...
...
Next Story

అది నా హక్కు.. నేను 29 ఏళ్ల వయసులో ఆ పని చేశాను.. పెళ్లి, కెరీర్‌కు సమ ప్రాధాన్యం: తనపై వస్తున్న విమర్శలపై ఉపాసన

పెళ్లి కాదు ముందు కెరీర్‌పై ఫోకస్ చేయండి.. మీ అండాలను దాచి పెట్టండి అన్న తన కామెంట్స్ పై వస్తున్న విమర్శలకు ఉపాసన ఘాటుగానే స్పందించింది. తాను 29 ఏళ్ల వయసులో ఈ పని చేసినట్లు ఆమె తెలిపింది. ఇప్పుడు పదేళ్ల తర్వాత మరోసారి కవలలకు జన్మనివ్వనున్నట్లు చెప్పింది.

Published on: Nov 19, 2025, 21:14:50 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఎగ్స్ ఫ్రీజింగ్ పై చేసిన కామెంట్స్ దుమారం రేపిన విషయం తెలుసు కదా. దీనిపై తాజాగా ఆమె స్పందించింది. ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థులకు వారి కెరీర్‌పై దృష్టి పెట్టడానికి, సామాజిక ఒత్తిడి లేకుండా పెళ్లి, పిల్లల గురించి నిర్ణయాలు తీసుకోవాలని ఆమె చెప్పిన విషయం తెలిసిందే. ఎగ్ ఫ్రీజింగ్ కామెంట్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అందరి దగ్గరా మీలాగా కోట్లు ఉండవనీ కొందరు అన్నారు. దీనిపై ఆమె ఘాటుగా స్పందించింది.

విమర్శలపై ఉపాసన ఘాటు స్పందన

అది నా హక్కు.. నేను 29 ఏళ్ల వయసులో ఆ పని చేశాను.. పెళ్లి, కెరీర్‌కు సమ ప్రాధాన్యం: తనపై వస్తున్న విమర్శలపై ఉపాసన
అది నా హక్కు.. నేను 29 ఏళ్ల వయసులో ఆ పని చేశాను.. పెళ్లి, కెరీర్‌కు సమ ప్రాధాన్యం: తనపై వస్తున్న విమర్శలపై ఉపాసన

తన ప్రకటన ఆరోగ్యకరమైన చర్చకు దారితీసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, తన కెరీర్, పెళ్లి గురించిన వాస్తవాలను తెలుసుకోవాలని ఉపాసన కోరింది. ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. "సామాజిక ఒత్తిడికి లొంగకుండా, ప్రేమ కోసం ఒక స్త్రీ వివాహం చేసుకోవడం తప్పా? సరైన భాగస్వామి దొరికే వరకు ఆమె వేచి ఉండటం తప్పా?

ఆమె తన సొంత పరిస్థితుల ఆధారంగా పిల్లలను ఎప్పుడు కనాలి అని ఎంచుకోవడం తప్పా? వివాహం లేదా త్వరగా పిల్లలను కనడం గురించి మాత్రమే ఆలోచించకుండా, ఒక స్త్రీ తన లక్ష్యాలను నిర్దేశించుకోవడం, తన కెరీర్‌పై దృష్టి పెట్టడం తప్పా?" అని ఆమె ప్రశ్నించింది.

29 ఏళ్ల వయసులో ఎగ్స్ ఫ్రీజ్ చేయించా

తాను 23 ఏళ్లకే పెళ్లి చేసుకున్నట్లు భావించిన వారికి ఉపాసన అసలు నిజం ఏంటో చెప్పింది. తన వివాహం, ఎగ్ ఫ్రీజింగ్, పిల్లల జననం గురించి ఉపాసన ఇలా స్పందించింది. "ఫ్యాక్ట్ చెక్. నేను 27 సంవత్సరాల వయసులో ప్రేమ, సహవాసం కోసం పెళ్లి చేసుకున్నాను. ఇది నా సొంత నిబంధనల ప్రకారం నేను తీసుకున్న నిర్ణయం" అని ఉపాసన చెప్పింది.

పిల్లల గురించి స్పందిస్తూ.. "నేను 36 సంవత్సరాల వయసులో నా మొదటి బిడ్డ క్లిన్ కారాకు జన్మనిచ్చాను. ఇప్పుడు 39 సంవత్సరాల వయస్సులో కవలల కోసం ఎదురు చూస్తున్నాను" అని తెలిపింది.

"నా ప్రయాణంలో నేను నా కెరీర్‌ను నిర్మించడానికి, నా వైవాహిక జీవితానికి సమాన ప్రాధాన్యత ఇచ్చాను. ఎందుకంటే కుటుంబాన్ని చూసుకునే అప్పుడు సంతోషకరమైన, స్థిరమైన వాతావరణం చాలా ముఖ్యం. నాకు పెళ్లి, కెరీర్ పోటీ పడే ప్రాధాన్యతలు కావు.. అవి సంతృప్తికరమైన జీవితంలో సమానమైన, ముఖ్యమైన భాగాలు. కానీ నేను ఆ సమయాన్ని నిర్ణయించుకుంటాను. అది నాకు ప్రత్యేకంగా లభించిన హక్కు (ప్రివిలెజ్) కాదు.. నా హక్కు" అని ఆమె ముగించింది.

అసలు ఉపాసన ఏం చెప్పింది?

ఐఐటీ హైదరాబాద్‌లోని ఒక సెషన్‌లో ఉపాసన విద్యార్థులతో మాట్లాడుతూ.. "మహిళలకు అతి పెద్ద ఇన్సూరెన్స్ మీ అండాలను భద్రపరచుకోవడమే. ఎందుకంటే అప్పుడు మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పిల్లలను కనాలి, ఎప్పుడు మీరు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి అనే వాటిని మీ సొంత నిబంధనల ప్రకారం ఎంచుకోవచ్చు.

ఈ రోజు నేను నా సొంత కాళ్ళపై నిలబడ్డాను.. నేను నా కోసం జీవిస్తున్నాను" అని చెప్పింది. దీనిపైనే డాక్టర్లు, సోషల్ మీడియా యూజర్లు ఉపాసన తనకు లభించిన 'ప్రత్యేక హక్కు' (Privilege)తో ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe