Toxic Movie: రాకింగ్ స్టార్ యశ్ నటించిన పాన్-ఇండియా గ్యాంగ్‌స్టర్ డ్రామా 'టాక్సిక్' (Toxic) థియేటర్లలో తీవ్రమైన మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. ఈ సినిమా చూసిన శాండల్‌వుడ్ రియల్ స్టార్ ఉపేంద్ర (Upendra) చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే, నెటిజన్లు మాత్రం ఆయనను దారుణంగా ఏకిపారేస్తున్నారు.
"కొత్త ప్రపంచం.. కొత్త అనుభూతి": ఉపేంద్ర ట్వీట్ వైరల్

డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ తెరకెక్కించిన 'టాక్సిక్' సినిమాపై కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఎక్స్ వేదికగా కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తన రివ్యూ షేర్ చేశారు. "టాక్సిక్ ఒక ఫేరీ టేల్.. కానీ పెద్దల కోసం! వావ్.. ఏం సినిమా ఇది. ఒక కొత్త ప్రపంచం, పూర్తిగా సరికొత్త అనుభూతి. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల కష్టం, డెడికేషన్ నిజంగా అభినందనీయం. యశ్ టీమ్‌కు హ్యాట్సాఫ్" అంటూ ఉపేంద్ర రాసుకొచ్చారు.
దర్శకుడు ఆర్. చంద్రు కూడా కన్నడిగులంతా యశ్ కి, 'టాక్సిక్' సినిమాకు సపోర్ట్‌గా నిలవాలని కోరిన మరుసటి రోజే ఉపేంద్ర నుంచి ఈ సంచలన పోస్ట్ రావడం విశేషం.
"ఏం సినిమా చూసి రివ్యూ ఇచ్చావ్ సామీ?" - నెటిజన్ల ఫైర్
ఉపేంద్ర రివ్యూ చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు సోషల్ మీడియాలో ఘాటుగా స్పందిస్తున్నారు. చెత్త సినిమాలను ప్రమోట్ చేయడం ఆపాలంటూ కామెంట్స్ సెక్షన్‌లో కౌంటర్లు వేస్తున్నారు.
"మీరు చూసిన ప్రింట్ ఏంటో ప్రొడక్షన్ హౌస్‌కి చెప్పి మాకూ అదే డిస్ట్రిబ్యూట్ చేయించండి సామీ.. మేము చూసిన సినిమాలో అసలు కథే లేదు!" అని ఒక నెటిజన్ ఎద్దేవా చేయగా, "కేవలం రిచ్ విజువల్స్, పబ్‌జీ (PUBG) లెవెల్ యాక్షన్ సీన్లు ఉంటే సరిపోదు.. కనీస కథ కూడా లేని సినిమాను ఎలా మెచ్చుకుంటున్నారు?" అని మరో యూజర్ ప్రశ్నించారు.
కన్నడ సినిమాను సపోర్ట్ చేయడంలో తప్పు లేదు కానీ, నాసిరకం సినిమాలను నెత్తిన పెట్టుకుంటే ఇండస్ట్రీ ఎప్పటికీ మారదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు తీసిన కబ్జా మూవీ కూడా ఈ చెత్త సినిమా కంటే బెటర్ అంటూ మరో యూజర్ కామెంట్ చేయడం గమనార్హం.
ఉపేంద్ర సైకలాజికల్ స్టైల్‌కే సెట్ అవుతుందా?
{{/usCountry}}కన్నడ సినిమాను సపోర్ట్ చేయడంలో తప్పు లేదు కానీ, నాసిరకం సినిమాలను నెత్తిన పెట్టుకుంటే ఇండస్ట్రీ ఎప్పటికీ మారదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు తీసిన కబ్జా మూవీ కూడా ఈ చెత్త సినిమా కంటే బెటర్ అంటూ మరో యూజర్ కామెంట్ చేయడం గమనార్హం.
ఉపేంద్ర సైకలాజికల్ స్టైల్‌కే సెట్ అవుతుందా?
{{/usCountry}}అయితే కొందరు నెటిజన్లు ఉపేంద్ర ట్వీట్‌కు మద్దతుగా కూడా కామెంట్స్ చేశారు. ఉపేంద్ర గతంలో తీసిన 'ఓం', 'ఉపేంద్ర', 'సూపర్' లాంటి మైండ్ గేమ్, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల మేకింగ్ స్టైల్‌కి ఈ 'టాక్సిక్' కాన్సెప్ట్ దగ్గరగా ఉండటం వల్లే ఆయనకు నచ్చి ఉంటుందని కొందరు విశ్లేషిస్తున్నారు.
"ఈ తరహా సైకలాజికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాను ఉపేంద్ర డైరెక్ట్ చేసి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది" అని మరికొందరు అభిప్రాయపడ్డారు.
రూ.190 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర నిలుస్తుందా?
భారీ అంచనాల నడుమ విడుదలై విమర్శకుల నుంచి డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. 'టాక్సిక్' మొదటి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 190 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా లాంటి భారీ తారాగణంతో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు నిలబడుతుందో వేచి చూడాలి.