Toxic Censor: టాక్సిక్‌తో య‌శ్‌ రిస్క్- అంత‌సేపు థియేట‌ర్లో కూర్చోబెడ‌తాడా? సెన్సార్ పూర్తి-సీన్లు కట్- రన్ టైమ్ ఎంతంటే?

Toxic Censor: ​రాకింగ్ స్టార్ యశ్ నటించిన పాన్ వరల్డ్ మూవీ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సెన్సార్ పరీక్షను దాటినట్లు టాక్. ఈ మూవీ రన్ టైమ్ పరంగా యశ్ రిస్క్ చేస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతసేపు థియేటర్లో ఆడియన్స్ ను కూర్చోబెట్టడం రిస్కే. టాక్సిక్ సెన్సార్ పూర్తి వివరాలు.

Published on: Aug 11, 2026, 05:44:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Toxic Censor: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ డార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్’ (Toxic: A Fairytale for Grown-Ups). ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు టాక్. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి 'A' (Adults Only) సర్టిఫికేట్‌ను జారీ చేసిందని తెలిసింది.

టాక్సిక్‌తో య‌శ్‌ రిస్క్- అంత‌సేపు థియేట‌ర్లో జ‌నాల‌ను కూర్చోబెడ‌తాడా? సెన్సార్ కంప్లీట్- రన్ టైమ్ ఎంతంటే?
టాక్సిక్‌తో య‌శ్‌ రిస్క్- అంత‌సేపు థియేట‌ర్లో జ‌నాల‌ను కూర్చోబెడ‌తాడా? సెన్సార్ కంప్లీట్- రన్ టైమ్ ఎంతంటే?

టాక్సిక్ సెన్సార్

టాక్సిక్ సినిమా సెన్సార్‌కి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ మూవీ సెన్సార్ పరీక్షను దాటిందని చెప్తున్నారు. అయితే భారతీయ సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా ఇండియాలో విడుదలయ్యే వెర్షన్‌లో కొన్ని సీన్లకు కట్ చెప్పారని తెలిసింది. అయితే, ఓవర్సీస్ (విదేశాల) ఆడియన్స్‌కు మాత్రం ఎలాంటి కట్స్ లేని పూర్తి ‘అన్‌కట్ వెర్షన్’ అందుబాటులోకి రానుంది.

​యానిమల్, పుష్ప 2 బాటలోనే ‘టాక్సిక్’

​ఇటీవలి కాలంలో భారతీయ చిత్రసీమలో భారీ పాన్ ఇండియా చిత్రాలకు డిమాండ్ పెరగడంతో పాటు రన్ టైమ్ విషయంలోనూ దర్శకులు వెనక్కి తగ్గడం లేదు. యశ్ తాజా మూవీ టాక్సిక్ రన్ టైమ్ మొత్తం 191 నిమిషాలు (3 గంటల 11 నిమిషాలు) నిడివితో లాక్ అయిందని తెలిసింది.

గతంలో వచ్చిన రణ్‌బీర్ కపూర్ 'యానిమల్', అల్లు అర్జున్ 'పుష్ప 2' చిత్రాల తరహాలోనే యశ్ 'టాక్సిక్' కూడా 3 గంటలకు పైగా విజువల్స్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాతో ఆడియన్స్‌ను మెప్పించడానికి సిద్ధమైంది.

యశ్ రిస్క్

ఇప్పుడు జనాలు థియేటర్లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం గగనమైపోయింది. ఓటీటీలో చూసుకోవచ్చులే అని థియేటర్లకు వెళ్లడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆడియన్స్ ను 3 గంటల 11 నిమిషాల పాటు థియేటర్లో కూర్చునేలా చేయడంలో యశ్ రిస్క్ తీసుకుంటున్నాడనే టాక్ వినిపిస్తోంది. మూవీ ఫ్లో పర్ఫెక్ట్ గా ఉండి, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, థ్రిల్ కలిగించేలా స్టోరీ ఉంటే ఓకే. కానీ ఏదైనా తేడా కొడితే మాత్రం ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవడం ఖాయం.

​ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా

​గీతూ మోహన్ దాస్ అండ్ యశ్ సంయుక్తంగా కథ అందించిన టాక్సిక్ భారీ చిత్రాన్ని కన్నడ అండ్ ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి నిర్మించారు. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

​ఈ చిత్రం ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో థియేటర్లలోకి అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ లో రిలీజ్ కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More