...
...
Next Story

Top Web Series: ఈ ఏడాది ఓటీటీని షేక్ చేసిన టాప్ 7 వెబ్ సిరీస్‌లు.. అన్నీ 8కిపైన రేటింగ్.. మీరు ఎన్ని చూశారు?

Top Web Series: ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, యూట్యూబ్ లలో విడుదలైన 7 హిందీ వెబ్ సిరీస్‌లు 8 లేదా అంతకంటే ఎక్కువ ఐఎండీబీ రేటింగ్‌తో టాప్ లో నిలిచాయి. ఈ జాబితాలో 'సప్నే వర్సెస్ ఎవ్రీవన్ సీజన్ 2' ఏకంగా 9.2 రేటింగ్‌తో అత్యధిక రేటింగ్ పొందిన వెబ్ సిరీస్‌గా నిలిచింది.

Published on: Nov 28, 2026, 08:00:44 IST
Advertisement

Top Web Series: ఈ ఏడాది ఓటీటీ ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని పంచింది. పలు టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ తోపాటు యూట్యూబ్ లోనూ కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ హిందీ వెబ్ సిరీస్‌లు విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. ఫ్యామిలీ కామెడీ నుంచి క్రైమ్ థ్రిల్లర్, వార్ డ్రామా, బయోగ్రాఫికల్ కథల వరకు విభిన్న జోనర్లలో వచ్చిన 7 వెబ్ సిరీస్‌లు ఈ ఏడాది 8.0 లేదా అంతకంటే ఎక్కువ ఐఎండీబీ (IMDb) రేటింగ్ సాధించి సత్తా చాటాయి. వీకెండ్ బింజ్-వాచ్ కోసం మీ వాచ్‌లిస్ట్‌లో తప్పకుండా ఉండాల్సిన ఆ 7 బ్లాక్‌బస్టర్ సిరీస్‌ల పూర్తి వివరాలు ఇవే.

Top Web Series: ఈ ఏడాది ఓటీటీని షేక్ చేసిన టాప్ 7 వెబ్ సిరీస్‌లు.. అన్నీ 8కిపైన రేటింగ్.. మీరు ఎన్ని చూశారు?
Top Web Series: ఈ ఏడాది ఓటీటీని షేక్ చేసిన టాప్ 7 వెబ్ సిరీస్‌లు.. అన్నీ 8కిపైన రేటింగ్.. మీరు ఎన్ని చూశారు?
ర్యాంక్వెబ్ సిరీస్ పేరుIMDb రేటింగ్ఓటీటీ ప్లాట్‌ఫామ్జోనర్
1సప్నే వర్సెస్ ఎవ్రీవన్ సీజన్ 29.2ప్రైమ్ వీడియోడ్రామా
2ఆపరేషన్ సఫేద్ సాగర్8.5నెట్‌ఫ్లిక్స్వార్ డ్రామా
3మేడ్ ఇన్ ఇండియా: ఏ టైటాన్ స్టోరీ8.5ప్రైమ్ వీడియోబయోగ్రాఫికల్ డ్రామా
4ఫ్యామిలీ కిరాణా స్టోర్8.4యూట్యూబ్ఫ్యామిలీ కామెడీ
5హుంకార్: ది రోర్8.3జియోహాట్‌స్టార్క్రైమ్ థ్రిల్లర్ / కోర్ట్‌రూమ్
6ఆదర్శ్ బాల్ విద్యాలయ8.1ప్రైమ్ వీడియోకామెడీ డ్రామా
7హలో బచ్చో8.0నెట్‌ఫ్లిక్స్బయోగ్రాఫికల్ డ్రామా
View All

1. హలో బచ్చో (Hello Bachhon)

IMDb రేటింగ్: 8.0

ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ (Netflix)

దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులకు సుపరిచితమైన 'ఫిజిక్స్ వాలా' (Physics Wallah) వ్యవస్థాపకుడు అలఖ్ పాండే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ డ్రామా ఇది. మొత్తం 5 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ మార్చి 6, 2026న స్ట్రీమింగ్‌కు వచ్చింది. వినీత్ కుమార్ సింగ్, గిరిజా ఓక్, సత్యేంద్ర సోని ప్రధాన పాత్రల్లో అద్భుతంగా నటించారు.

2. ఆదర్శ్ బాల్ విద్యాలయ (Adarsh Baal Vidyalaya)

ఓటీటీ: ప్రైమ్ వీడియో (Prime Video)

నవ్వులతో పాటు ఆలోచింపజేసే 7 ఎపిసోడ్ల కామెడీ డ్రామా సిరీస్ ఇది. ఢిల్లీలోని 'టింకీ టోలీ' అనే కల్పిత ప్రాంతంలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాల చుట్టూ ఈ కథ సరదాగా సాగుతుంది. కె.కె. మీనన్, అర్చన పూరన్ సింగ్, నవీన్ కస్తూరియా, అభిమన్యు సింగ్, ప్రసన్న బిష్ట్ తమ నటనతో సిరీస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు.

3. హుంకార్: ది రోర్ (Hunkaar: The Roar)

IMDb రేటింగ్: 8.3

ఓటీటీ: జియోహాట్‌స్టార్ (JioHotstar)

ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్, కోర్ట్‌రూమ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. నగరంలోని ఓ పేరుమోసిన బాబాపై అత్యాచార ఆరోపణలు చేసిన 'మీను రావత్' అనే యువతి న్యాయపోరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఫాతిమా సనా షేక్, అనీత్ పడ్డా, రఘుబీర్ యాదవ్, జీషాన్ అయూబ్, అర్జున్ మాథుర్ కీలక పాత్రల్లో మెరిశారు.

4. ఫ్యామిలీ కిరాణా స్టోర్ (Family Kirana Store)

IMDb రేటింగ్: 8.4

ఓటీటీ: యూట్యూబ్ (YouTube)

పైసా ఖర్చు లేకుండా ఉచితంగా కుటుంబమంతా కలిసి హాయిగా నవ్వుకునే ఫ్యామిలీ కామెడీ సిరీస్ ఇది. ఈ ఏడాది విడుదలై విపరీతమైన ఆదరణ పొందిన ఈ సిరీస్ ఇప్పటికే మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ప్రతి శుక్రవారం యూట్యూబ్‌లో కొత్త ఎపిసోడ్ విడుదలవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది.

5. మేడ్ ఇన్ ఇండియా: ఏ టైటాన్ స్టోరీ (Made in India: A Titan Story)

IMDb రేటింగ్: 8.5

ఓటీటీ: ప్రైమ్ వీడియో (Prime Video)/ఎంఎక్స్ ప్లేయర్

దేశంలో ప్రఖ్యాత వాచ్ బ్రాండ్ 'టైటాన్' (Titan) పుట్టుక, అది ప్రపంచ స్థాయి బ్రాండ్‌గా ఎదిగిన స్ఫూర్తిదాయక ప్రస్థానాన్ని ఆవిష్కరించే బయోగ్రాఫికల్ డ్రామా ఇది. జూన్ 2026లో విడుదలైన ఈ సిరీస్‌లో జిమ్ సర్భ్, దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా ప్రధాన పాత్రల్లో అద్భుత నటనతో కట్టిపడేశారు.

6. ఆపరేషన్ సఫేద్ సాగర్ (Operation Safed Sagar)

IMDb రేటింగ్: 8.5

ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ (Netflix)

ఆగస్టు 7న విడుదలైన ఈ 6 ఎపిసోడ్ల వార్ డ్రామా ప్రేక్షకుల్లో దేశభక్తిని రగిలించింది. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో భారత వైమానిక దళానికి చెందిన ‘గోల్డెన్ ఆరోస్ స్క్వాడ్రన్’ పోషించిన సాహసోపేత పాత్రను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడైన సిద్ధార్థ్ తో పాటు జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ, మిహిర్ అహుజా, తారూఖ్ రైనా ముఖ్య పాత్రలు పోషించారు.

7. సప్నే వర్సెస్ ఎవ్రీవన్ సీజన్ 2 (Sapne vs Everyone Season 2)

IMDb రేటింగ్: 9.2

ఓటీటీ: ప్రైమ్ వీడియో (Prime Video)

2026లో అత్యధిక ఐఎండీబీ రేటింగ్ సాధించిన నంబర్ 1 వెబ్ సిరీస్‌గా ‘సప్నే వర్సెస్ ఎవ్రీవన్ సీజన్ 2’ సరికొత్త రికార్డు సృష్టించింది. తమ కలలను సాకారం చేసుకునే క్రమంలో జిమ్మీ, ప్రశాంత్ ఎదుర్కొనే విభిన్న సవాళ్లను, వాటిని వాళ్లు తమదైన శైలిలో ఎలా అధిగమించారనే అంశాన్ని అత్యంత హృద్యంగా చూపించారు. అంబరీష్ వర్మ, పరంవీర్ చీమా, విజయంత్ కోహ్లీ, నవీన్ కస్తూరియా, అక్షత్ గ్రోవర్ ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలు పోషించారు.

కంటెంట్ పరంగా వైవిధ్యం, నటీనటుల సహజమైన అభినయంతో మెప్పించిన ఈ 7 సిరీస్‌లు 2026 ఓటీటీ జాబితాలో టాప్‌లో నిలిచాయి. వీటిలో మీరు ఇంకా ఏవైనా మిస్ అయి ఉంటే, ఈ వీకెండ్‌లో తప్పకుండా చూసేయండి.

 

ABOUT THE AUTHOR

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks