...
...
Next Story

Toxic Collections: టాక్సిక్ కు మైండ్ బ్లోయింగ్ షాక్.. రెండో రోజు 64 శాతం పడిపోయిన కలెక్షన్లు.. యశ్ కు డ్యామేజీ!

Toxic Collections: రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ సినిమాకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీకి రెండో రోజు వసూళ్లు ఏకంగా 64 శాతం పడిపోయాయి. మరోవైపు టాక్సిక్ సినిమాతో యశ్ కు కూడా డ్యామేజీ కలుగుతోందనే టాక్ వినిపిస్తోంది.

Published on: Aug 28, 2026, 09:59:13 IST
Advertisement

Toxic Collections: తొలిరోజే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి అదరగొట్టిన రాకింగ్ స్టార్ యశ్ తాజా చిత్రం 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (Toxic: A Fairy Tale for Grown-Ups)కు రెండో రోజు దిమ్మతిరిగే షాక్ తగిలింది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ స్పీడ్ ఒక్కసారిగా పడిపోయింది.

టాక్సిక్ కలెక్షన్లు

టాక్సిక్ కు మైండ్ బ్లోయింగ్ షాక్.. రెండో రోజు 64 శాతం పడిపోయిన కలెక్షన్లు.. యశ్ కు డ్యామేజీ!
టాక్సిక్ కు మైండ్ బ్లోయింగ్ షాక్.. రెండో రోజు 64 శాతం పడిపోయిన కలెక్షన్లు.. యశ్ కు డ్యామేజీ!

ట్రేడ్ అనలిస్ట్ సంస్థ 'సాక్‌నిల్క్' (Sacnilk) గణాంకాల ప్రకారం 'టాక్సిక్' చిత్రం గురువారం (ఆగస్టు 27) ఇండియాలో రూ.36.40 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే సాధించింది. దేశవ్యాప్తంగా 19,413 షోలలో ఈ సినిమా సగటున 26.6 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

64 శాతం తక్కువ

రెండో రోజు టాక్సిక్ కలెక్షన్లు ఏకంగా 64 శాతం పడిపోవడం గమనార్హం. తొలిరోజున రూ.101.10 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన టాక్సిక్ చిత్రం, రెండో రోజున ఏకంగా 64 శాతం మేర వసూళ్లలో డిప్ చూసింది. దీంతో రెండు రోజులు పూర్తయ్యేసరికి భారత బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మొత్తం నెట్ వసూళ్లు రూ.137.50 కోట్లకు చేరుకున్నాయి.

హిందీలో ఎక్కువ

కన్నడ చిత్రం అయినప్పటికీ టాక్సిక్ మూవీ హిందీ వెర్షన్‌లోనే మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. హిందీ తర్వాత తెలుగు వెర్షన్ మంచి వసూళ్లతో రెండో స్థానంలో నిలవగా, తమిళ, మలయాళ డబ్బింగ్ వెర్షన్ల ప్రదర్శన మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. మొదటి రోజున హిందీలో రూ.55 కోట్లు, కన్నడలో రూ.23.30 కోట్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున రూ.140 కోట్ల గ్రాస్ సాధించిన ఈ సినిమా, వీకెండ్‌లో మళ్లీ పుంజుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

'ధురంధర్ 2'తో పోలిక

ప్రస్తుతం ఈ ఏడాది భారత బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2', 'బోర్డర్ 2', 'పెద్ది', 'జన నాయగన్', 'కరుప్పు' చిత్రాలు అగ్రస్థానాల్లో కొనసాగుతున్నాయి. రాబోయే వీకెండ్ లో ‘టాక్సిక్' గనుక మంచి హోల్డ్ సాధిస్తే, ఈ టాప్ సినిమాల సరసన చేరే అవకాశం ఉంది.

యశ్ కు డ్యామేజీ

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన టాక్సిక్ ను కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ఎల్ఎల్‌పి పతాకాలపై వెంకట్ కె నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో యశ్ 'రాయా', 'టికెట్' అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించారు. కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

యాక్టింగ్ పరంగా టాక్సిక్ లో యశ్ కు మంచి మార్కులే పడుతున్నాయి. కానీ కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన యశ్.. ఇలాంటి కథను ఓకే చేయడమే కాకుండా ప్రొడ్యూస్ కూడా చేయడం ఏంటీ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు ఈ సినిమాలో కథే లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇది యశ్ కు డ్యామేజీ కలిగించేదనే టాక్ వినిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks