OTT Crime Thriller: కేరళలోని కన్నూర్ జిల్లా ధర్మడం పోలీస్ స్టేషన్‌లో జరిగిన కొన్ని షాకింగ్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'ఉయిర్' (Uyir) డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఆగస్టు 4 నుంచి ఈ మలయాళం కాన్సెప్ట్ మూవీ ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జీయోహాట్‌స్టార్ (JioHotstar) వేదికగా ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కాబోతోంది.

సస్పెన్స్, ఇంటెన్స్ డ్రామా ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి అందుబాటులోకి తెస్తున్నారు మేకర్స్. "కొన్ని నిజాలు ఎంత పాతిపెట్టినా బయటకు రాకుండా ఉండలేవు" అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
సబ్‌ఇన్‌స్పెక్టర్ అజీబ్ మిస్టరీ.. ధర్మడం పోలీస్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్
కేరళలోని కన్నూర్ జిల్లాలోని ధర్మడం పోలీస్ స్టేషన్‌లో ప్రొబేషనరీ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అజీబ్ (రోషన్ మాథ్యూ) అనే యంగ్ ఆఫీసర్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అతను ఉద్యోగంలో చేరిన కొత్తలోనే ఊహించని ఒక క్లిష్టమైన కేసును ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది.
ఆ కేసు విచారణ క్రమంలో బయటపడిన నిజాలు, దాని వెనుక ఉన్న రాజకీయ, సామాజిక పరిస్థితులను అతను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ చిత్రంలో ప్రధానాంశం. నిజజీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా డైరెక్టర్ ఈ సినిమాను అత్యంత రియలిస్టిక్‌గా, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో మలిచారు. ఈ ఉయిర్ మూవీకి ఐఎండీబీలో 8.2 రేటింగ్ ఉంది. ఉయిర్ అంటే తెలుగులో మనసు, జీవితం, శ్వాస అనే అర్థాలు ఉన్నాయి.
మలయాళం ఇన్వెస్టిగేషన్ మార్క్.. నెక్స్ట్ లెవెల్ థ్రిల్
సాధారణంగా మలయాళ సినీ రంగానికి రియలిస్టిక్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లను డీల్ చేయడంలో ఒక స్పెషల్ మార్క్ ఉంది. గతంలో వచ్చిన 'దృశ్యం', 'అంజామ్ పాతిరా', 'కన్నుర్ స్క్వాడ్' తరహాలోనే 'ఉయిర్' కూడా అవుట్ అండ్ అవుట్ సీటు అంచున కూర్చోబెట్టే కథనంతో రాబోతోంది.
{{/usCountry}}సాధారణంగా మలయాళ సినీ రంగానికి రియలిస్టిక్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లను డీల్ చేయడంలో ఒక స్పెషల్ మార్క్ ఉంది. గతంలో వచ్చిన 'దృశ్యం', 'అంజామ్ పాతిరా', 'కన్నుర్ స్క్వాడ్' తరహాలోనే 'ఉయిర్' కూడా అవుట్ అండ్ అవుట్ సీటు అంచున కూర్చోబెట్టే కథనంతో రాబోతోంది.
{{/usCountry}}ప్రొబేషన్ టైమ్‌లోనే ఒక యంగ్ పోలీస్ ఆఫీసర్‌కు ఎదురైన బెదిరింపులు, ఒత్తిళ్లు, అతను కేసును పరిష్కరించిన తీరు థ్రిల్లర్ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనున్నాయి. మూడీ సినిమాటోగ్రఫీ, ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రైమ్ అసెట్స్‌గా నిలిచాయి. జూన్ 26న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకులను పాజిటివ్, క్రిటిక్స్ నుంచి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి.
ఆగస్టు 4 నుంచి 5 భాషల్లో రచ్చ.. పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్
విభిన్నమైన కథలను ఆదరించే తెలుగు డిజిటల్ ఆడియన్స్‌కు జియోహాట్‌స్టార్ అందించబోతున్న 'ఉయిర్' ఒక పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్‌గా మారనుంది. 5 భాషల్లో డబ్బింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ కానుండటంతో ఓటీటీ ప్రేమికులు ఈ క్రైమ్ డ్రామా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సస్పెన్స్, క్రైమ్, డ్రామా కాన్సెప్ట్‌లను ఇష్టపడే సినీ ప్రియులకు 'ఉయిర్' ఒక మంచి డిజిటల్ ట్రీట్ కానుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.