...
...
Next Story

Varalaxmi Sarathkumar: భార్య కోసం చందమామను తెచ్చిన భర్త.. వరలక్ష్మీ శరత్‌కుమార్ కర్వా చౌత్ ఉపవాసం ఎలా విడిచిందో తెలుసా?

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్‌కుమార్ తన భర్త నికోలాయ్ సచ్‌దేవ్‌తో కలిసి నిర్వహించుకున్న కర్వా చౌత్ వేడుకల క్యూట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మేఘాల చాటున చందమామ దాక్కోవడంతో.. నికోలాయ్ పేపర్‌పై స్వయంగా గీసిన చందమామ బొమ్మను చూపిస్తూ ఆమె ఉపవాసం విడిపించడం నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది.

Published on: Oct 30, 2026, 16:53:15 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Varalaxmi Sarathkumar: తెలుగు, తమిళ చిత్రసీమలో తనదైన విలక్షణమైన పాత్రలతో, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్. వైవిధ్యమైన విలన్ పాత్రల నుంచి క్యారెక్టర్ రోల్స్ వరకు ఏ పాత్ర ఇచ్చినా జీవించే ఈ నటి.. ఈ ఏడాది జులైలో ప్రముఖ ఆర్ట్ గేలరిస్ట్, పవర్‌లిఫ్టర్ నికోలాయ్ సచ్‌దేవ్ (Nicholai Sachdev)ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

Varalaxmi Sarathkumar: భార్య కోసం చందమామను తెచ్చిన భర్త.. వరలక్ష్మీ శరత్‌కుమార్ కర్వా చౌత్ ఉపవాసం ఎలా విడిచిందో తెలుసా?
Varalaxmi Sarathkumar: భార్య కోసం చందమామను తెచ్చిన భర్త.. వరలక్ష్మీ శరత్‌కుమార్ కర్వా చౌత్ ఉపవాసం ఎలా విడిచిందో తెలుసా?

తాజాగా ఈ బ్యూటీ తన భర్తతో కలిసి జరుపుకున్న కర్వా చౌత్ (Karwa Chauth) వేడుకల వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, అది ఇప్పుడు నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతోంది. పెళ్లి తర్వాత వచ్చిన తొలి పండుగల్లో ఒకటైన కర్వా చౌత్‌ను సాంప్రదాయ దుస్తుల్లో జరుపుకున్న ఈ జంట పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

ఆకాశంలో దాగుడుమూతలు: భర్త స్పెషల్ ఐడియా

గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని తమ నివాసంలో వరలక్ష్మి శరత్‌కుమార్ కర్వా చౌత్ పూజను ఎంతో నిష్టతో నిర్వహించారు. ముందుగా ఇంట్లోని పూజా మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు పూర్తి చేసుకున్న అనంతరం.. ఉపవాస దీక్షను విడిచేందుకు భర్త నికోలాయ్‌తో కలిసి ఇంటి మేడ పైకి వెళ్లారు. అయితే ఆ సమయంలో ఆకాశం మేఘావృతమై ఉండటంతో చందమామ అసలు కనిపించలేదు.

చాలాసేపు ఎదురుచూసినా చంద్రుడు బయటకు రాకపోవడంతో, వరలక్ష్మి తన మొబైల్ ఫోన్‌లోని మూన్ ట్రాకర్ యాప్ సహాయంతో చందమామ ఎక్కడుందో వెతకడానికి ప్రయత్నించారు. భార్య పడుతున్న ఇబ్బందిని గమనించిన నికోలాయ్, వెంటనే ఒక కాగితంపై స్వయంగా చందమామ రూపాన్ని బొమ్మగా గీసి ఆమె ముందు ఉంచారు. ఆ చంద్రుడి వైపు చూపిస్తూ భార్యకు నీరు తాగించి, తియ్యటి ముద్దుతో ఉపవాసాన్ని విరమింపజేయడం విశేషం.

ఇక మార్చి 2024లో నిశ్చితార్థం చేసుకుని జులైలో నికోలాయ్‌ను వరలక్ష్మి పెళ్లాడారు. నికోలాయ్‌కు ఇది రెండో వివాహం కావడంపై గతంలో వచ్చిన విమర్శలపై వరలక్ష్మి ఎంతో ధైర్యంగా స్పందించారు. "మా నాన్న గారు కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఎదుటి వ్యక్తి సంతోషంగా ఉన్నంత వరకు అందులో తప్పేమీ లేదు. నికోలాయ్ నా కళ్లకు ఎంతో అందగాడిగా కనిపిస్తారు. నెగెటివ్ కామెంట్లు చేసే వారిని నేను అస్సలు పట్టించుకోను" అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతేకాకుండా ఇటీవల ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో తాను పిల్లలను కనకూడదని నిర్ణయించుకున్నట్లు తేల్చి చెప్పారు. "నాకు పిల్లలు వద్దనేది నా వ్యక్తిగత, దృఢమైన నిర్ణయం. నా భర్త కూడా దీనికి సంపూర్ణంగా అంగీకరించారు" అని వరలక్ష్మి వెల్లడించారు.

ప్రస్తుతం నటనతో పాటు దర్శకత్వంలోనూ సత్తా చాటుతున్న వరలక్ష్మి.. ఈ ఏడాది 'పోలీస్ కంప్లైంట్', 'ఎస్ సరస్వతి' చిత్రాలతో అలరించారు. ప్రస్తుతం శ్రీలంకన్ నేపథ్యంతో రాబోతున్న 'రిజానా - ఏ కేజ్డ్ బర్డ్' చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks