Trisha Vijay: సందడి మొత్తం త్రిషదే.. ఆనందంతో వెలిగిపోయిన ముఖం.. విజయ్ పేరెంట్స్ పక్కనే సీటు.. వీడియోలు వైరల్

Trisha Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ‘సీ జోసెఫ్ విజయ్ అను నేను’ అంటూ ఆయన తమిళంలో ప్రమాణ స్వీకారం మొదలెట్టడంతో నెహ్రూ స్టేడియం మోగిపోయింది. అయితే ఈ ఈవెంట్లో సందడి మొత్తం త్రిషదేనని చెప్పొచ్చు. ఆమె వీడియోలు వైరల్ గా మారాయి. 

Published on: May 10, 2026, 10:48:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Trisha Vijay: ఎంతో ఉత్కంఠ, మరెంతో సస్పెన్స్.. నిమిషం నిమిషం మారే సమీకరణాలు.. బలం కోసం ఎడతెగని ప్రయత్నాలు.. చివరకు విజయ్ సాధించారు. దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు అధిపతిగా నిలిచారు. ‘సీ విజయ్ జోసెఫ్ అను నేను’ అంటూ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో సందడి మొత్తం త్రిషదే కావడం గమనార్హం.

విజయ్, త్రిష
విజయ్, త్రిష

స్పెషల్ అట్రాక్షన్ త్రిష

ఆదివారం (మే 10) చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు తమిళనాడులోని రాజకీయ, సినీ రంగ ప్రముఖులతో పాటు నేషనల్ సెలబ్రిటీలు కూడా అటెండ్ అయ్యారు. అయితే ఇందులో అందరికంటే స్పెషల్ అట్రాక్షన్ గా త్రిష నిలిచింది.

విజయ్ తల్లిదండ్రులతో

విజయ్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి త్రిష హాజరైంది. ఎంతో పద్ధతిగా చీరకట్టులో ఈ భామ మురిసిపోయింది. వేదిక ముందుకు వస్తూనే నవ్వులు చిందించింది. సంతోషమంతా ఆమె ముఖంలోనే కనిపించింది. అక్కడున్న వాళ్లను హ్యాపీగా త్రిష పలకరించింది. ఆ తర్వాత విజయ్ తల్లిదండ్రులను కలిసింది. విజయ్ అమ్మను హత్తుకుంది.

ముందు వరుసలో

విజయ్ తల్లిదండ్రులతో పాటు త్రిష, వాళ్ల అమ్మ ముందు వరుసలో కూర్చుకున్నారు. స్టేజీకి ముందు ఏర్పాటు చేసిన ఫస్ట్ వరుసలోని కుర్చీల్లో విజయ్ తల్లిదండ్రుల పక్కనే త్రిష కూర్చోవడం హాట్ టాపిక్ గా మారింది. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో త్రిషకు ఈ రేంజ్ లో ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సీఎంగా విజయ్

ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్న విజయ్ సినీ కెరీర్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. టీవీకే పార్టీని స్థాపించిన ఆయన.. జనాల ఓట్లు సంపాదించడం కోసం చాలా కష్టపడ్డారు. ఎన్నికల్లో ఆయన పార్టీ ఏకంగా 108 స్థానాల్లో గెలిచింది. కానీ అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ను అందుకోలేకపోయింది.

ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విజయ్ రెండు చోట్ల గెలవడంతో మొత్తం సీట్లలో ఒక సీటు తగ్గించాల్సి వచ్చింది. దీంతో టీవీకే బలం 107కు పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ (5), సీపీఐ (2), సీపీఎం (2), వీసీకే (2), ఐయూఎంఎల్ (2) టీవీకేకు సపోర్ట్ చేయడంతో సీఎం పీఠాన్ని అధిరోహించారు విజయ్.

త్రిషతో రిలేషన్ షిప్

మరోవైపు త్రిషతో విజయ్ రిలేషన్ షిప్ పై కొంతకాలంగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. మరో హీరోయిన్ కు విజయ్ కు అక్రమ సంబంధం ఉందని అతని భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే త్రిష పేరు తెరపైకి వచ్చింది. అప్పటి నుంచి త్రిష, విజయ్ కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More