Web Series OTT: ఈ వీకెండ్ టాప్‌ వెబ్ సిరీస్‌లు.. బింజ్ వాచ్‌కు పర్ఫెక్ట్‌.. కామెడీ, స్కామ్‌, మిస్ట‌రీ థ్రిల్ల‌ర్!

Web Series OTT: ఈ వీకెండ్ ఓటీటీ ప్రేక్షకులకు వినోదం డబుల్ కానుంది. భువన్ బామ్ కామెడీ సిరీస్ ‘దిండోరా సీజన్ 2’ నుంచి మిస్టరీ థ్రిల్లర్ ‘మాంగ్లిక్’ వరకు బింజ్ వాచ్ కు పర్ఫెక్ట్ సిరీస్ లు వచ్చేశాయి. ఈ వారం తప్పక చూడాల్సిన టాప్ వెబ్ సిరీస్‌ల పూర్తి వివరాలు ఇవే.

Published on: Nov 20, 2026, 19:42:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Web Series OTT: వీకెండ్ వచ్చేసిందంటే చాలు.. ఇంట్లోనే హాయిగా కొత్త వెబ్ సిరీస్‌లు చూస్తూ గడపాలనుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ వారం ప్రముఖ ఓటీటీ వేదికలైన నెట్‌ఫ్లిక్స్, జీ5లో నాలుగు ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్, రొమాన్స్, బయోగ్రాఫికల్ డ్రామా ఇలా భిన్న జానర్లలో వచ్చిన ఈ సిరీస్‌ల వివరాలు చూద్దాం.

ఈ వీకెండ్ టాప్‌ వెబ్ సిరీస్‌లు.. బింజ్ వాచ్‌కు పర్ఫెక్ట్‌.. కామెడీ, స్కామ్‌, మిస్ట‌రీ థ్రిల్ల‌ర్!
ఈ వీకెండ్ టాప్‌ వెబ్ సిరీస్‌లు.. బింజ్ వాచ్‌కు పర్ఫెక్ట్‌.. కామెడీ, స్కామ్‌, మిస్ట‌రీ థ్రిల్ల‌ర్!

దిండోరా: సీజన్ 2 (Dhindora: Season 2)

ప్రముఖ యూట్యూబర్, నటుడు భువన్ బామ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'దిండోరా సీజన్ 2' నవంబర్ 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. తొలి సీజన్ యూట్యూబ్‌లో 50 కోట్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించగా, రెండో సీజన్‌ను మరింత భారీ బడ్జెట్‌తో నెట్‌ఫ్లిక్స్ వేదికగా తీసుకొచ్చారు.

స్నేహ శెట్టి కోహ్లీ దర్శకత్వంలో 8 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో భువన్ బామ్ మరోసారి టిటూ మామ, బబ్లూ జీ, జాంకీ, సమీర్, బాంచో సహా పలు విభిన్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నాడు. రూ.11 కోట్ల లాటరీ వ్యవహారం తర్వాత ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకోవడానికి, అత్తింటి వారితో సంబంధాలు చక్కదిద్దుకోవడానికి టిటూ మామ చేసే ప్రయత్నాలు కడుపుబ్బా నవ్విస్తాయి.

ది ఆల్ట్రూయిస్ట్స్' (The Altruists)

నిజ జీవిత ఆర్థిక కుంభకోణాలపై ఆసక్తి ఉన్నవారికి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ది ఆల్ట్రూయిస్ట్స్' బెస్ట్ ఛాయిస్. నవంబర్ 19న విడుదలైన ఈ 8 ఎపిసోడ్ల బయోగ్రాఫికల్ డ్రామా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన FTX క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ పతనం వెనుక జరిగిన నాటకీయ పరిణామాలను ఇందులో ఆసక్తికరంగా చూపించారు.

సామ్ బ్యాంక్‌మన్-ఫ్రైడ్ పాత్రలో ఆంథోనీ బాయిల్, కరోలిన్ ఎలిసన్ పాత్రలో జూలియా గార్నర్ అద్భుతంగా నటించారు. గ్రాహం మూర్ రూపొందించిన ఈ సిరీస్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా నిర్మాణ సంస్థ 'హయ్యర్ గ్రౌండ్' ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం విశేషం.

మాంగ్లిక్ (Manglik)

సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్లను ఇష్టపడే వారి కోసం నెట్‌ఫ్లిక్స్‌లో 'మాంగ్లిక్' హిందీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్‌లో సౌమిత్రిషా కుందు, గౌరబ్ ఛటర్జీ, లాబోనీ సర్కార్ ప్రధాన పాత్రలు పోషించారు. కుజ దోషం (మాంగ్లిక్) ఉందనే ప్రచారం ఉన్న సిద్ధార్థ అనే యువకుడిని ఇరా ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే పెళ్లి తర్వాత ఇరా అనుమానాస్పదంగా అనారోగ్యానికి గురవుతుంది.

తొలుత ఇదంతా జ్యోతిష్యం, మూఢనమ్మకం వల్ల జరుగుతోందని భావించినా, ఆ ఇంటి వెనుక ఏదో భయంకరమైన రహస్యం దాగి ఉందని ఆమెకు అనుమానం కలుగుతుంది. ఆ తర్వాత జరిగే మిస్టరీ ట్విస్టులు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయి.

తీన్ తిగాడా (Teen Tigada)

యువత, కుటుంబ ప్రేక్షకులను అలరించేందుకు 'తీన్ తిగాడా' అనే హిందీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా నవంబర్ 20న జీ5 (ZEE5)లో విడుదలైంది. రాజీవ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ 9 ఎపిసోడ్ల సిరీస్‌లో ప్రసన్న బిష్ట్, డానేష్ రజ్వీ జంటగా నటించారు. ముంబై నేపథ్యంలో సాగే ఈ కథలో ఆస్మాని జాతీయ స్థాయి క్రికెటర్ కావాలని కలలు కంటుంది. మానస్ తన బ్యాండ్‌తో మ్యూజిక్ రంగంలో రాణించాలని ప్రయత్నిస్తుంటాడు.

కెరీర్ లక్ష్యాలతో ముందుకు సాగుతున్న ఈ ప్రేమ జంట జీవితంలో అనుకోని విధంగా ప్రెగ్నెన్సీ వార్త ఎదురవుతుంది. ఆ తర్వాత వారి ప్రేమ, కెరీర్, కుటుంబ బాధ్యతల మధ్య నడిచే భావోద్వేగ ప్రయాణమే ఈ సిరీస్ ప్రధాన కథాంశం.

మొత్తానికి ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి నవ్వుకోవాలంటే 'దిండోరా 2', థ్రిల్ కావాలంటే 'మాంగ్లిక్', రియల్ లైఫ్ డ్రామా కోసం తెలుగులో 'ది ఆల్ట్రూయిస్ట్స్', లైట్ హార్టెడ్ రొమాన్స్ కోసం 'తీన్ తిగాడా' సిరీస్‌లను హాయిగా చూసేయొచ్చు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More