మీ ఆరాధ్య నటుడిలాగే మీరూ డిసిప్లేన్డ్-3 కిలోమీటర్లు చలిలో-మహేష్ బాబు ఫ్యాన్స్‌కు రాజమౌళి థ్యాంక్స్-ట్వీట్ వైరల్
మహేష్ బాబు ఫ్యాన్స్ కు డైెరెక్టర్ రాజమౌళి థ్యాంక్స్ చెప్పారు. శనివారం వారణాసి టైటిల్ టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించారు.
హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నవంబర్ 15న వారణాసి ఈవెంట్ ఒక గొప్ప వేడుకగా జరిగింది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రం 'వారణాసి' ఫస్ట్ లుక్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. నటులు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌లతో కలిసి ఆవిష్కరించారు. అయితే, ఈవెంట్ సమయంలో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తాయి. ట్రైలర్ భారీ తెరపై ప్లే అవ్వడానికి ముందు కొన్నిసార్లు ఆగిపోయింది.

రాజమౌళి థ్యాంక్స్
ఈ ఈవెంట్ కోసం మహేష్ బాబు అభిమానులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. చలిలోనూ నిలబడ్డారు. రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు అభిమానులకు ఓపికగా వేచి ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. వారణాసి మూవీ ట్రైలర్ ప్రదర్శించడంలో ఇబ్బందులు తలెత్తినా మహేష్ ఫ్యాన్స్ ఓపికగా వెయిట్ చేశారు.
చలిలో 3 కిలోమీటర్లు
"వారణాసి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం సుదూర ప్రాంతాల నుండి ప్రయాణించి, చలిలో దాదాపు 3 కిలోమీటర్లు నడిచిన మహేష్ అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా వైపు లోపాలు ఉన్నప్పటికీ, మీ సహనం ఏమాత్రం తగ్గలేదు. మీరు మీ ఆరాధ్య నటుడిలాగే క్రమశిక్షణతో ఉన్నారని నేను కచ్చితంగా చెప్పాలి. మాకు అండగా నిలిచిన ప్రతి తెలుగు సినిమా ప్రేక్షకుడికి పెద్ద ధన్యవాదాలు’’ అని ఆదివారం (నవంబర్ 16) రాజమౌళి ఎక్స్ లో పోస్టు చేశారు.
డ్రోన్లతో లీక్
వారణాసి ట్రైలర్ రిలీజ్ సందర్భంగా రాజమౌళి కాస్త ఎమోషనల్ అయ్యారు. " ముందు రోజు పెద్ద స్క్రీన్ పై వీడియో వేసి టెస్ట్ చేద్దామనుకున్నాం. కానీ కొంతమంది ఎక్కడి నుండి వచ్చారో మాకు తెలియదు. వారు డ్రోన్‌లను ఎగురవేసి, ఫుటేజీని షూట్ చేయడం ప్రారంభించారు. దాన్ని లీక్ చేశారు. ఇది ఒక సంవత్సరం కష్టానికి, వేలాది మంది శ్రమకు, కోట్ల రూపాయలకు సమానం. ప్రజలు దీని కోసం పగలు, రాత్రి కష్టపడ్డారు. దాని కారణంగా మాకు మా వీడియోను పరీక్షించుకునే అవకాశం కూడా రాలేదు’’ అని రాజమౌళి చెప్పారు.
వారణాసి ట్రైలర్
వారణాసి ట్రైలర్ లో ఒక గ్రహశకలం భూమిపైకి పడిపోవడం కనిపిస్తుంది. వారణాసి, అంటార్కిటికా, ఆఫ్రికా, ఇతర ప్రదేశాలలో ముక్కలు పడతాయి. ఈ చిత్రం శతాబ్దాల పాటు టైమ్ లైన్లో విస్తరించి ఉన్నట్లు కనిపిస్తుంది. రామాయణంతో సంబంధం ఉందని సూచిస్తుంది. ఇది మహేష్ రక్తంతో తడిసి, ఎద్దుపై స్వారీ చేస్తూ త్రిశూలం పట్టుకున్న దృశ్యంతో ముగుస్తుంది. నేపథ్యంలో దేవాలయాలు కనిపిస్తాయి.
వారణాసి సినిమాలో రుద్ర అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు మహేష్ బాబు. ఈ చిత్రం నుంచి కుంభ, మందాకినిగా పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. ఈ చిత్రం 2027 సమ్మర్ లో రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












