2001లో తెలుగు బాక్సాఫీస్ ను షేక్ చేసిన మూవీ మనసంతా నువ్వే. అప్పటికే చిత్రం, నువ్వు నేను సినిమాలతో సక్సెస్ అందుకున్న ఉదయ్ కిరణ్ కు మనసంతా నువ్వే మూవీ హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. ఈ సూపర్ హిట్ మూవీ ఇప్పుడు రీ రిలీజ్ కానుంది. 25 ఏళ్లకు మళ్లీ థియేటర్లకు రాబోతుంది.
మనసంతా నువ్వే రీ రిలీజ్

కల్ట్ లవ్ స్టోరీగా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయిన సినిమాల్లో మనసంతా నువ్వే. ఇందులో ఉదయ్ కిరణ్ హీరో కాగా.. రీమాసేన్ హీరోయిన్ గా నటించింది. 2001, అక్టోబర్ 19న థియేటర్లలోకి వచ్చి సెన్సేషనల్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు రీ రిలీజ్ కాబోతుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లకు ఈ లవ్ స్టోరీ మళ్లీ రాబోతుంది.
ఉదయ్ కిరణ్ మేనకోడలు
మనసంతా నువ్వు రీ రిలీజ్ సందర్భంగా ఉదయ్ కిరణ్ మేనకోడలు మహతి ఈ మూవీ గురించి మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది.
‘‘నేను ఉదయ్ కిరణ్ మేనకోడలు మహతిని. ఈ ఫిబ్రవరి 14 చాలా స్పెషల్ గా ఉండబోతుంది. ఎందుకంటే మనసంతా నువ్వే తిరిగి థియేటర్లలోకి రాబోతుంది. ఈ మూవీ రిలీజ్ టైమ్ కు నేను రెండు నెలల పాపను. 175 రోజుల ఈవెంట్ అప్పుడు కూడా నేను చిన్న పాపనే’’ అని మహతి వీడియోలో పేర్కొంది.
25 ఏళ్లకు
‘‘ఈ మూవీని ఇప్పటికే చాలా సార్లు చూశా. ఇప్పుడు 25 ఏళ్లకు బిగ్ స్క్రీన్ పైకి ఈ సినిమా మళ్లీ రాబోతుంది. మీ అందరితో కలిసి చూడటానికి నాకెంతో ఎగ్జైటింగ్ గా ఉంది. ఫిబ్రవరి 14న థియేటర్లకు వస్తారని ఆశిస్తున్నా’’ అని మహతి వీడియో ఎండ్ చేసింది.
మనసంతా నువ్వే గురించి
{{/usCountry}}‘‘ఈ మూవీని ఇప్పటికే చాలా సార్లు చూశా. ఇప్పుడు 25 ఏళ్లకు బిగ్ స్క్రీన్ పైకి ఈ సినిమా మళ్లీ రాబోతుంది. మీ అందరితో కలిసి చూడటానికి నాకెంతో ఎగ్జైటింగ్ గా ఉంది. ఫిబ్రవరి 14న థియేటర్లకు వస్తారని ఆశిస్తున్నా’’ అని మహతి వీడియో ఎండ్ చేసింది.
మనసంతా నువ్వే గురించి
{{/usCountry}}మనసంతా నువ్వే సినిమాకు తెలుగు మూవీ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో హీరో ఉదయ్ కిరణ్ ఇప్పుడు మన మధ్యలో లేకపోయినా మనసంతా నువ్వే లాంటి సినిమాతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు. విఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంఎస్ రాజు నిర్మించారు.
మనసంతా నువ్వే సినిమాలో ఉదయ్ కిరణ్, రీమా సేన్, తనూరాయ్, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, సుధ, సునీల్, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు నటించారు. చిన్నప్పుడు దూరమైన ఇద్దరు స్నేహితులు పెద్దయ్యాక తమ ప్రేమ కోసం ఎలా కలుసుకున్నారన్నదే మనసంతా నువ్వే మూవీ స్టోరీ. ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ సినిమాలోని అన్ని పాటలు ఛార్ట్ బస్టర్లుగా నిలిచాయి.