Geetu Mohandas: రాకింగ్ స్టార్ యశ్ 'కేజీఎఫ్ 2' తర్వాత భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' డివైడ్ టాక్‌తో రచ్చ లేపుతోంది. రూ.140 కోట్ల పైచిలుకు వరల్డ్‌వైడ్ డే 1 కలెక్షన్స్ రాబట్టినప్పటికీ.. ఆడియన్స్ నుంచి వస్తున్న ట్రోల్స్ యశ్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
డైరెక్టర్ పాత ఇంటర్వ్యూ వైరల్

టాక్సిక్ సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నెటిజన్లు డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ 2021లో ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూను బయటకు తీసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఫిల్మ్ కాంపాన్సియన్‌కు ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో గీతూ తన రైటింగ్ ప్రాసెస్ గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ ప్రాజెక్ట్ స్క్రిప్టింగ్ వేళ తన ఆలోచనలు ఎలా మారాయో ఆ ఇంటర్వ్యూలో గీతూ స్పష్టంగా పంచుకున్నారు. సినిమా ఫలితాన్ని చూశాక ఆ కామెంట్స్ అక్షరాలా సరిపోయాయంటూ నెటిజన్లు మీమ్స్ కుమ్మరిస్తున్నారు.
"నేను స్క్రిప్ట్ సరిగ్గా రాయను!"
ఆ ఇంటర్వ్యూలో గీతూ మాట్లాడుతూ.. "నేను పేపర్‌పై ఏం రాస్తానో సెట్‌లోకి వెళ్లాక అది తీయను. రాసేటప్పుడు నాకు క్లారిటీ ఉండదు, షూటింగ్ చేసేటప్పుడు ఇంకోలా ఉంటుంది, ఎడిటింగ్‌లో మరో రూపం తీసుకుంటుంది" అని ఓపెన్‌గా చెప్పారు.
అంతేకాదు రైటర్స్ రూమ్‌లో ఉన్న మిగతా రచయితలు తన వర్కింగ్ ప్రాసెస్ చూసి విసిగిపోయారని తెలిపారు. ప్రొడ్యూసర్లకు కూడా తాను చదివించిన స్క్రిప్ట్ స్క్రీన్ మీద కనిపించదని ముందే చెబుతానని ఆమె అనడం గమనార్హం.
సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్
ఈ కామెంట్స్ బయటకు రావడంతో నెటిజన్లు కేవీఎన్ ప్రొడక్షన్స్‌పై సెటైర్లు వేస్తున్నారు. "ముందే ఈ డిస్‌క్లెయిమర్ విని ఉంటే ప్రొడ్యూసర్లు కాపాడుకునేవారు" అని కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరు 'టాక్సిక్: ది టార్చర్ - 70mm ఐమాక్స్' అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు.
{{/usCountry}}ఈ కామెంట్స్ బయటకు రావడంతో నెటిజన్లు కేవీఎన్ ప్రొడక్షన్స్‌పై సెటైర్లు వేస్తున్నారు. "ముందే ఈ డిస్‌క్లెయిమర్ విని ఉంటే ప్రొడ్యూసర్లు కాపాడుకునేవారు" అని కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరు 'టాక్సిక్: ది టార్చర్ - 70mm ఐమాక్స్' అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు.
{{/usCountry}}సినిమాపై క్లారిటీ, సరైన విజన్ లేకపోవడం వల్లే 'టాక్సిక్' అవుట్‌డేటెడ్ కంటెంట్‌లా ఉందంటూ యశ్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గీతూ మోహన్‌దాస్‌కు మద్దతుగా కొందరు..
అయితే మరోవైపు గీతూ మోహన్‌దాస్ వర్కింగ్ స్టైల్‌కు కొందరు మద్దతుగా నిలుస్తున్నారు. ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద దర్శకులు సెట్‌కి వెళ్లాక సీన్లను అప్పటికప్పుడు మార్చేస్తారని, ఒక లేడీ డైరెక్టర్ కావడంతోనే గీతూను కావాలని టార్గెట్ చేస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు.
గతంలో 'లయర్స్ డైస్', 'మూథోన్' లాంటి అవార్డ్ విన్నింగ్ చిత్రాలను తెరకెక్కించిన గీతూ.. ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామాను మహిళా కోణంలో నుంచి చెప్పడానికి ట్రై చేశారని వారు గుర్తు చేస్తున్నారు.
భారీ తారాగణం.. రికార్డ్ వసూళ్లు
నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి బిగ్ స్టార్ కాస్టింగ్‌తో వచ్చిన ఈ సినిమాకు యశ్ కూడా కథ, స్క్రీన్‌ప్లేలో భాగస్వామిగా ఉన్నాడు. డివైడ్ టాక్ ఉన్నప్పటికీ మొదటి రోజు ఏకంగా రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం యశ్ మాస్ క్రేజ్‌కు అద్దం పడుతోంది.
రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్స్ ఏ స్థాయిలో నిలబడతాయో, బాక్సాఫీస్ దగ్గర 'టాక్సిక్' ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.