OTT Trending: మూడు ఓటీటీల్లో ట్రెండింగ్ లో తెలుగు సైకో థ్రిల్లర్.. మితిమీరిన ప్రేమతో భర్త హింస.. కనిపించకుండా పోయే భార్య
OTT Trending: తెలుగు సైకో థ్రిల్లర్ మూవీ ఒకటి ఓటీటీలో అదరగొడుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఓటీటీల్లో ఈ సినిమా ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఓటీటీ లవర్స్ తెగ చూసేస్తున్న ఈ మూవీ ఏంటి? స్టోరీ ఏంటి? ఏ ఓటీటీల్లో ఉందో ఓ లుక్కేయండి.
OTT Trending: వెండితెరపై కంటే కొన్ని సినిమాలు ఓటీటీ వేదికలపైకి వచ్చాక విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో అలాంటి ఒక సినిమానే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై దుమ్ములేపుతోంది. ఆ మూవీనే.. యంగ్ హీరో నందు విజయ్ కృష్ణ, టాలెంటెడ్ బ్యూటీ అవికా గోర్ లీడ్ రోల్స్ పోషించిన సైకలాజికల్ రోమాంటిక్ థ్రిల్లర్ మూవీ 'అగ్లీ స్టోరీ' (Ugly Story).

ఓటీటీ ట్రెండింగ్
ప్రస్తుతం డిజిటల్ వీక్షకులను అగ్లీ స్టోరీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఏకంగా మూడు ప్రముఖ ఓటీటీ సంస్థలైన ఆహా వీడియో (Aha Video), జియోహాట్‌స్టార్ (JioHotstar), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లలో ఒకేసారి స్ట్రీమింగ్ అవుతూ టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఆహాలో, జియోహాట్‌స్టార్ లో ఈ మూవీ తెలుగులో ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్తోంది.
సైకో థ్రిల్లర్
ప్రాణస్వరూప్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన అగ్లీ స్టోరీ చిత్రం సైకో థ్రిల్లర్ గా తెరకెక్కింది. సమాజంలో సైకోలాజికల్ రుగ్మతలు, బలవంతపు పెళ్లిళ్లు, ప్రేమికుల మధ్య ఉండే అతి భయంకరమైన పొసెసివ్‌నెస్ అనే అంశాల చుట్టూ మూవీ తిరుగుతుంది. మరి ఈ సినిమా కథ ఏమిటి? ఇందులో ఎవరెవరు నటించారనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
'అగ్లీ స్టోరీ' అసలు కథ ఏమిటంటే?
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన నేహా (అవికా గోర్) తన మేనమామ ఇంట్లో పెరుగుతుంది. అదే ఇంట్లో ఉండే మామయ్య కొడుకు కార్తీక్ (నందు విజయ్ కృష్ణ) చిన్నతనం నుంచే నేహాపై విపరీతమైన ఇష్టాన్ని పెంచుకుంటాడు. అయితే కార్తీక్‌కు ఆమెపై ఉన్నది ప్రేమ కాదు, ఒక రకమైన మానసిక పిచ్చి (సైకోటిక్ అబ్సెషన్). నేహాను తనే పెళ్లి చేసుకోవాలని, ఆమె తనకే సొంతం కావాలని భావిస్తాడు.
ఫ్రెండ్ తో ప్రేమ
కానీ, నేహా తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ (రవితేజ మహాదాస్యం)ను ప్రాణంగా ప్రేమిస్తుంది. ఈ విషయం తెలిసిన కార్తీక్ మరింత క్రూరంగా ప్రవర్తించడం మొదలుపెడతాడు. కుటుంబ సభ్యుల ఒత్తిడి, సామాజిక పరిస్థితుల వల్ల చివరికి నేహా తనకు ఇష్టం లేకపోయినా బావ కార్తీక్‌నే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.
పెళ్లి తర్వాత నేహా జీవితం ఒక నరకంగా మారుతుంది. కార్తీక్ ప్రతి చిన్న విషయానికి ఆమెను అనుమానిస్తూ, మానసికంగా తీవ్రంగా వేధిస్తాడు. ప్రేమ ముసుగులో అతను చూపే అరాచకాలు నేహాను ఊపిరాడకుండా చేస్తాయి. అప్పుడే నేహా కనిపించకుండా పోతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? నేహాకు ఏం జరిగింది? కార్తీక్ కు చివరికి ఏమైంది?
నందు ఊరమాస్ నటన!
ఈ అగ్లీ స్టోరీ సినిమాలో కార్తీక్ పాత్రలో నందు తన కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను కనబరిచాడనే ప్రశంసలు కురుస్తున్నాయి. ఒక సైకో భర్తగా, పైకి ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూనే క్షణంలో భయంకరమైన కోపాన్ని ప్రదర్శించే పాత్రలో నందు జీవించేశాడు. భయం, బాధను తన కళ్లలోనే పలికిస్తూ అవికా గోర్ కూడా నేహా పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. వీరికి తోడుగా రవితేజ మహాదాస్యం, సీనియర్ నటుడు శివాజీ రాజా, రవిప్రకాష్ తమ నటనతో సినిమాకు బలమైన భావోద్వేగాలను జోడించారు.
శ్రవణ్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూడ్‌ను మరింత ఎలివేట్ చేసింది. శ్రీ సాయి కుమార్ దారా అందించిన క్లోజప్ విజువల్స్ పాత్రల ఎమోషన్స్‌ను ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యేలా చేశాయి. కొన్ని సీన్లు సున్నిత మనస్కులను కాస్త ఇబ్బంది పెట్టేలా ఉన్నప్పటికీ, నేటి సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా దర్శకుడు ప్రాణస్వరూప్ ఈ చిత్రాన్ని మలిచారు. అందుకే ఈ సినిమాకు ఓటీటీలో భారీ రెస్పాన్స్ వస్తోంది.
People Also Ask- తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: 'అగ్లీ స్టోరీ' సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది?
జవాబు: నందు, అవికా గోర్ నటించిన 'అగ్లీ స్టోరీ' చిత్రం ప్రస్తుతం ఆహా , జియోహాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోలలో స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రశ్న: 'అగ్లీ స్టోరీ' చిత్ర దర్శకుడు, నిర్మాత ఎవరు?
జవాబు: ఈ చిత్రానికి ప్రాణస్వరూప్ కథ, స్క్రీన్‌ప్లే అందించి దర్శకత్వం వహించారు. రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జె.ఎస్.సుభాషిణి ఈ సినిమాను నిర్మించారు.
ప్రశ్న: ఈ సినిమా ఏ జోనర్‌కు చెందింది? దీని ప్రధాన కథ ఏమిటి?
జవాబు: ఇది ఒక సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్. ప్రేమ పేరిట ఒక వ్యక్తి చూపే సైకో అబ్సెషన్ వల్ల ఒక సాధారణ అమ్మాయి జీవితం పెళ్లి తర్వాత ఎలాంటి నరకంగా మారింది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


