Tirumala : పుట్టిన రోజు వేడుకలపై TTD సీరియస్...! దివ్వెల మాధురి, బిగ్‌బాస్ ఫేమ్ తనూజపై పోలీసులకు ఫిర్యాదు
దివ్వెల మాధురి, తనూజలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది.తిరుమలలో దివ్వెల మాధురి, తనూజలు బర్త్ డే వేడుకలు చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. తిరుమలో ఇలాంటి వేడుకలు చేసుకోవడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేసింది.
దివ్వెల మాధురి, బిగ్‌బాస్ ఫేమ్ తనూజ తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. తనూజ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు కేక్ తీసుకువచ్చి అతిథిగృహంలో కట్చేశారు. కేక్‌ను తిరుమలకు తీసుకెళ్లడం, కట్ చేయడం తితిదే నిబంధనలకు విరుద్ధం.

గురువారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి, తనూజ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చి శ్రీపద్మావతి విచారణ కేంద్రం పరిధిలోని శ్రీవిభవ అతిథిగృహాన్ని తీసుకున్నారు. అందులో మాధురి.. తనూజతో కేక్‌ను కట్ చేయించారు. ఈ వేడుకను వీడియో తీయించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వ్యవహారాన్ని టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు.
పోలీసులకు ఫిర్యాదు
దివ్వెల మాధురి, తనూజపై టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ తిరుమలలో బర్త్ డే వేడుకలు చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుమలలో ఇలాంటి వేడుకలు చేసుకోవడం పూర్తిగా నిషేధించడం జరిగిందని స్పష్టం చేశారు.
వీడియో చిత్రీకరించి సోషియల్ మీడియాలో పోస్ట్ చేయడం సరైన పద్ధతి కాదని టీటీడీ తెలిపింది. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు విజిలెన్స్ పోలీసులుకు ఫిర్యాదు చేయడం జరిగిందని ప్రకటించింది. పోలీసులు సదరు ఘటనపై విచారణ చేస్తున్నారని పేర్కొంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











