Varanasi: వారణాసికి మరో 365 రోజులన్న కీరవాణి.. అది సరేగానీ సాంగ్ ఎప్పుడు ఇస్తున్నావన్న ఎస్ఎస్ కార్తికేయ..
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ 'వారణాసి' రిలీజ్ కు సరిగ్గా 365 రోజులు ఉందన్న కీరవాణి, దానికి ప్రొడ్యూసర్ కార్తికేయ వేసి పంచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రాజెక్టుల్లో ఒకటి 'వారణాసి' (Varanasi). ఐకాన్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమా రిలీజ్ కానుండగా.. సరిగ్గా 365 రోజులు ఉందంటూ కీరవాణి చేసిన ట్వీట్, దానికి కార్తికేయ ఇచ్చిన రిప్లై వైరల్ అవుతున్నాయి.

ఏడాది కౌంట్‌డౌన్.. టీమ్ సందడి
వారణాసి మూవీ ఈరోజు అంటే మంగళవారం (ఏప్రిల్ 7, 2026) నుంచి సరిగ్గా 365 రోజుల్లో విడుదల కానుండటంతో చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా కౌంట్‌డౌన్ ప్రారంభించింది.
"మనం కాలంతో పోటీ పడుతూ ఏడాది ముందుకు వెళ్తే.. ఇక షో టైమ్ మొదలైనట్లే" అంటూ మేకర్స్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి కేవలం "365" అని పోస్ట్ చేస్తూ విడుదల సమయాన్ని గుర్తుచేశాడు. దీనిపై నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ స్పందిస్తూ.. "అది సరే.. మరి సాంగ్ ఎప్పుడు డెలివరీ చేస్తావ్?" అని సరదాగా ప్రశ్నించడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
షూటింగ్ అప్‌డేట్.. సెట్ పనులు షురూ
వారణాసి సినిమా అధికారిక ఎక్స్ హ్యాండిల్ నుంచి వచ్చిన ఒక పోస్ట్ మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. "సెట్ వేస్తున్నారంటగా.. డైరెక్టర్ హ్యాపీనా?" అంటూ చేసిన పోస్ట్ చూస్తుంటే.. హైదరాబాద్‌లో షూటింగ్ కోసం భారీ సెట్టింగ్స్ సిద్ధమవుతున్నాయని అర్థమవుతోంది.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ భాగ్యనగరంలోనే జరుగుతోంది. గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది.
రూ.1300 కోట్ల బడ్జెట్.. భారీ తారాగణం
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా సుమారు రూ. 1300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ మూవీలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా 'మందాకిని' పాత్రలో నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నాడు.
ఇక ఆర్. మాధవన్ హనుమంతుని పాత్రలో మెరవనుండగా, ప్రకాష్ రాజ్ మరో కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారం. రాజమౌళి మార్క్ మేకింగ్, మహేష్ బాబు మేకోవర్ కలిసి ఈ సినిమాను ఇండియన్ సినిమా గర్వించదగ్గ స్థాయిలో నిలబెడతాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: 'వారణాసి' సినిమా విడుదల తేదీ ఎప్పుడు?
జవాబు: ఈ మూవీ ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రశ్న: ఈ చిత్రంలో నటించే ప్రధాన నటీనటులు ఎవరు?
జవాబు: మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ఆర్. మాధవన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రశ్న: సినిమాకు సంగీతం ఎవరు అందిస్తున్నారు?
జవాబు: ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


