ నుంచి హారర్ థ్రిల్లర్ వరకు ఈ వారం మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు ఇవే.

Published on: Sep 22, 2026, 12:35:58 IST
Advertisement

OTT Top Releases: కొత్త వారంవచ్చిందటే చాలు ఓటీటీ ఆడియన్స్ కొత్త కంటెంట్ కోసం డిజిటల్ వేదికలను జల్లెడ పడుతుంటారు. వారి నిరీక్షణకు తెరవేస్తూ ఈ వారం నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, లయన్స్ గేట్ ప్లే వేదికగా 5 విభిన్నమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రాబోతున్నాయి. థ్రిల్లర్స్, సస్పెన్స్, కామెడీ, ఫాంటసీలతో నిండిన ఆ టాప్ 5 మూవీస్ విశేషాలు ఇక్కడ చూసేయండి.

బేబీ డూ డై డూ - నెట్‌ఫ్లిక్స్

ఈ వారం ఓటీటీలో రచ్చ చేయబోతున్న టాప్ 5 క్రేజీ సినిమాలు, సిరీస్‌లు.. బింజ్ వాచర్లకు పండగే.. డోంట్ మిస్!
ఈ వారం ఓటీటీలో రచ్చ చేయబోతున్న టాప్ 5 క్రేజీ సినిమాలు, సిరీస్‌లు.. బింజ్ వాచర్లకు పండగే.. డోంట్ మిస్!

స్ట్రీమింగ్ డేట్: సెప్టెంబర్ 23, 2026

వర్సటైల్ యాక్ట్రెస్ హ్యూమా ఖురేషీ మొదటిసారిగా మూగ, చెవిటి కాంట్రాక్ట్ కిల్లర్‌గా కనిపిస్తున్న రా అండ్ రస్టిక్ డార్క్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. తన చెల్లిని చంపిన నిందితులపై పగ తీర్చుకోవడానికి కాంట్రాక్ట్ కిల్లింగ్స్ చేసే ఒక డిఫరెంట్ రోల్‌ను హ్యూమా ఇందులో పోషించింది. థియేటర్లలో సింపుల్‌గా వచ్చి వెళ్లిన ఈ చిత్రం.. మైండ్ బెండింగ్ క్రైమ్-థ్రిల్లర్లను ఇష్టపడే ఓటీటీ ప్రేమికులకు నెట్‌ఫ్లిక్స్‌లో పర్ఫెక్ట్ ఛాయిస్.

షక్ : ట్రస్ట్ నో వన్ - నెట్‌ఫ్లిక్స్

స్ట్రీమింగ్ డేట్: సెప్టెంబర్ 24, 2026

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా డిజిటల్ స్పేస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. తొమ్మిదేళ్ల క్రితం మిస్సయిన తన చిన్నారి పాప కోసం ఓ తల్లి చేసే సుదీర్ఘమైన, ఉత్కంఠభరితమైన అన్వేషణ చుట్టూ కథ తిరుగుతుంది. ప్రతి పాత్రపైనా అనుమానం కలిగించే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఊహించని మలుపులతో రాబోతున్న ఈ పవర్ ప్యాక్డ్ వెబ్ సిరీస్ బింజ్ వాచర్స్‌ను స్క్రీన్‌కు కట్టిపడేయడం ఖాయం.

రంభ ఊర్వశి మేనక - ప్రైమ్ వీడియో

దేవలోకానికి చెందిన అప్సరసలు రంభ, ఊర్వశి, మేనకలను భూమిపైకి రప్పించడానికి ఓ సామాన్యుడు ఓ మాయా పుస్తకం ద్వారా 15 ఏళ్లపాటు చేసే విచిత్రమైన ప్రయోగాల చుట్టూ తిరిగే సోషియో-ఫాంటసీ కామెడీ డ్రామా ఇది. దేవేంద్రుడు వారి రాకను ఎలా అడ్డుకున్నాడు? ఆ తర్వాత ఎలాంటి గందరగోళం జరిగింది అనేది నవ్వుల పూయించేలా తెరకెక్కించారు. అల్లరి నరేష్ మార్క్ ఫన్ టైమింగ్‌తో ఫ్యామిలీతో కలిసి హాయిగా ఎంజాయ్ చేయడానికి ఇది ప్రైమ్ వీడియోలో బెస్ట్ ఆప్షన్.

అగధ - జీ5

స్ట్రీమింగ్ డేట్: సెప్టెంబర్ 25, 2026

టాలీవుడ్ సీనియర్ మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మిస్టిక్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ 'అగధ'. ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తులున్న మహాదేవి (కామాక్షి భాస్కర్ల) అనే యువతి, తన కుటుంబంలో జరుగుతున్న వరుస విచిత్ర మరణాల వెనుక నిజాలు తెలుసుకోవడానికి ఓ గుహలోకి వెళ్తుంది. అక్కడ ఉన్న 'అగధ' అనే దుష్టశక్తిని ఆమె ఎలా ఎదుర్కొందనేది అసలు కథ.

దిస్ టెంప్టింగ్ మ్యాడ్నెస్ - లయన్స్ గేట్ ప్లే

స్ట్రీమింగ్ డేట్: సెప్టెంబర్ 25, 2026

గ్లోబల్ హిట్ సిరీస్ 'బ్రిడ్జర్‌టన్' ఫేమ్ సీమోన్ యాష్లే ప్రధాన పాత్రలో నటించిన సైకాలాజికల్ థ్రిల్లర్ ఇది. ఓ ఘోర ప్రమాదం తర్వాత కోమా నుంచి మేల్కొన్న హీరోయిన్.. తన జీవితంలోని గత 6 నెలల జ్ఞాపకాలను మర్చిపోతుంది. తీరా చూస్తే తన భర్తే తనను హత్య చేయడానికి ప్రయత్నించాడనే నిజం తెలిసి షాక్ అవుతుంది. జ్ఞాపకాలు, అనుమానాలు, నిజాల మధ్య జరిగే ఈ మైండ్ బెండింగ్ థ్రిల్లర్ నెవర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks