Zombie Reddy 2 Upendra: చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ రౌద్ర రూపం.. జాంబీ రెడ్డి 2లో రియల్ స్టార్ ఉపేంద్ర గ్రాండ్ ఎంట్రీ

Zombie Reddy 2 Upendra: రియల్ స్టార్ ఉపేంద్ర బర్త్ డే సందర్భంగా అదిరే సర్ ప్రైజ్ వచ్చేసింది. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న బ్లాక్ బస్టర్ సీక్వెల్ ‘జాంబీ రెడ్డి 2’ సినిమాలో ఉపేంద్ర నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి అతని ఫస్ట్ లుక్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ మామూలుగా లేదు. 

Published on: Sep 18, 2026, 13:03:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Zombie Reddy 2 Upendra: టాలీవుడ్‌లో సరికొత్త జాంబీ కాన్సెప్ట్‌తో సంచలనం సృష్టించిన 'జాంబీ రెడ్డి' చిత్రానికి సీక్వెల్‌గా 'జాంబీ రెడ్డి 2: నెక్స్ట్ లెవెల్' (Zombie Reddy 2: Nxt Lvl) రూపొందుతోంది. తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్‌ నుంచి అదిరే అప్డేట్ వచ్చింది. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.

చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ రౌద్ర రూపం.. జాంబీ రెడ్డి 2లో రియల్ స్టార్ ఉపేంద్ర గ్రాండ్ ఎంట్రీ (x)
చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ రౌద్ర రూపం.. జాంబీ రెడ్డి 2లో రియల్ స్టార్ ఉపేంద్ర గ్రాండ్ ఎంట్రీ (x)

జాంబీ రెడ్డి 2లో ఉపేంద్ర

తేజ సజ్జా హీరోగా రాబోతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో 'జాంబీ రెడ్డి 2: నెక్స్ట్ లెవెల్' ఒకటి. ఈ క్రేజీ సీక్వెల్‌లోకి కన్నడ అగ్ర నటుడు, రియల్ స్టార్ ఉపేంద్ర అడుగుపెట్టారు. ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఇవాళ (సెప్టెంబర్ 18) ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.

వైరల్ ఫస్ట్ లుక్

జాంబీ రెడ్డి 2 నుంచి రిలీజైన ఉపేంద్ర ఫస్ట్ లుక్ తెగ వైరల్ గా మారింది. ఇందులో ఆయన చెట్టుకు తలకిందులుగా వేలాడుతున్నట్లు ఉన్నారు. “ప్రపంచాన్ని తలకిందులు చేయడానికి సిద్ధం” అనే శక్తివంతమైన టాప్‌లైన్‌తో వచ్చిన ఈ పోస్టర్‌ అదిరిపోయింది. ఉపేంద్ర కల్ట్ ఫ్యాన్స్ ఈ పోస్టర్ ను తెగ షేర్ చేస్తున్నారు.

ఉపేంద్ర ఒక చెట్టు కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ, విరోచితమైన తెగ నాయకుడి గెటప్‌లో గర్జిస్తూ కనిపించారు. చేతిలో చెక్కిన గొడ్డలి లాంటి ఆయుధాన్ని పట్టుకుని ఉన్న ఆయన వైల్డ్ లుక్ నెటిజన్లను, అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఉపేంద్ర ఈ మూవీ కోసం షూటింగ్ మొదలెట్టారు.

బ్లాక్ బస్టర్ సీక్వెల్

జాంబీ రెడ్డి మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా జాంబీ రెడ్డి 2 వస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను అందిస్తుండగా, సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఆయన తెలుగు చిత్రపరిశ్రమలోకి దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.

2027లో రిలీజ్

ఈ భారీ హారర్ యాక్షన్ డ్రామాలో షనయా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గౌర హరి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

జాంబీ రెడ్డి మూవీ సక్సెస్ నేపథ్యంలో జాంబీ రెడ్డి 2పై హైప్ బాగానే క్రియేట్ అయింది. మరి ఆ మ్యాజిక్ ను ఈ సీక్వెల్ రిపీట్ చేస్తుందా? లేదా? అన్నది చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More