Top Telugu Influencer: ఓటీటీలోకి రష్మి, హర్ష, లక్ష్మీ మంచు మరో సూపర్ షో.. తెలుగులో టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరు?
Top Telugu Influencer: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ షో రాబోతోంది. రష్మి, వైవా హర్ష, లక్ష్మీ మంచు కాంబినేషన్ లో రాబోతున్న ఈ షో తెలుగులో టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరో తేల్చబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది.
Top Telugu Influencer: తెలుగు ఓటీటీ స్పేస్ లోకి మరో ఇంట్రెస్టింగ్ షో రాబోతోంది. ఈ షో పేరు ‘టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్’. సోషల్ మీడియాలోని ఇన్‌ఫ్లుయెన్సర్లను జల్లెడ పట్టి వాళ్లలో బెస్ట్ ఎవరో తేల్చే షో ఇది. తాజాగా మంగళవారం (జూన్ 23) ఈ షో ప్రోమోను ఆహా వీడియో ఓటీటీ రిలీజ్ చేసింది.

టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్.. ఎప్పటి నుంచంటే?
సోషల్ మీడియా పాపులర్ అయినప్పటి నుంచీ ప్రతి ఒక్కరూ ఇన్‌ఫ్లుయెన్సర్ అయిపోతున్నారు. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్.. ఇలా ఎక్కడ చూసినా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కొదవే లేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ అలాంటి వాళ్లు చాలా మందే ఉన్నారు. మరి వాళ్లలో టాప్ ఎవరు? ఇది తేల్చడానికి ఆహా వీడియో ఈ సరికొత్త షో ప్రారంభించబోతోంది. ఈ షో జులై 3వ తేదీన ప్రారంభం కాబోతోంది. ప్రతి శుక్రవారం ఒక కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది.
క్రేజీ కాంబినేషన్‌లో షో
ఈ షోకి హోస్టులుగా ఉన్న వారిని చూస్తే ఇదో క్రేజీ కాంబినేషన్ అనిపించకమానదు. తెలుగు రాష్ట్రాల్లో టాప్ యాంకర్లలో ఒకరిగా ఉన్న రష్మి గౌతమ్ తోపాటు కమెడియన్ హర్ష చెముడు, ప్రముఖ నటి లక్ష్మీ మంచు ఈ టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్ షోకి హోస్టులుగా ఉండటం విశేషం. ఈ ముగ్గురితో చేసిన ప్రోమోను ఆహా వీడియో ఓటీటీలో మంగళవారం (జూన్ 23) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎలా?
ఈ ప్రోమో మొదట్లోనే వాళ్లు రియల్ వరల్డ్ లోనూ ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలరా? అని రాసి ఉన్న బోర్డు కనిపిస్తుంది. ఆ తర్వాత యాంకర్ రష్మి తెరపైకి వస్తుంది. సోషల్ మీడియాలో అందరూ ఇన్‌ఫ్లుయెన్సర్సే.. అసలు టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరు? అని ఆమె అడుగుతుంది.
ఈజీ.. ఎవరికి ఎక్కువ ఫాలోవర్లు ఉంటే వాళ్లే అంటూ హర్ష చెముడు ఎంట్రీ ఇస్తాడు. కాదు అంటూ లక్ష్మీ మంచు ఎంటరవుతుంది. ఫాలోవర్లను, లైక్స్ ను కొనుక్కోవచ్చు అని అంటుంది. మరి అసలుసిసలు ఇన్‌ఫ్లుయెన్సర్ ను ఎలా కనిపెట్టాలి అని రష్మి అడుగుతుంది.
అందుకోసమే ఈ షో.. పది మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు, వన్ షో డౌన్.. 50 శాతం జ్యూరీ.. 50 శాతం లైవ్ ఆడియెన్స్ కలిసి టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్ ను కనిపెడతారు అని లక్ష్మీ మంచు అనౌన్స్ చేసింది.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో షో
తెలుగు ఓటీటీ స్పేస్ లో ఇలా బెస్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరన్నది కనిపెట్టే షో రానుండటం నిజంగా ఓ డిఫరెంట్ కాన్సెప్టే అని చెప్పాలి. అందులోనూ రష్మి, హర్ష, లక్ష్మీ మంచు దీనికి హోస్టులగా ఉండటం కూడా ఆసక్తి రేపుతోంది. మరి టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్ ను వీళ్లు ఎలా ఎంపిక చేస్తారు? దానికోసం ఎలాంటి పరీక్షలు పెట్టబోతున్నారు అన్నది ఈ షో చూస్తే తెలుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


