Serial Actress OTT: ఓటీటీలోకి బుల్లితెర బ్యూటిఫుల్ విలన్ ఎంట్రీ.. సీరియల్స్ తీసే విధానం వేరు, 6 నెలల కల అంటూ!
Serial Actress OTT Entry: 20 ఏళ్ల బుల్లితెర ప్రయాణం తర్వాత బ్యూటిఫుల్ సీరియల్ నటి కనికా మహేశ్వరి ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. ఇటీవల ముగిసిన సీరియల్‌లో ప్రతినాయిక పాత్ర, లక్నో జ్ఞాపకాలు, ఉర్దూ భాషపై తనకున్న ప్రేమ గురించి కనికా మహేశ్వరి పంచుకున్న విశేషాలు ఇవే.
Serial Actress OTT Entry: బుల్లితెరపై రెండు దశాబ్దాలుగా నటిగా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కనికా మహేశ్వరి ఇప్పుడు తన కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. 'దియా ఔర్ బాతీ హమ్' వంటి ప్రజాదరణ పొందిన ధారావాహికల ద్వారా ఇంటింటికీ చేరువైన ఈ సీనియర్ సీరియల్ నటి తాజాగా ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు.

6 నెలలుగా మనసులో అనుకుంటున్న కల
గత ఆరు నెలలుగా మనసులో అనుకుంటున్న ఈ కల నెరవేరడం పట్ల కనికా మహేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. బుల్లితెర సీరియల్స్ చిత్రీకరణ శైలికి, ఓటీటీ సిరీస్‌ల మేకింగ్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ మార్పును సహజంగా స్వీకరిస్తున్నట్లు కనిక చెప్పారు.
"ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి రావడం లభించిన అద్భుతమైన అవకాశం. రోజువారీ సీరియళ్లతో పోలిస్తే ఇక్కడ సీన్లు చిత్రీకరించే విధానం చాలా వేరుగా ఉంటుంది. ఎలాంటి ముందస్తు అంచనాలు లేకుండా ఒక విద్యార్థిలా నేర్చుకునేందుకు సిద్ధంగా వచ్చాను" అని తన కొత్త ప్రయాణం గురించి కనిక వివరించారు.
భయపెట్టిన విలన్ పాత్ర.. మానసిక ఒత్తిడి!
గతంలో ఎక్కువగా సానుకూల లేదా హాస్యభరిత పాత్రలతో అలరించిన కనిక, ఇటీవల ముగిసిన 'సెహర్ హోనే కో హై' సీరియల్‌లో విలన్ 'హుసన్ ఆరా'గా నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ పాత్ర చేసేందుకు నిర్మాతలు రెండు నెలల పాటు సంప్రదించినా, మొదట్లో ఆమె కాస్త సంకోచించారు. అంతటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడం ఎంతో ధైర్యంతో కూడుకున్న విషయమని ఆమె అభిప్రాయపడ్డారు.
ఆ పాత్ర ప్రభావం నుంచి బయటపడటం అంత తేలిక కాదని కనిక తెలిపారు. "హుసన్ ఆరా పాత్రలోని విలనిజం, ఆ వాతావరణం నుంచి బయటకు రావడానికి నన్ను నేను మానసికంగా ఎంతో సిద్ధం చేసుకోవాల్సి వచ్చింది" అని నవ్వుతూ చెప్పారు. అలాగే ప్రతికూల పాత్రలను ప్రేక్షకులు ద్వేషించడమే నటుడికి అసలైన విజయమని ఆమె పేర్కొన్నారు. "మనం చేసిన నెగెటివ్ క్యారెక్టర్‌ను చూసి జనాలు కోపగించుకుంటే, నటుడిగా మనం గెలిచినట్లే" అని స్పష్టం చేశారు.
లక్నో జ్ఞాపకాలు.. మురిపించిన ఉర్దూ!
ఈ సీరియల్ నేపథ్యం లక్నో చుట్టూ తిరగడంతో, అక్కడ మాట్లాడే లక్నవీ ఊర్దూ భాష కనికను ఎంతగానో ఆకట్టుకుంది. భాషలోని తీయదనం, మర్యాద తనను మంత్రముగ్ధులను చేశాయని ఆమె చెప్పారు. సీరియల్ పూర్తయినప్పటికీ, ఉర్దూ నేర్చుకోవడం కొనసాగిస్తానని తెలిపారు.
ఇక లక్నో నగరంతో తనకు చిన్నతనం నుంచే ప్రత్యేక అనుబంధం ఉందని కనికా మహేశ్వరి వెల్లడించారు. "చిన్నతనంలో చుట్టాల ఇంటికి లక్నో వెళ్లేదాన్ని. మా మహేశ్వరి కుటుంబీకులు అక్కడ చాలామంది ఉన్నారు. వీలైతే ఆ నగరానికి పదే పదే వెళ్లాలనిపిస్తుంది" అని తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ప్రతి కథకు ముగింపు ఉంటుంది
ప్రేక్షకాదరణ పొందిన 'సెహర్ హోనే కో హై' సీరియల్ ముగియడంపై స్పందిస్తూ.. "ప్రతి కథకు ఒక ముగింపు ఉంటుంది. మహేద్, సెహర్‌ల కెమిస్ట్రీ, నటీనటుల దుస్తులు, ఉర్దూ భాష, అద్భుతమైన లైటింగ్ ఈ సీరియల్‌ను వీక్షకులకు దగ్గర చేశాయి. ఒక మంచి కథకు ఇది శోభాయమానమైన వీడ్కోలు" అని కనికా ముగించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


