Vijay TVK: మ్యాజిక్ ఫిగర్ కోసం కొట్టుమిట్టాడుతున్న దళపతి విజయ్- బాడీగార్డ్ పోస్ట్ వైరల్- గతంలో త్రిషతో సంబంధంపై కూడా!
Thalapathy Vijay Bodyguard Aroon Suresh Post: తమిళనాడు ఎన్నికల్లో ఘనవిజయం సాధించినా, పదవీ బాధ్యతలు చేపట్టే క్రమంలో దళపతి విజయ్‌కు చుక్కెదురైంది. గవర్నర్ మెలికతో మొదలైన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈ క్రమంలో విజయ్ బాడీగార్డ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Thalapathy Vijay Bodyguard Aroon Suresh Post: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని అధికార పీఠం దిశగా నడిపించిన దళపతి విజయ్‌కు అడుగుడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ పెట్టిన నిబంధనలు 'దళపతి'ని టెన్షన్‌లో పెట్టాయి.
అయితే, శుక్రవారం (మే 8) నాటి తాజా పరిణామాల ప్రకారం వీసీకే (VCK), సీపీఐ(ఎం), సీపీఐ పార్టీల మద్దతుతో దళపతి విజయ్ మెజారిటీని సాధించి, ముఖ్యమంత్రి పీఠం కోసం తన బలాన్ని నిరూపించుకున్నారు.
బాడీగార్డ్ పోస్ట్ వెనుక అర్థం ఇదేనా?
ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు, మ్యాజిక్ ఫిగర్ కోసం దళపతి విజయ్ కొట్టుమిట్టాడుతున్న వేళ హీరో విజయ్ బాడీగార్డ్ అరూన్ సురేష్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన ఒక పోస్ట్ చర్చనీయాంశమైంది. "కఠినమైన పోరాటాల తర్వాతే అందమైన ఫలితాలు వస్తాయి.. ధైర్యంగా ఉండండి, అంతా మంచే జరుగుతుంది" అని విజయ్ బాడీగార్డ్ రాసుకొచ్చారు.
గతంలో విజయ్ వ్యక్తిగత జీవితంపై, హీరోయిన్ త్రిషతో ఉన్న సంబంధంపై పుకార్లు వచ్చినప్పుడు కూడా అరూన్ ఇలాగే రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు రాజకీయ గందరగోళం సమయంలోనూ ఆయన పెట్టిన పోస్ట్ విజయ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
కష్టాల కడలి దాటి..
విజయ్ రాజకీయ అరంగేట్రం పూలబాటలా ఏమీ సాగలేదు. ఆయన ప్రయాణంలో ఎదురైన అడ్డంకులు సామాన్యమైనవి కావు:
ర్యాలీలో విషాదం: కరూరులో జరిగిన ఒక సభలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోవడం విజయ్‌ను తీవ్రంగా కలిచివేసింది.
సినిమాపై దెబ్బ: ఎన్నికలకు ముందు విడుదల కావాల్సిన 'జన నాయగన్' చిత్రానికి సెన్సార్ బోర్డ్ నుంచి క్లియరెన్స్ రాకపోవడం, కోర్టుకెళ్లినా ఫలితం లేకపోవడం టీవీకే శ్రేణులను ఇబ్బంది పెట్టింది. పైగా ఎన్నికల ముందే ఈ సినిమా హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం మరో పెద్ద ఎదురుదెబ్బ.
వ్యక్తిగత విమర్శలు: విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇస్తున్నారనే వార్తలు, మరో నటితో ఎఫైర్ ఉందనే ఆరోపణలు రాజకీయంగా ఆయనను ఇబ్బంది పెట్టడానికి ప్రత్యర్థులు ఆయుధంగా వాడుకున్నారు.
నిరూపించుకున్న విజయ్!
గవర్నర్ ఆదేశాల మేరకు మేజిక్ నంబర్ కోసం దళపతి విజయ్ తీవ్రంగా శ్రమించారు. తొలుత కాంగ్రెస్‌తో జతకట్టినప్పటికీ ఐదు సీట్ల లోటు ఉండేది. అయితే శుక్రవారం నాటికి వామపక్ష పార్టీలు, వీసీకే విజయ్‌కు జై కొట్టడంతో సంఖ్యాబలం దక్కింది.
ద్రవిడ రాజకీయాల కోటను బద్దలు కొట్టిన దళపతి విజయ్, ఈ అడ్డంకులన్నీ అధిగమించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది వేచి చూడాలి. సినీ గ్లామర్‌తో వచ్చిన విజయ్, రాజకీయాల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారనే ఆసక్తి నెలకొంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. విజయ్ పార్టీకి ఏ పార్టీలు మద్దతు ప్రకటించాయి?
తొలుత కాంగ్రెస్ మద్దతు ఇవ్వగా, తాజాగా మెజారిటీ నిరూపించుకోవడానికి వీసీకే (VCK), సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలు విజయ్‌కు మద్దతు తెలిపాయి.
2. విజయ్ సినిమా 'జన నాయగన్' ఎందుకు విడుదల కాలేదు?
సీబీఎఫ్‌సీ (CBFC) ఈ చిత్రానికి సర్టిఫికేషన్ ఇవ్వకుండా రివైజింగ్ కమిటీకి పంపింది. తదుపరి కోర్టులో కూడా ఊరట లభించకపోవడంతో విడుదల నిలిచిపోయింది.
3. విజయ్ బాడీగార్డ్ అరూన్ సురేష్ పెట్టిన పోస్ట్ ఏమిటి?
"కష్టతరమైన యుద్ధాల తర్వాతే గొప్ప విజయాలు లభిస్తాయి, అందరూ ధైర్యంగా ఉండండి" అని అరూన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
4. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్‌ను ఏమి అడిగారు?
అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు పత్రాన్ని (Majority List) సమర్పించాలని గవర్నర్ ఆదేశించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


