ఈ ఏడాది ఓటీటీలోకి వచ్చిన ఈ టాప్ 7 క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మిస్ కావద్దు.. నెట్‌ఫ్లిక్స్‌లోనే మూడు
ఈ ఏడాది ఓటీటీలోకి ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చాయి. మరి వాటిలో మంచి ఐఎండీబీ రేటింగ్ సాధించిన టాప్ 7 వెబ్ సిరీస్ గురించి ఇక్కడ తెలుసుకోండి. వీటిని ఎక్కడ చూడాలో తెలుసుకొని ఈ వీకెండ్ ప్లాన్ చేయండి.
ఈ ఏడాది అంటే 2025 ఎంటర్టైన్మెంట్ పరంగా అదిరిపోయింది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒకవేళ మీరు ఈ ఏడాది వచ్చిన బెస్ట్ సిరీస్‌లను మిస్ అయి ఉంటే.. 2026 స్టార్ట్ అయ్యే లోపు తప్పకుండా చూసేయండి. ఐఎండీబీ రేటింగ్ ప్రకారం టాప్ 7 క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇక్కడ ఉంది.

టాప్ 7 క్రైమ్ థ్రిల్లర్లు ఇవే..
ఈ ఏడాది (2025) చాలా మంచి వెబ్ సిరీస్‌లు వచ్చాయి. అందులో జనాలు మెచ్చిన, అత్యధిక రేటింగ్స్ ఉన్న 7 క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ల వివరాలు ఇవే. 'పాతాళ్ లోక్ 2' నుంచి 'డబ్బా కార్టెల్' వరకు అన్నీ ఇక్కడ ఉన్నాయి.
1. పాతాళ్ లోక్ సీజన్ 2
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఐఎండీబీ రేటింగ్: 8.2
జనవరి 2025లో వచ్చిన ఈ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. జైదీప్ అహ్లావత్ నటన మరో లెవల్ అని చెప్పొచ్చు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.
2. బ్లాక్, వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్
ఓటీటీ: సోనీ లివ్
ఐఎండీబీ రేటింగ్: 8
మే నెలలో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి. మయూర్ మోరే, పాలక్ జైస్వాల్ ఇందులో నటించారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఓ డిఫరెంట్ థ్రిల్లర్ ఇది.
3. బ్లాక్ వారెంట్
ఎక్కడ చూడొచ్చు: నెట్‌ఫ్లిక్స్
ఐఎండీబీ రేటింగ్: 7.9
ఇది కూడా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్. జనవరిలో విడుదలైంది. మొత్తం 7 ఎపిసోడ్లు ఉంటాయి. రాహుల్ భట్, జహాన్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. చార్లెస్ శోభరాజ్, తీహార్ జైలు జీవితం చుట్టూ సిరీస్ తిరుగుతుంది.
4. కన్నెడా
ఎక్కడ చూడొచ్చు: జియో హాట్‌స్టార్
ఐఎండీబీ రేటింగ్: 7.7
ఇది హిందీ/పంజాబీ క్రైమ్ డ్రామా. పర్మీష్ వర్మ లీడ్ రోల్ చేశాడు. మొత్తం 9 ఎపిసోడ్లు ఉంటాయి. కెనడాలో డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే సిరీస్ ఇది.
5. ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్
ఎక్కడ చూడొచ్చు: సోనీ లివ్
ఐఎండీబీ రేటింగ్: 7.6
ఇదొక హిస్టారికల్ డ్రామా సిరీస్. మార్చి 2025లో స్ట్రీమింగ్ అయ్యింది. చరిత్ర, డ్రామా ఇష్టపడే వాళ్లకు బాగా నచ్చుతుంది. జలియన్ వాలా బాగ్ దుర్ఘటన, తెర వెనుక కుట్రపై తీసిన వెబ్ సిరీస్ ఇది.
6. ఖాకీ: ది బెంగాల్ చాప్టర్
ఎక్కడ చూడొచ్చు: నెట్‌ఫ్లిక్స్
ఐఎండీబీ రేటింగ్: 7.5
'బీహార్ చాప్టర్' తర్వాత వచ్చిన వెబ్ సిరీస్ ఇది. మార్చిలో విడుదలైంది. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సిరీస్‌లో 7 ఎపిసోడ్లు ఉన్నాయి.
7. డబ్బా కార్టెల్
ఎక్కడ చూడొచ్చు: నెట్‌ఫ్లిక్స్
ఐఎండీబీ రేటింగ్: 7.1
సీనియర్ నటి షబానా ఆజ్మీ నటించిన వెబ్ సిరీస్ ఇది. 7 ఎపిసోడ్లు ఉంటాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన క్రైమ్ డ్రామా. కొందరు ఆడవాళ్ల గ్యాంగ్ నడిపే డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరుగుతుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


