Trisha Krishnan: ఈ వయసులో డ్రామాలు అవసరమా.. డబ్బు సంపాదించి ప్రశాంతంగా ఉండండి: ఉదయనిధికి త్రిష పరోక్ష కౌంటర్

Trisha Krishnan: తమిళనాడు రాజకీయాల్లో నటి త్రిష మరో కొత్త దుమారానికి తెర లేపారు. కొద్ది రోజుల కిందట సీఎం విజయ్, తనను కలిపి డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ కు పరోక్షంగా కౌంటర్ ఇవ్వడం గమనార్హం.

Published on: Aug 11, 2026, 16:03:39 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Trisha Krishnan: స్టార్ హీరోయిన్ త్రిష క్రిష్ణన్ తమిళ రాజకీయాల్లో తన పేరు చుట్టూ రేగిన పొలిటికల్ తుఫాన్‌పై ఎట్టకేలకు స్పందించారు. తమిళనాడు డిప్యూటీ సీఎం, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన డబుల్ మీనింగ్ కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. వారం రోజుల సైలెన్స్ తర్వాత త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ పెట్టిన క్రిప్టిక్ పోస్ట్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Trisha Krishnan: ఈ వయసులో డ్రామాలు అవసరమా.. డబ్బు సంపాదించి ప్రశాంతంగా ఉండండి: ఉదయనిధికి త్రిష పరోక్ష కౌంటర్
Trisha Krishnan: ఈ వయసులో డ్రామాలు అవసరమా.. డబ్బు సంపాదించి ప్రశాంతంగా ఉండండి: ఉదయనిధికి త్రిష పరోక్ష కౌంటర్

ఏ ఒక్కరి పేరు ఎత్తకుండానే త్రిష షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు తమిళనాడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పొలిటికల్ లీడర్లకు పరోక్షంగా క్లాస్ పీకుతూ త్రిష ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చిన వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

డబ్బు సంపాదించి ప్రశాంతంగా ఉండండి..

వివాదం ముదిరినప్పటి నుంచి సైలెంట్‌గా ఉన్న త్రిష.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక కోట్‌ను షేర్ చేశారు. "ఈ వయసులో ఇలాంటి డ్రామాలు చేయడం చాలా సిగ్గుచేటు.. పోయి కాస్త డబ్బు సంపాదించుకుని ప్రశాంతంగా జీవించండి" అని ఉన్న పోస్ట్‌కు ఓ నవ్వుతున్న ఎమోజీని జత చేశారు. ఎలాంటి పేర్లు ప్రస్తావించకపోయినా, తనను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు, దాని చుట్టూ జరుగుతున్న రాజకీయాలకు త్రిష ఇచ్చిన పర్ఫెక్ట్ కౌంటర్ ఇదేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

దీంతో పాటు "ఒకప్పుడు నువ్వు దేవుడిని కోరుకున్న జీవితం లభించినప్పుడు ఆనందంలో మునిగిపోవడం ఒక గొప్ప వరం" అనే మరో పోస్ట్‌కు ఈవిల్ ఐ ఎమోజీని జత చేస్తూ షేర్ చేశారు. త్రిష తల్లి ఉమా క్రిష్ణన్ కూడా సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. "మీ పని మీరు చూసుకోండి, వర్కవుట్స్ చేయండి, మంచిగా ఉండండి, డబ్బు సంపాదించండి" అంటూ పెట్టిన పోస్ట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

అమ్మమ్మ 98వ బర్త్‌డే వేడుకలు.. పిక్స్ వైరల్

సోషల్ మీడియాలోకి త్రిష రీ-ఎంట్రీ ఇవ్వడానికి ప్రధాన కారణం ఆమె అమ్మమ్మ 98వ పుట్టినరోజు వేడుకలే. కుటుంబ సభ్యులు, తన పెంపుడు కుక్క 'ఇజ్జీ'తో కలిసి ఆమె ఈ బర్త్‌డే వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. పర్పుల్ కలర్ శారీలో మెరిసిపోతున్న అమ్మమ్మ ఫోటోలను షేర్ చేస్తూ త్రిష తన ఆనందాన్ని పంచుకున్నారు.

గోల్డెన్ క్యాండిల్స్, ఆల్మండ్ కేక్‌తో కుటుంబంతో కలిసి గడిపిన ఈ స్పెషల్ మూమెంట్స్ పిక్స్ ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వివాదాలు ఎంత నడుస్తున్నా తన పర్సనల్ లైఫ్‌ను ఎంతో ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నానని ఈ పిక్స్ ద్వారా త్రిష నిరూపించారు.

అసలు వివాదం ఏంటి? ఉదయనిధి స్టాలిన్‌పై టీవీకే ఫిర్యాదు

కావేరీ నీటి సమస్యపై డీఎంకే నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తుండగా, జనం నుంచి కొందరు త్రిష పేరును గట్టిగా అరిచారు. దానిపై ఉదయనిధి స్పందిస్తూ డబుల్ మీనింగ్ వచ్చేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. తాను కావేరి నీటి గురించి మాట్లాడానని ఉదయనిధి సమర్థించుకున్నప్పటికీ, ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది.

దీనిపై తమిళ నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీకి చెందిన మహిళా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఉదయనిధిని తంజావూర్ పోలీసులు కొద్దిసేపు అదుపులోకి తీసుకుని విచారించి, ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. డీఎంకే మాత్రం ఈ వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించారని క్లారిటీ ఇచ్చింది.

‘విశ్వంభర’తో బిజీగా ఉన్న త్రిష

'పొన్నియిన్ సెల్వన్', 'లియో', 'గోట్', థగ్ లైఫ్ లాంటి వరుస భారీ పాన్ ఇండియా హిట్స్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తిరుగులేని క్రేజ్‌తో దూసుకెళ్తున్నారు త్రిష. వయసు పెరుగుతున్న కొద్దీ మరింత గ్లామర్‌తో, నటనతో మెప్పిస్తూ స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా మారారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి సోషియో ఫాంటసీ ఎపిక్ 'విశ్వంభర' సినిమాలో నటిస్తున్నారు.

త్రిష చేసిన ఇన్‌స్టా స్టోరీస్
త్రిష చేసిన ఇన్‌స్టా స్టోరీస్
  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More