...
...
Next Story

Ustaad Bhagat Singh Box Office: ఉస్తాద్ భగత్ సింగ్.. రెండో రోజు దారుణంగా పడిపోయిన వసూళ్లు.. వీకెండ్‌పైనే ఆశలు

Ustaad Bhagat Singh Box Office: ఉస్తాద్ భగత్ సింగ్ రెండో రోజు వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ధురంధర్ 2 సునామీ ప్రభావం పవన్ కల్యాణ్ సినిమాపై స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో రంజాన్ వీకెండ్ పైనే ఆ మూవీ ఆశలు పెట్టుకుంది.

Published on: Mar 21, 2026, 08:40:01 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Ustaad Bhagat Singh Box Office: పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ తొలి రోజు అదిరిపోయే వసూళ్లు సాధించినా.. రెండో రోజు అవి దారుణంగా పడిపోయాయి. రెండు రోజులు కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.59 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇండియాలో ఇది రూ.52 కోట్లుగా ఉంది.

ఉస్తాద్ భగత్ సింగ్ రెండో రోజు ఇలా..

Ustaad Bhagat Singh Box Office: ఉస్తాద్ భగత్ సింగ్.. రెండో రోజు దారుణంగా పడిపోయిన వసూళ్లు.. వీకెండ్‌పైనే ఆశలు
Ustaad Bhagat Singh Box Office: ఉస్తాద్ భగత్ సింగ్.. రెండో రోజు దారుణంగా పడిపోయిన వసూళ్లు.. వీకెండ్‌పైనే ఆశలు

భారీ అంచనాల మధ్య ఉగాది రోజు రిలీజైన ఉస్తాద్ భగత్ సింగ్ తొలి రోజు హాలిడే కావడంతో అందుకు తగినట్లే మంచి వసూళ్లు సాధించింది. అయితే మూవీకి వచ్చిన మిక్స్‌డ్ రివ్యూలు, మరోవైపు ధురంధర్ 2 ప్రభావం ఎంతో రెండో రోజు తెలిసింది. పైగా శుక్రవారం వర్కింగ్ డే కూడా కావడంతో ఉస్తాద్ వసూళ్ల విషయంలో చతికిలపడ్డాడు.

Sacnilk.com రిపోర్టు ప్రకారం తొలి రోజు ఇండియాలో రూ.34.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈ పవన్ కల్యాణ్ మూవీ.. రెండో రోజు మాత్రం కేవలం రూ.9.25 కోట్లకే పరిమితమైంది. దీంతో రెండు రోజులు కలిపి ఇండియా నెట్ వసూళ్లు రూ.44 కోట్లకు చేరాయి. ఇక ఓవర్సీస్ నుంచి మరో రూ.7 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

వీకెండ్‌పైనే ఆశలు

గతేడాది చివర్లో తన కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్ ఓజీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్ తో కాస్త నిరాశపరిచాడనే చెప్పాలి. తొలి రెండు రోజుల వసూళ్లు చూస్తే.. రంజాన్ వీకెండ్ పైనే మేకర్స్ ఆశలు పెట్టుకున్నారు. శని, ఆదివారాల్లో ఈ వసూళ్లు భారీగా పెరిగితేనే ఉస్తాద్ ఓ మోస్తరు హిట్ సాధించగలగుతుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe