Urvashi Rautela: 7,000 కోట్లు కట్టాల్సిందే.. ఏఐ కంపెనీపై ఊర్వశి రౌతేలా ఫైర్.. నోటికొచ్చినట్లు వాగకంటూ సీఈఓ కౌంటర్!

Urvashi Rautela: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తన పేరు, ఫోటోలు, వీడియోలను వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకున్నారంటూ లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీకి ఈ భామ లీగల్ నోటీసులు పంపించింది. ఏకంగా రూ.7 వేల కోట్లు కట్టాలని డిమాండ్ చేసింది.

Published on: Sep 30, 2026, 06:13:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Urvashi Rautela: పబ్లిక్ అటెన్షన్ కోరుకునే ఊర్వశి రౌతేలా మరోసారి ట్రెండింగ్ గా మారింది. లాస్ ఏంజెల్స్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఏఐ కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఊర్వశి రౌతేలా టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం హాట్ టాపిక్ అయింది. తన ఇమేజ్, పేరు, వీడియోలను అక్రమంగా వాడుకున్నందుకు గాను రూ. 7,000 కోట్లు కట్టాలని ఊర్వశి డిమాండ్ చేసింది.

7,000 కోట్లు కట్టాల్సిందే.. ఏఐ కంపెనీపై ఉర్వశి రౌతేలా ఫైర్.. నోటికొచ్చినట్లు వాగకంటూ సీఈఓ కౌంటర్!
7,000 కోట్లు కట్టాల్సిందే.. ఏఐ కంపెనీపై ఉర్వశి రౌతేలా ఫైర్.. నోటికొచ్చినట్లు వాగకంటూ సీఈఓ కౌంటర్!

ఊర్వశి రౌతేలా డిమాండ్

"మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీని నిర్మించుకోండి. మీ బ్రాండ్‌ను పెంచుకోండి. కానీ అనుమతి లేకుండా ఉర్వశి రౌతేలా పేరును మీ వ్యాపారంలోకి లాగొద్దు. లాస్ ఏంజెల్స్ కు చెందిన ఏఐ కంపెనీకి రూ.7 వేల కోట్ల నష్ట పరిహారం కోసం లీగల్ నోటీసులు పంపిస్తున్నాం " అంటూ ఊర్వశి రౌతేలా టీమ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

స్ట్రాంగ్ కౌంటర్

ఊర్వశి రౌతేలా చేసిన రూ. 7,000 కోట్ల లీగల్ క్లెయిమ్‌పై 'బాలీవుడ్.AI' (Bollywood.AI), 'హాజికూడ్.AI' సంస్థల వ్యవస్థాపకుడు, సీఈఓ షీరాజ్ హసన్ ఘాటుగా స్పందించారు. ఊర్వశి గతంలో తమకు ఇచ్చిన వైరల్ ఇంటర్వ్యూ వీడియోను గుర్తు చేస్తూ ఆమె కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు.

ఆ ఇంటర్వ్యూలో.. "బాలీవుడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై మీ అభిప్రాయం ఏంటి?" అని ప్రశ్నించగా.. "బాలీవుడ్? ఐ థింక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల బాలీవుడ్ చాలా బాధపడుతోంది. నాకు బాలీవుడ్ అంటే ఇష్టం" అంటూ ఊర్వశి తడబడుతూ సమాధానమిచ్చింది.

ముందు ఏఐ అంటే ఏంటో తెలుసుకో

దీనిపై షీరాజ్ హసన్ స్పందిస్తూ.. "ఉర్వశీ, ఆ మాటలు మేమేమీ నీ నోట్లో పెట్టలేదు. ఏఐ గురించి, భవిష్యత్తు ఎంటర్‌టైన్‌‌మెంట్ బిజినెస్ గురించి ఏవైనా సమాధానాలు ఇచ్చే ముందు కాస్త అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నాను. ఏఐ అంటే ఏంటో తెలుసుకో. నోటికి వచ్చినట్లు వాగకు. ఏఐ సినిమాలు, డిజిటల్ స్టార్స్, వయసు పెరగని వర్చువల్ నటులే భవిష్యత్తు. నీ సమాధానాన్ని నువ్వు వ్యతిరేకించవచ్చు కానీ, రాబోయే సాంకేతిక విప్లవాన్ని ఆపలేవు" అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

టాలీవుడ్‌‌లో స్పెషల్ సాంగ్స్

2013లో 'సింగ్ సాబ్ ది గ్రేట్' చిత్రం ద్వారా బాలీవుడ్ నటిగా ప్రయాణం ప్రారంభించిన ఊర్వశి రౌతేలా, మోడలింగ్ రంగంలోనూ మంచి పేరు తెచ్చుకుంది. దాదాపు దశాబ్దం తర్వాత టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె, వరుసగా బిగ్ ప్రాజెక్టుల్లో స్పెషల్ నంబర్లతో హంగామా చేసింది.

వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవితో కలసి చేసిన 'బాస్ పార్టీ' (Boss Party) సాంగ్ ఘనవిజయం సాధించింది. అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ మూవీలో 'వైల్డ్ సాలా' (Wild Saala) పాటతో మాస్ ఆడియన్స్‌ను ఊపేసింది. సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన బ్రో సినిమాలో 'మై డియర్ మార్కండేయ' (My Dear Markendeya) పాటలో సందడి చేసింది. బాలయ్యతోనూ చిందేసింది.

వివాదం వైరల్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్విన్ సాంకేతికతలు శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో, సెలబ్రిటీల ‘ఇమేజ్ రైట్స్’ రక్షణ అనేది అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు నటుల అనుమతి లేకుండా వారి ముఖాలను, వాయిస్‌లను ఏఐ ద్వారా పునర్నిర్మించడంపై చట్టపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఊర్వశి రౌతేలా క్లెయిమ్ చేసిన రూ.7,000 కోట్ల పరిహారం అత్యంత భారీ మొత్తం కావడంతో పాటు, ఏఐ కంపెనీల ప్రతినిధులు ఆమె ఇంటర్వ్యూలను బయటకు తీస్తూ కౌంటర్ ఇస్తుండటం ఈ వివాదాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More