Toxic Censor Review: 18+ వాళ్లకు మాత్రమే.. షాకింగ్ టాక్సిక్ సెన్సార్ రివ్యూ.. ధురంధర్ సినిమాలను మించిన హింస, శృంగారం!

Toxic Censor Review: రాకింగ్ స్టార్ యష్ 'టాక్సిక్' చిత్రానికి యూకే సెన్సార్ బోర్డు షాకిచ్చింది. ఏకంగా 18+ సర్టిఫికేట్ ఇచ్చింది. హింస, శృంగార దృశ్యాల్లో బాలీవుడ్ 'ధురంధర్' సినిమాలను మించి టాక్సిక్ ఉందని వెల్లడించింది. ఇప్పుడీ సెన్సార్ రివ్యూ తెగ వైరల్ గా మారింది. 

Published on: Aug 20, 2026, 11:18:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Toxic Censor Review: రాకింగ్ స్టార్ యష్, గీతూ మోహన్ దాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (Toxic: A Fairy Tale for Grown-Ups). ఈ మూవీ డిజిటల్, సినీ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పశ్చిమాసియా సంఘర్షణల నేపథ్యంలో బాలీవుడ్ చిత్రం 'ధురందర్: ది రివేంజ్'తో పోటీ నుంచి తప్పుకున్న ఈ సినిమా, ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

18+ వాళ్లకు మాత్రమే.. షాకింగ్ టాక్సిక్ సెన్సార్ రివ్యూ.. ధురంధర్ సినిమాలను మించిన హింస, శృంగారం!
18+ వాళ్లకు మాత్రమే.. షాకింగ్ టాక్సిక్ సెన్సార్ రివ్యూ.. ధురంధర్ సినిమాలను మించిన హింస, శృంగారం!

టాక్సిక్ సెన్సార్ రివ్యూ

తాజాగా టాక్సిక్ సెన్సార్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రానికి బ్రిటీష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ (BBFC) యూకేలో అత్యంత కఠినమైన '18+' (Adults Only) సర్టిఫికేట్‌ను కేటాయించింది. బాలీవుడ్ చిత్రం 'ధురందర్' మూవీ సిరీస్ కంటే కూడా 'టాక్సిక్'లో అత్యంత దారుణమైన హింస, రక్తపాతం, శృంగార దృశ్యాలు ఉన్నాయని యూకే సెన్సార్ బోర్డు తన నివేదికలో వెల్లడించింది.

షాకింగ్ విషయాలు

యూకే సెన్సార్ బోర్డు ఈ సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియలో ఒక చిన్న పొరపాటు చేసింది. 'టాక్సిక్' కన్నడ చిత్రాన్ని తమిళ సినిమాగా పొరపాటున వర్గీకరించింది. ఈ సినిమా కథాంశం గురించి ప్రస్తావిస్తూ.. "గోవాలో రౌడీ ముఠా సామ్రాజ్యాన్ని ఏలే ఒక శక్తివంతమైన డ్రగ్ కార్టెల్ నాయకుడు, తన సొంత నాశనానికి తానే ఎలా బీజం వేసుకున్నాడు అనేదే ఈ సినిమా కథ" అని బిబిఎఫ్సి పేర్కొంది.

సెక్స్ ఎక్కువ

ఇక కంటెంట్ తీవ్రత విషయానికి వస్తే.. బిబిఎఫ్సి ఈ చిత్రానికి మైండ్ బ్లాకింగ్ రేటింగ్స్ ఇచ్చింది. హింస (Violence), శృంగారం (Sex), గాయాల తీవ్రత (Injury Detail) విభాగాల్లో ఏకంగా 5/5 రేటింగ్ ఇచ్చింది. అలాగే భయాందోళనలు (Threat & Horror), అభ్యంతరకర భాష (Language), డ్రగ్స్ వినియోగం (Drugs), లైంగిక హింస (Sexual Violence), ఆత్మహత్య/స్వయంగా హాని చేసుకోవడం (Suicide & Self-harm) వంటి కేటగిరీలలో 4/5 రేటింగ్ ఇచ్చింది.

రన్ టైమ్

టాక్సిక్ రన్ టైమ్ కూడా రివీలైంది. యష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం యూకేలో 191 నిమిషాల 41 సెకన్ల (దాదాపు 3 గంటల 11 నిమిషాలు) నిడివితో విడుదల కానుంది.

వైలెన్స్.. వైలెన్స్

సినిమాలోని వైలెన్స్ గురించి బిబిఎఫ్సి పూర్తి వివరాలను బయటపెట్టింది. "ఈ సినిమాలో అత్యంత తీవ్రమైన హింస ఉంది. కాల్చివేతలు, కత్తులతో పొడవడాలు, నరాలు నరికేయడం, దారుణంగా బాదడం, చిత్రహింసలు, ఉరితీయడం, సజీవ దహనాలు, శరీర భాగాలను విడదీయడం వంటి భయంకరమైన దృశ్యాలు ఉన్నాయి’’ అని బిబిఎఫ్సి వివరించింది.

అంతేకాకుండా, స్ట్రిప్ క్లబ్‌లలో చిత్రీకరించిన లైంగిక, శృంగార సన్నివేశాలు కూడా చిత్రంలో ఉన్నాయని స్పష్టం చేసింది.

"మృతదేహాలు, తెగిపడిన శరీర భాగాలు, తీవ్రమైన గాయాల నుంచి కారే రక్తం, రక్తం మడుగులు లాంటి దారుణమైన దృశ్యాలు కనిపిస్తాయి" అని సెన్సార్ బోర్డు తెలిపింది. వీటితో పాటు బాలల లైంగిక వేధింపులను సూచించేలా ఉన్న ఒక సీన్, అత్యంత కఠినమైన బూతులు, డ్రగ్స్ వాడకం వంటివి ఈ చిత్రంలో ఉన్నాయని వెల్లడించింది.

'ధురంధర్' సినిమాలతో పోలిక

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురందర్' మొదటి భాగం 2025లో, 'ధురందర్ 2' ఈ ఏడాది మార్చిలో విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా యూకేలో 18+ రేటింగ్ పొందాయి. అయితే అవి కేవలం హింస విభాగంలో మాత్రమే 5/5 రేటింగ్ సాధించాయి. మిగిలిన విభాగాల్లో తక్కువ రేటింగ్స్ పొందాయి.

ఉదాహరణకు, మొదటి 'ధురందర్' చిత్రానికి శృంగార విభాగంలో 2/5, వివక్షలో 3/5 రేటింగ్ రాగా, 'ధురందర్ 2'కు శృంగారంలో 3/5, గాయాల తీవ్రతలో 4/5 రేటింగ్స్ లభించాయి. దీనిని బట్టి రణ్‌వీర్ సింగ్ 'ధురందర్' చిత్రాల కంటే కూడా యష్ 'టాక్సిక్' చిత్రంలో శృంగారం, రక్తపాతం, బీభత్సం చాలా ఎక్కువగా ఉన్నాయని అర్థమవుతోంది.

విమర్శల తుఫాను

కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి పతాకాలపై వెంకట నారాయణ, యష్ నిర్మిస్తున్న టాక్సిక్ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి అగ్ర కథానాయికలు నటిస్తున్నారు.

కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, భారతదేశంలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కాగా, ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో విపరీతమైన వైలెన్స్, బోల్డ్ సన్నివేశాలు ఉండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆగస్టు 26న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More