Zee5 Releases: సెప్టెంబర్‌లో జీ5 ఓటీటీ ధమాకా.. ఏకంగా 13 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్.. తెలుగులోనూ థ్రిల్లర్ కంటెంట్
Zee5 Releases: జీ5 ఓటీటీలో సెప్టెంబర్ నెలలో చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ రానుంది. వీటిలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పంచనామాతోపాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల కంటెంట్ మొత్తం ఉండటం విశేషం.
Zee5 Releases: ఓటీటీ ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు జీ5 (ZEE5) డిజిటల్ ప్లాట్‌ఫామ్ గ్రాండ్ ప్లాన్ వేసింది. బాలీవుడ్ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్స్ నుంచి సౌత్ సూపర్‌స్టార్స్ దిలీప్, తమన్నా, నయనతార నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీస్ వరకు ఏకంగా 13 కంటే ఎక్కువ కొత్త ప్రాజెక్ట్‌లు బింజ్ వాచ్ కోసం సిద్ధమవుతున్నాయి.

బిగ్ స్క్రీన్ మూవీస్.. జీ5లో డిజిటల్ రచ్చ
ఈ నెలలో జీ5 ఓటీటీలో వస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్లలో మలయాళం యాక్షన్ థ్రిల్లర్ 'బాంద్రా' (Bandra) ఒకటి. 90ల నాటి ముంబై అండర్‌వరల్డ్, బాలీవుడ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో మలయాళ స్టార్ దిలీప్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా లీడ్ రోల్స్ చేశారు.
ఇక కోలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ నయనతార, కవిన్ రాజ్ జంటగా నటించిన తమిళ రొమాంటిక్ డ్రామా 'హాయ్' (Hi) కూడా సెప్టెంబర్‌లోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తోంది. సీనియర్ నటులు కే భాగ్యరాజ్, ప్రభు ముఖ్య పాత్రలు పోషించిన ఈ క్లాసీ మూవీ లవ్ స్టోరీ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకోనుంది.
మరాఠీ సినిమా లవర్స్ కోసం 'అడకిత్తా' (Adkitta) అనే ఇంట్రస్టింగ్ మూవీని జీ5 అందుబాటులోకి తెస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రాంతీయ భాషా చిత్రాల కేటగిరీలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
బాలీవుడ్ గ్రిప్పింగ్ థ్రిల్లర్స్, కామెడీ సిరీస్
నేషనల్ వైడ్‌గా విపరీతమైన క్రేజ్ ఉన్న పాన్-ఇండియా కంటెంట్‌పై జీ5 గట్టిగా ఫోకస్ పెట్టింది. దంగల్, పాన్ సింగ్ తోమర్ ఫేమ్ తిగ్మాంశు ధూలియా డైరెక్షన్ లో వస్తున్న ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'ఘమాసాన్' (Ghamasan) సెప్టెంబర్ 11న స్ట్రీమింగ్ కానుంది. అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ, రాజ్‌పాల్ యాదవ్, ఇషితా దత్తా ఈ సినిమాలో గ్రిప్పింగ్ పెర్ఫార్మెన్స్‌తో అలరించనున్నారు.
కామెడీ లవర్స్ కోసం అమిత్ గుప్తా డైరెక్షన్ లో వస్తున్న **'బకైతీ' (Bakaiti)** సిరీస్ సిద్ధమైంది. రాజేష్ తైలాంగ్, షీబా చద్దా, తాన్యా శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ఆడియన్స్‌ను కడుపుబ్బ నవ్వించే పక్కా పల్లెటూరి కామెడీ డ్రామాగా రాబోతోంది.
సౌత్ వెబ్ సిరీస్.. తెలుగు వర్షన్స్
ఇక సెప్టెంబర్ 11నే 'పంచనామా' (Punchnama) అనే పవర్ ఫుల్ తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ప్రతి సీన్ లో ఊహించని ట్విస్టులతో సస్పెన్స్ రైడ్‌లా ఈ సిరీస్ సాగనుంది.
మరో సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘వీరభద్రుని రహస్యం సీజన్ 2’ సిద్ధమైంది. చైల్డ్ ఆర్టిస్ట్ ఫేమ్ ఆనీ, రఘు కుంచె, అభినవ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో, సెకండ్ సీజన్ మీద భారీ అంచనాలు ఉన్నాయి.
తమిళ కోర్టురూమ్ డ్రామా వెబ్ సిరీస్ 'సట్టముమ్ నీధియుమ్ సీజన్ 2' (Sattamum Neethiyum 2) కూడా జీ5లో రీ-ఎంట్రీ ఇస్తోంది. బాలాజీ సెల్వరాజ్ డైరెక్షన్ లో శరవణన్, నమ్రిత ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సిరీస్ న్యాయ వ్యవస్థలోని లొసుగులను చాలా పదునుగా చూపించనుంది.
కన్నడ కంటెంట్ ప్రేమికుల కోసం ‘కార్పొరేట్ లవ్ స్టోరీ’ రాబోతోంది. ఐటీ, కార్పొరేట్ వరల్డ్ ఆఫీస్ కల్చర్, అక్కడ చిగురించే ప్రేమకథల చుట్టూ ఈ ఒరిజినల్ సిరీస్‌ను ఇంట్రస్టింగ్‌గా మలిచారు.
రియాలిటీ షోలు, కిడ్స్ స్పెషల్
సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు మ్యూజిక్, డాన్స్ రియాలిటీ షోలను కూడా జీ5 లైనప్‌లో చేర్చింది. దేశీ హిప్-హాప్ స్టార్స్ రఫ్తార్, కృష్ణ జడ్జిలుగా వ్యవహరిస్తున్న టాలెంట్ షో 'లెగసీ' (Legacy) యూత్‌ను ఆకట్టుకోనుంది. అలాగే మలయాళంలో ఫస్ట్ టైమ్ వస్తున్న ర్యాప్ రియాలిటీ షో 'కేరళ అండర్‌గ్రౌండ్' (Kerala Underground) ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
కన్నడ రూరల్ లైఫ్‌స్టైల్, సంస్కృతి సంప్రదాయాల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన పాపులర్ రియాలిటీ షో 'హళ్లి పవర్' (Halli Power) కూడా ఈ నెలే స్ట్రీమ్ కానుంది. పిల్లల కోసం 'బంద్ బుధ్ ఔర్ బుడ్బక్ సీజన్ 2' (Bandbudh Aur Budbak 2)తో పాటు 'స్మార్ట్ కిడ్జ్' (Smart Kidz) లాంటి ఫన్ కాన్సెప్ట్స్ అందుబాటులోకి వస్తున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


