Vaazha 2 Telugu: డెబ్యూ డైరెక్టర్ సవిన్ ఎస్.ఎ. దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ బ్లాక్‌బస్టర్ యూత్‌ఫుల్ కామెడీ డ్రామా వాలా 2 (Vaazha 2). ఈ మూవీ కేరళలో భారీ విజయాన్ని అందుకుంది. కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల మార్కును చేరువవుతూ ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఈ మ్యాజిక్‌ను ఇప్పుడు తెలుగులోనూ పునరావృతం చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది.
వాలా 2 తెలుగు రిలీజ్ డేట్ ఇదే

తాజా సమాచారం ప్రకారం మలయాళం కామెడీ డ్రామా 'వాలా 2' తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఏప్రిల్ 24, 2026న గ్రాండ్‌గా విడుదల కానుంది. సాధారణంగా తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారు. ఆ నమ్మకంతోనే ఈ చిత్రాన్ని వేసవి కానుకగా తెలుగులోకి తీసుకువస్తున్నారు.
కుర్రాళ్ళ వినోదం.. అదిరిపోయే రెస్పాన్స్
ఈ వాలా 2 మూవీలో హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వి ప్రధాన పాత్రల్లో నటించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత ఆలోచనలు, వారి స్నేహం, జీవితంలో వారు ఎదుర్కొనే సరదా సంఘటనల సమాహారంగా ఈ సినిమా సాగుతుంది.
కేరళలో ఈ సినిమా సాధించిన వసూళ్లు చూస్తుంటే, తెలుగులో కూడా అదే రేంజ్ లో ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా యువతను ఈ సినిమా ఎక్కువగా ఆకట్టుకుంటోంది.
ముందే ప్రకటించిన 'వాలా 3'
ఇమాజిన్ సినిమాస్, డబ్ల్యూబీటీఎస్ ప్రొడక్షన్స్, షైన్ స్క్రీన్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 'వాలా 2' థియేటర్లలో ఉండగానే మేకర్స్ 'వాలా 3' (Vaazha 3)ను కూడా ప్రకటించేశారు. దీంతో ఈ ఫ్రాంచైజీపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'వాలా 2' తెలుగు విడుదల తేదీ ఎప్పుడు?
{{/usCountry}}1. 'వాలా 2' తెలుగు విడుదల తేదీ ఎప్పుడు?
{{/usCountry}}ఈ చిత్రం ఏప్రిల్ 24, 2026న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల కానుంది.
2. వాలా 2 సినిమా ఇప్పటివరకు ఎంత వసూలు చేసింది?
మలయాళ వెర్షన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.200 కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది.
3. వాలా 2 చిత్ర దర్శకుడు ఎవరు?
ఈ సినిమాతో సవిన్ ఎస్.ఎ. (Savin SA) దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే ఆయన భారీ విజయాన్ని అందుకున్నారు.
4. వాలా 2 సినిమాలో నటించిన ప్రధాన నటీనటులు ఎవరు?
హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వి కీలక పాత్రల్లో నటించారు.