OTT Thriller: సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ పార్ట్ 2 వచ్చేసింది.. ఇవాళ నుంచే ఓటీటీ స్ట్రీమింగ్.. చంపుతోంది ఎవరు?

OTT Thriller: 30 ఎపిసోడ్‌లతో అదరగొట్టిన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ 'వీరభద్రుని రహస్యం' ఇప్పుడు సీజన్ 1 పార్ట్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇవాళ నుంచి పార్ట్ 2 స్ట్రీమింగ్ అవుతోంది. మనుషులను చంపుతోంది దేవుడేనా? ఇంకా ఏదైనా మిస్టరీ దాగి ఉందా? అనేది ఈ సిరీస్ పై హైప్ పెంచేసింది.

Published on: Sep 9, 2026, 06:02:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Thriller: తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలో విభిన్నమైన సస్పెన్స్ మిస్టరీ కంటెంట్‌తో ఆకట్టుకుంటున్న జీ5 (Zee5) వేదికగా మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ డిజిటల్ ప్రీమియర్ అయ్యింది. గతంలో సీజన్ 1 మొదటి భాగంలో ఏకంగా 30 ఎపిసోడ్‌లతో ఆడియన్స్ ను తీవ్ర ఉత్కంఠకు గురిచేసి సూపర్ హిట్‌గా నిలిచిన 'వీరభద్రుని రహస్యం' ఇప్పుడు సీజన్ 1 పార్ట్ 2 తో స్ట్రీమింగ్‌కు వచ్చింది. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఈ సిరీస్ కొత్త ఎపిసోడ్‌లు ఓటీటీ వీక్షకులకు అందుబాటులోకి వచ్చాయి.

సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ పార్ట్ 2 వచ్చేసింది.. ఇవాళ నుంచే ఓటీటీ స్ట్రీమింగ్.. చంపుతోంది ఎవరు? (x/ZEE5Telugu)
సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ పార్ట్ 2 వచ్చేసింది.. ఇవాళ నుంచే ఓటీటీ స్ట్రీమింగ్.. చంపుతోంది ఎవరు? (x/ZEE5Telugu)

వీరభద్రుని ఆలయం చుట్టూ తిరిగే మిస్టరీ

ఒక పురాతన గ్రామంలోని ‘వీరభద్రుని ఆలయం’, దాని చుట్టూ అల్లుకున్న మిస్టరీ, హత్యల నేపథ్యంలో వీరభద్రుని రహస్యం సిరీస్ స్టోరీ సాగుతుంది. ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఫస్ట్ పార్ట్ ఊహించని మలుపులతో ఓటీటీ ఆడియన్స్ కు మంచి థ్రిల్ అందించింది. ఊర్లో వీరభద్రుడే తప్పు చేసిన వాళ్లను శిక్షిస్తున్నాడనే దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటీ అన్నది ఉత్కంఠ రేపుతుంది.

పార్ట్ 2 ఇలా

వీరభద్రుని రహస్యం ఫస్ట్ పార్ట్ 30 ఎపిసోడ్‌లు అనేక చిక్కుముడులతో ముగియగా, ఇప్పుడు ప్రారంభమైన పార్ట్ 2 లో ఆ రహస్యాలన్నింటికీ సమాధానాలు లభించనున్నాయి. ముఖ్యంగా దైవిక శక్తులు, దాని వెనుక ఉన్న హిస్టారికల్ కోణాలను దర్శకుడు అత్యంత ఆసక్తికరంగా తెరకెక్కించాడని తెలిసింది.

సస్పెన్స్ థ్రిల్లర్

తెలుగు ఓటీటీ ఆడియన్స్ లో మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని జీ5 ఈ సిరీస్‌ను అత్యంత భారీగా రూపొందించింది. మొదటి భాగానికి వచ్చిన విశేష స్పందన, భారీ వ్యూయర్ షిప్ రికార్డులే ఈ పార్ట్ 2 పై కొండంత అంచనాలు ఏర్పడేలా చేశాయి.

ఆకట్టుకునే నేపథ్య సంగీతం, గ్రామీణ వాతావరణంలో సాగే సీన్లు, ప్రతి ఎపిసోడ్ ముగింపులో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను తర్వాతి ఎపిసోడ్ వైపు నడిపిస్తాయి. ప్రతి వారం కొత్త ఎపిసోడ్‌లతో వచ్చే ఈ వీక్లీ సిరీస్ థ్రిల్లర్ లవర్స్‌కు మంచి వీకెండ్ ఆప్షన్‌గా నిలవనుంది.

ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు

ఇవాళ (సెప్టెంబర్ 9) నుంచి జీ5 యాప్‌లో 'వీరభద్రుని రహస్యం' సీజన్ 1 పార్ట్ 2 అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి 30 ఎపిసోడ్‌లను చూసిన వీక్షకులతో పాటు కొత్తగా ఈ సిరీస్‌ను ప్రారంభించే వారి కోసం జీ5 ప్రత్యేకంగా అన్ని ఎపిసోడ్‌లను తెలుగులో హెచ్‌డీ క్వాలిటీలో అందుబాటులో ఉంచింది. క్రైమ్, డివోషనల్ మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న సిరీస్‌లను ఇష్టపడే తెలుగు డిజిటల్ ప్రేక్షకులు తప్పక చూడాల్సిన టాప్ సిరీస్‌లలో ఇది ఒకటిగా నిలిచింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More