Priyanka Chopra: గిన్నెలు కడిగిన వారణాసి హీరోయిన్ ప్రియాంకా చోప్రా.. గోల్డెన్ టెంపుల్లో సేవలు.. వీడియో వైరల్

Priyanka Chopra: గ్లోబల్ స్టార్, వారణాసి మూవీ హీరోయిన్ ప్రియాంక చోప్రా పంజాబ్‌లోని పవిత్ర స్వర్ణ దేవాలయాన్ని సందర్శించింది. అక్కడ ఆమె సామాన్యురాలిలా నేలపై కూర్చుని గిన్నెలు కడుగుతూ సేవ చేయడం నెటిజన్ల మనసు గెలుచుకుంది.

Published on: Mar 31, 2026, 18:32:59 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన భారతీయ నటి ప్రియాంక చోప్రా తన మూలాలను అస్సలు మర్చిపోలేదని మరోసారి నిరూపించుకుంది. మంగళవారం (మార్చి 31) ఆమె పంజాబ్‌లోని అమృతసర్‌లో ఉన్న ప్రసిద్ధ హర్మందిర్ సాహిబ్ (గోల్డెన్ టెంపుల్)ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Priyanka Chopra: గిన్నెలు కడిగిన వారణాసి హీరోయిన్ ప్రియాంకా చోప్రా.. గోల్డెన్ టెంపుల్లో సేవలు.. వీడియో వైరల్
Priyanka Chopra: గిన్నెలు కడిగిన వారణాసి హీరోయిన్ ప్రియాంకా చోప్రా.. గోల్డెన్ టెంపుల్లో సేవలు.. వీడియో వైరల్

సేవలో నిమగ్నమైన గ్లోబల్ స్టార్

గోల్డెన్ టెంపుల్ సందర్శనలో వారణాసి హీరోయిన్ ప్రియాంకా చోప్రా అత్యంత సాధారణంగా కనిపించింది. పీచ్ కలర్ డ్రెస్ ధరించి, తలపై దుపట్టా వేసుకుని భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకుంది. అయితే అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. ఆమె అక్కడ స్వయంగా 'సేవ'లో పాల్గొంది. ఆలయ ప్రాంగణంలో నేలపై కూర్చుని భక్తులు భోజనం చేసిన గిన్నెలను (పాత్రలను) కడుగుతూ కనిపించింది.

ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా ఎలాంటి గర్వం లేకుండా పవిత్ర సేవలో పాల్గొనడం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. "ఎక్కడున్నా ప్రియాంక భారతీయ సంస్కృతిని మర్చిపోలేదు.. షీ ఈజ్ ఏ ట్రూ ఇండియన్" అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అమృతసర్ రుచులు.. పంజాబీ పొలాలు

కొద్దిరోజుల క్రితమే ఇండియాకు వచ్చిన ప్రియాంక.. అప్పటి నుంచి వరుసగా తన పర్యటనకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటుంది. అమృతసర్ చేరుకున్నాక అక్కడి ఫేమస్ 'అమృతసరీ కుల్చా', దాల్ మఖానీ, చోలే వంటి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించింది.

"జస్ట్ అమృతసర్ థింగ్స్" అంటూ ఆ ఫోటోలను పోస్ట్ చేసింది. అంతకుముందు ఢిల్లీ నుంచి అమృతసర్ వెళ్లే క్రమంలో విమానం విండో సీటు నుంచి పంజాబ్‌లోని పచ్చని పొలాలను చూస్తూ మురిసిపోయిన వీడియోలను కూడా షేర్ చేసింది.

రాజమౌళి - మహేష్ బాబు సినిమాతో తెలుగు ఎంట్రీ

ప్రియాంకా చోప్రా నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ 'ది బ్లఫ్' (The Bluff) ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కామన్ ఐలాండ్స్ నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ యాక్షన్ మూవీలో ప్రియాంక నటనకు మంచి గుర్తింపు దక్కుతోంది.

అయితే ప్రియాంక ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ మాత్రం 'వారణాసి' (Varanasi). దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ భారీ అడ్వెంచర్ సినిమాతో ప్రియాంక తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది.

ఈ సినిమాలో ఆమె 'మందాకిని' అనే కీలక పాత్రలో కనిపించనుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. దీనితో పాటు 'సిటాడెల్' వెబ్ సిరీస్ సెకండ్ సీజన్‌లోనూ ఆమె బిజీగా ఉంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: ప్రియాంక చోప్రా గోల్డెన్ టెంపుల్‌లో ఏ సేవ చేశారు?

జవాబు: ప్రియాంక ఆలయంలో స్వచ్ఛందంగా పాల్గొని పాత్రలు (గిన్నెలు) కడిగారు. సిక్కు సంప్రదాయంలో దీన్ని అత్యంత పవిత్రమైన 'సేవ'గా భావిస్తారు.

ప్రశ్న: రాజమౌళి సినిమాలో ప్రియాంక పాత్ర పేరు ఏమిటి?

జవాబు: మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' చిత్రంలో ప్రియాంక 'మందాకిని' అనే పాత్రలో నటిస్తున్నారు.

ప్రశ్న: ప్రియాంక నటించిన 'ది బ్లఫ్' ఎక్కడ చూడవచ్చు?

జవాబు: ప్రియాంక ప్రధాన పాత్రలో నటించిన 'ది బ్లఫ్' ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)లో అందుబాటులో ఉంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More