Vijay Jana Nayagan Censor Rumors: విజయ్ జన నాయగన్ ఫేక్ సెన్సార్ సర్టిఫికేట్ కలకలం.. 'A' రేటింగ్ వార్తలపై క్లారిటీ!
Vijay Jana Nayagan Censor Rumors: కోలీవుడ్ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మోస్ట్ అవైటెడ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ సెన్సార్‌పై సోషల్ మీడియాలో కలకలం రేగింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికేట్ ఇచ్చిందంటూ శనివారం ఉదయం నుంచి ఓ సర్టిఫికేట్ చక్కర్లు కొడుతోంది. అసలు నిజం ఏంటో తెలుసుకోండి.
Vijay Jana Nayagan Censor Rumors: హెచ్. వినోద్ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘జన నాయగన్’. గత ఏడు నెలలుగా సెన్సార్ ఇబ్బందుల వల్ల ఈ సినిమా విడుదల నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం (జూలై 4) ఉదయం ఈ చిత్రానికి సంబంధించిన ఒక సెన్సార్ సర్టిఫికేట్ నెట్టింట విపరీతంగా వైరల్ అయింది.

జన నాయగన్ సెన్సార్ సర్టిఫికేట్
ఒక దళపతి విజయ్ ఫ్యాన్ అకౌంట్ ట్విట్టర్ (X) వేదికగా ఈ సర్టిఫికేట్‌ను పోస్ట్ చేసింది. అందులో జన నాయగన్ సినిమా రన్‌టైమ్ 3 గంటలు ఉందని, సెన్సార్ బోర్డు (CBFC) దీనికి 'A' రేటింగ్ ఇచ్చిందని పేర్కొన్నారు. అంతేకాకుండా 'కలెక్టర్ షణ్ముగం' పాత్రను చంపే సీన్, బూతు మాటల మ్యూటింగ్, రక్తం చిందే హింసాత్మక దృశ్యాల కత్తిరింపుల వంటి వివరాలను కూడా ఆ ఫేక్ సర్టిఫికేట్‌లో పొందుపరిచారు.
అది ఫేక్
జన నాయగన్ సెన్సార్ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది కోలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీయడంతో సదరు ఫ్యాన్ పేజీ ఆ పోస్ట్‌ను తక్షణమే డిలీట్ చేసింది. తాము షేర్ చేసిన సర్టిఫికేట్ నకిలీదని, అభిమానులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నామని సదరు పేజీ ప్రకటించింది.
7 నెలలుగా నిరీక్షణ
కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన జన నాయగన్ మూవీ ఇంకా సెన్సార్ అనుమతుల కోసమే ఎదురుచూస్తోంది. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. చిత్రబృందం డిసెంబర్ 19, 2025న సెన్సార్‌కు పంపగా, బోర్డు కొన్ని మార్పులు సూచించింది. ఆ తర్వాత ఎగ్జామినింగ్ కమిటీ సభ్యుడొకరు ఫిర్యాదు చేయడంతో ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి పంపారు.
దీనిపై మేకర్స్ కోర్టును ఆశ్రయించినా ఎలాంటి ఉపశమనం లభించలేదు. దీంతో సినిమా విడుదలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే త్వరలోనే సెన్సార్ క్లియరెన్స్ వస్తుందని ప్రొడ్యూసర్ వెంకట్ కె. నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.
మూవీ లీక్
గడిచిన 7 నెలల కాలంలో ఈ జన నాయగన్ సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు నడిచాయి. ఏప్రిల్ నెలలో ఈ సినిమా హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఒక ఫ్రీలాన్స్ ఎడిటర్‌తో సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జూన్‌లో విజయ్ బర్త్‌డే కానుకగా సినిమా వస్తుందని ఆశించినా సెన్సార్ ఇష్యూస్ వల్ల అది సాధ్యపడలేదు.
లాస్ట్ సినిమా
నటుడు విజయ్ తన 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీ ద్వారా ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించి, మే నెలలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. విజయ్ పొలిటికల్ ఎంట్రీ అండ్ సీఎం పీఠం దక్కించుకున్న తర్వాత వస్తున్న కెరీర్ చివరి సినిమా జన నాయగన్. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


