Adarsha kutumbam: వెంకీ ఆదర్శ కుటుంబం మ్యూజిక్ డైరెక్టర్ ఛేంజ్- త్రివిక్రమ్‌తో విభేదాలు- హర్ష‌వ‌ర్ధ‌న్ ఔట్‌-త‌మ‌న్ ఇన్‌!

Adarsha kutumbam: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా చేస్తున్న ఆదర్శ కుటుంబం మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఛేంజ్ అయినట్లు తెలిసింది. హర్షవర్ధన్ రామేశ్వర్ స్థానంలో తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వచ్చినట్లు సమాచారం. 

Published on: Apr 23, 2026, 10:57:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Adarsha kutumbam: వెంకీ మామ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ మారాడానే టాక్ హాట్ టాపిక్ గా మారింది. తమన్ ఈ సినిమాకు కొత్త మ్యూజిక్ డైెరెక్టర్ గా రంగంలోకి దిగాడని అంటున్నారు.

తమన్, త్రివిక్రమ్ (x/MusicThaman)
తమన్, త్రివిక్రమ్ (x/MusicThaman)

ఆదర్శ కుటుంబం మ్యూజిక్ డైరెక్టర్

త్రివిక్రమ్ శ్రీనివాస్- విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తాడని మూవీ టీమ్ ఫస్ట్ ప్రకటించింది. అయితే ఇప్పుడు అతను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అతని స్థానంలో తమన్ ఈ ఆదర్శ కుటుంబం మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడని తెలిసింది.

అదే కారణం

ఆదర్శ కుటుంబం లాంటి బిగ్ ప్రాజెక్ట్ నుంచి హర్షవర్ధన్ రామేశ్వర్ తప్పుకోవడం షాకింగ్ లాంటిదేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే డైరెక్టర్ త్రివిక్రమ్, హర్షవర్ధన్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని సమాచారం. ఈ విభేదాల కారణంగానే ఈ మూవీకి మ్యూజిక్ అందించే బాధ్యత నుంచి హర్షవర్ధన్ తప్పుకొన్నాడని అంటున్నారు.

రంగంలోకి తమన్

హర్షవర్ధన్ తప్పుకోవడంతో త్రివిక్రమ్ వెంటనే తమన్ ను రంగంలోకి దించాడని సమాచారం. త్రివిక్రమ్- తమన్ కాంబినేషన్లో ఎన్నో హిట్ సాంగ్స్ వచ్చాయి. వీళ్లు చాలా సినిమాలకు కలిసి పని చేశారు. త్రివిక్రమ్ ను తన టీచర్ గా తమన్ భావిస్తుంటాడు. గురూజీతో ఈ బంధం నేపథ్యంలోనే అడిగిన వెంటనే ఆదర్శ కుటుంబం మూవీకి సంగీతం అందించేందుకు తమన్ ఓకే అన్నాడని టాక్.

ఉస్తాద్ భగత్ సింగ్ కు అలా

రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో కాస్త రచ్చ సాగింది. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. కానీ లాస్ట్ మినిట్లో తమన్ వచ్చి బీజీఎం అందించాడు. ఇది దేవిశ్రీ ప్రసాద్ ను అవమానపరచడమే అనే విమర్శలు వచ్చాయి.

రిలీజ్ ఎప్పుడంటే?

ఆదర్శ కుటుంబం షూటింగ్ ను త్రివిక్రమ్ పరుగులు పెట్టిస్తున్నాడు. నిజానికి ఈ సినిమాను 2026 సమ్మర్ లో రిలీజ్ చేయాలని ఫస్ట్ అనుకున్నారు. కానీ ఇంకా షూటింగ్ పార్ట్ కంప్లీట్ కాకపోవడంతో వేసవిలో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఛాన్స్ లేనట్లే. ఈ నేపథ్యంలో అక్టోబర్ లో పండగ సీజన్ పై త్రివిక్రమ్ గురి పెట్టాడని అంటున్నారు.

ఫొటోలు వైరల్

దసరా లేదా దీపావళి సందర్భంగా ఆదర్శ కుటుంబం మూవీని రిలీజ్ చేయాలని గురూజీ ప్లాన్ వేస్తున్నాడంటా. తాజాగా ఈ మూవీ షూటింగ్ మలక్ పేట్ మెట్రో స్టేషన్ లో జరిగింది. ఇక్కడ ఓ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేశారు. దీనికి సంబంధించిన వెంకీ, త్రివిక్రమ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More