Top Comedy Web Series: ఓటీటీ ప్రపంచంలో క్రైమ్, సస్పెన్స్, అశ్లీలతతో కూడిన కంటెంట్ ఎంత వస్తున్నా.. మన మనసుకు ప్రశాంతతను ఇచ్చే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు ఉండే క్రేజ్ ఎప్పుడూ వేరే లెవెల్. ముఖ్యంగా 'గుల్లక్' (Gullak) వెబ్ సిరీస్‌లో మిశ్రా కుటుంబం చేసే హడావుడి, మధ్యతరగతి ఇళ్లల్లో జరిగే చిన్న చిన్న గొడవలు, అన్నదమ్ముల ప్రేమను చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులకు అలాంటి కంటెంట్ మళ్లీ ఎప్పుడు దొరుకుతుందా అని వెతుకుతుంటారు.

ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేకుండా, కుటుంబ సభ్యులందరూ కలిసి సోఫాలో కూర్చుని హాయిగా నవ్వుకునే 9 అద్భుతమైన వెబ్ సిరీస్‌ల లిస్ట్ మీ కోసం ఇక్కడ ఇస్తున్నాము. వీటి ఐఎండీబీ (IMDb) రేటింగ్స్ కూడా 7 కి పైనే ఉండటం విశేషం.
1. యే మేరీ ఫ్యామిలీ (Yeh Meri Family)
ఎక్కడ చూడవచ్చు?: అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
ఐఎండీబీ రేటింగ్: 8.9/10
1990ల నాటి మధురమైన జ్ఞాపకాలను, ఆ కాలపు మనస్తత్వాలను కళ్లముందు ఉంచే అద్భుతమైన వెబ్ సిరీస్ ఇది. 12 ఏళ్ల హర్షు గుప్తా అనే బాలుడి కోణం నుంచి ఈ కథ సాగుతుంది. ఒక మధ్యతరగతి కుటుంబంలోని బంధాలు, పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమతో కూడిన ఒత్తిడి, చిన్ననాటి అమాయకపు రోజులను చాలా అందంగా, ఎమోషనల్‌గా చూపించారు.
2. పంచాయత్ (Panchayat)
ఎక్కడ చూడవచ్చు?: అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
ఐఎండీబీ రేటింగ్: 9/10
ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రాజెక్ట్ 'పంచాయత్'. అభిషేక్ త్రిపాఠి అనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌కు సిటీలో మంచి జాబ్ రాకపోవడంతో, విధిలేక ఉత్తరప్రదేశ్‌లోని 'ఫులేరా' అనే ఒక చిన్న గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది. పల్లెటూరి జీవితంలోని అమాయకత్వం, అక్కడి విచిత్రమైన రాజకీయాలు, స్థానిక ప్రజలతో అతనికి ఏర్పడే బంధాలు మిమ్మల్ని పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి.
3. ది ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ (The Aam Aadmi Family)
ఎక్కడ చూడవచ్చు?: జీ5 (ZEE5)
{{/usCountry}}ఎక్కడ చూడవచ్చు?: జీ5 (ZEE5)
{{/usCountry}}ఐఎండీబీ రేటింగ్: 8.4/10
ఢిల్లీలో నివసించే మధ్యతరగతి 'శర్మ కుటుంబం' కథ ఇది. రాత్రింబవళ్లు కష్టపడే తండ్రి, ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడే తల్లి, ఎప్పుడూ ముచ్చట్లలో మునిగిపోయే నానమ్మ, తమ కెరీర్‌ను నిర్మించుకునే పనిలో పడ్డ ఇద్దరు పిల్లలు.. ఈ క్యారెక్టర్లు చూస్తుంటే మన పక్కింటి వాళ్లనో లేక మన కుటుంబాన్నో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లో జరిగే రోజువారీ గొడవలు, వాటి వెనుక ఉండే ప్రేమను కామెడీతో మిక్స్ చేసి చూపించారు.
4. ఘర్ వాప్సీ (Ghar Waapsi)
ఎక్కడ చూడవచ్చు?: జియోహాట్‌స్టార్ (Jio Hotstar)
ఐఎండీబీ రేటింగ్: 8.8/10
బెంగళూరు లాంటి మెట్రో సిటీలో ఒక టాప్ కార్పొరేట్ ఉద్యోగం చేస్తున్న శేఖర్, అకస్మాత్తుగా జాబ్ కోల్పోతాడు. దాంతో చేసేదేమీ లేక ఇండోర్‌లోని తన సొంత ఇంటికి తిరిగి రావలసి వస్తుంది. తను వద్దనుకుని సిటీకి వెళ్లిన వాడు, మళ్లీ తన తల్లిదండ్రులు, తోబుట్టువులతో ఎలా కనెక్ట్ అయ్యాడు, జీవితం అసలైన అర్థాన్ని ఎలా తెలుసుకున్నాడు అనే పాయింట్‌ను గుండెకు హత్తుకునేలా స్క్రీన్ పైన ఆవిష్కరించారు.
5. పాట్‌లక్ (Potluck)
ఎక్కడ చూడవచ్చు?: సోనీలివ్ (SonyLIV)
ఐఎండీబీ రేటింగ్: 7.5/10
అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించిన శాస్త్రి కుటుంబ పెద్ద, ఒక వింత రూల్ పెడతాడు. తన పిల్లలందరూ కలిసి ప్రతి వారం 'పాట్‌లక్' (అందరూ కలిసి వండుకుని తినే విందు)లో తప్పకుండా కలవాలని ఆర్డర్ వేస్తాడు. ఆధునిక నగర జీవితంలో పడి దూరమవుతున్న బంధాలను, కుటుంబ విలువలను మళ్లీ ఎలా పునరుద్ధరించుకున్నారు అనేదే ఈ లైట్ హార్టెడ్ కామెడీ సిరీస్.
6. హోమ్ శాంతి (Home Shanti)
ఎక్కడ చూడవచ్చు?: జియో హాట్‌స్టార్ (Jio Hotstar)
ఐఎండీబీ రేటింగ్: 8.0/10
డెహ్రాడూన్‌కు చెందిన జోషి కుటుంబం కథ ఇది. సీనియర్ నటులు సుప్రియా పాఠక్, మనోజ్ పహ్వా ఇందులో తల్లిదండ్రులుగా నటించారు. ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తికి ఉండే లైఫ్ టైమ్ డ్రీమ్ అయిన 'సొంత ఇల్లు' కట్టుకునే క్రమంలో ఈ కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, కాంట్రాక్టర్ల తలనొప్పులు, వాటి మధ్య సాగే ఫన్నీ ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేస్తుంది.
7. నిర్మల్ పాఠక్ కీ ఘర్ వాప్సీ (Nirmal Pathak Ki Ghar Waapsi)
ఎక్కడ చూడవచ్చు?: సోనీలివ్ (SonyLIV)
ఐఎండీబీ రేటింగ్: 8.4/10
ఢిల్లీ లాంటి అల్ట్రా మోడర్న్ సిటీలో పెరిగిన నిర్మల్ పాఠక్ అనే రచయిత, 24 సంవత్సరాల తర్వాత బీహార్‌లోని తన సొంత గ్రామానికి వస్తాడు. మొదట్లో పల్లెటూరి వాతావరణం, పెద్ద కుటుంబం ఇచ్చే ప్రేమ అతనికి బాగా నచ్చుతాయి. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ, ఆ గ్రామంలో ఉండే పాతకాలపు మూఢనమ్మకాలు, కుల వివక్షలు, తన కుటుంబం గతాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక సీరియస్ సామాజిక అంశాన్ని ఫ్యామిలీ ఎమోషన్స్‌తో చక్కగా డీల్ చేశారు.
8. టీవీఎఫ్ ట్రిప్లింగ్ (TVF Tripling)
ఎక్కడ చూడవచ్చు?: జీ5 (ZEE5)
ఐఎండీబీ రేటింగ్: 8.5/10
విభిన్న మనస్తత్వాలు కలిగిన ముగ్గురు తోబుట్టువులు (చందన్, చంచల్, చిత్రవన్) తమ వ్యక్తిగత జీవితాల్లో రకరకాల సమస్యలతో సతమతమవుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా ముగ్గురూ కలిసి ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వాళ్ల మధ్య ఉన్న పాత కోపాలు పోయి, తోబుట్టువుల బంధం ఎంత బలపడింది అనేది రోడ్ అడ్వెంచర్ కామెడీ స్టైల్లో చూపించారు.
9. గ్రామ్ చికిత్సాలయ (Gram Chikitsalaya)
ఎక్కడ చూడవచ్చు?: అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
ఐఎండీబీ రేటింగ్: 7.1/10
ఒక యంగ్ డాక్టర్‌కు తన మొదటి పోస్టింగ్ ఉత్తర భారత దేశంలోని ఒక వెనుకబడిన గ్రామంలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) లో వస్తుంది. అక్కడ కనీస వసతులు, మందులు కూడా ఉండవు. పైగా ఆధునిక వైద్యం అంటే నమ్మకం లేని, అనుమాన పడే పల్లెటూరి జనాన్ని మెప్పించి, వాళ్లకు వైద్యం అందించడానికి ఆ డాక్టర్ పడే ఇబ్బందులు చాలా సహజంగా, నవ్వు తెప్పించేలా ఉంటాయి.