రామ్ చరణ్ భార్య, మెగా ఇంటి కోడలు అయిన ఉపాసన కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఐఐటీ హైదరాబాద్ కు వెళ్లిన ఆమె.. అక్కడి అమ్మాయిలకు ఇచ్చిన సలహాపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. ముందు ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని ఆమె స్పష్టం చేయడం గమనార్హం.
అమ్మాయిలు కెరీర్‌పైనే ఫోకస్

ఉపాసన సోమవారం (నవంబర్ 17) హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్ కు వెళ్లి అక్కడి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేసింది. “ఐఐటీ హైదరాబాద్ స్టూడెంట్స్ తో మాట్లాడటం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. మీలో ఎంత మంది పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు అని నేను అడిగినప్పుడు అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ మంది చేతులు లేపారు.
అమ్మాయిలు కెరీర్ పైనే దృష్టి సారించినట్లు అనిపించింది. ఇది సరికొత్త ప్రోగ్రెసివ్ ఇండియా. మీ విజన్ సెట్ చేసుకోండి.. మీ గోల్స్ ను నిర్ధారించుకోండి. మీరు మీలా ఉండండి. మీకు మీరు అన్‌స్టాపబుల్ గా ఉండండి” అని ఉపాసన ట్వీట్ చేసింది. దీనికి యాడ్ చేసిన వీడియో ఆసక్తి రేపింది.
అండాలను సేవ్ చేసుకోండి
ఈ వీడియోలో ఐఐటీ హైదరాబాద్ స్టూడెంట్స్ ను ఉద్దేశించి ఉపాసన మాట్లాడటం చూడొచ్చు. ఈ సందర్భంగా అమ్మాయిలకు అతి పెద్ద ఇన్సూరెన్స్ వాళ్ల ఎగ్స్ (అండాలు)ను సేవ్ చేసి పెట్టుకోవడమే అని, దీనివల్ల మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పిల్లలను కనాలన్నది మీ చేతుల్లోనే ఉంటుందని, ముందు ఆర్థికంగా స్వతంత్రంగా మారిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని సూచించింది. తాను కూడా అలాగే చేసినట్లు చెప్పింది.
అందుకే తన జీవితంలో తాను కఠినమైన నిర్ణయాలు తీసుకోగలిగానని తెలిపింది. 30 ఏళ్లు లోపే గోల్స్ సిద్ధం చేసుకోవాలని, కెరీర్ పాత్ రెడీగా ఉండాలని స్పష్టం చేసింది. కెరీర్‌లో ఏ వయసులో ఎంత సంపాదించాలో కూడా ముందే టార్గెట్ గా పెట్టుకోవాలని సూచించింది.
{{/usCountry}}అందుకే తన జీవితంలో తాను కఠినమైన నిర్ణయాలు తీసుకోగలిగానని తెలిపింది. 30 ఏళ్లు లోపే గోల్స్ సిద్ధం చేసుకోవాలని, కెరీర్ పాత్ రెడీగా ఉండాలని స్పష్టం చేసింది. కెరీర్‌లో ఏ వయసులో ఎంత సంపాదించాలో కూడా ముందే టార్గెట్ గా పెట్టుకోవాలని సూచించింది.
{{/usCountry}}అయితే ఉపాసన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. ప్రస్తుతం రెండోసారి గర్భవతి అయిన ఉపాసన.. అమ్మాయిలు పెళ్లి పక్కన పెట్టి కెరీర్ పై దృష్టిసారించాలనడం కొందరికి నచ్చలేదు. దీనివల్లే ప్రెగ్నెన్సీలో సమస్యలు అని కొందరు అనగా.. ఈ కాలం అమ్మాయిలు అటు కెరీర్, ఇటు ఫ్యామిలీ రెండింటినీ బాగానే చూసుకుంటున్నారని అన్నారు. మరికొందరు మాత్రం ఉపాసనను సమర్థిస్తూ కామెంట్స్ చేశారు. అమ్మాయిలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు.