Vijay Rashmika: ఫ్యాన్స్‌కు విరోష్ స్వీట్ సర్‌ప్రైజ్-ఇవాళ దేశవ్యాప్తంగా అభిమానులకు స్వీట్లు, అన్నదానం-తెలంగాణ, ఏపీలో!
Vijay Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. తమ వివాహాన్ని పురస్కరించుకున్న ఈ విరోష్ జంట ఫ్యాన్స్ కు స్వీట్ సర్ ప్రైజ్ ఇవ్వనుంది. ఇవాళ దేశవ్యాప్తంగా స్వీట్లు పంచనుంది. అలాగే గుళ్లలో అన్నదానం చేయనుంది. ఇందుకోసం తెలంగాణ, ఏపీలోని కొన్ని ప్రాంతాలను సెలక్ట్ చేశారు.
ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి గ్రాండ్ గా జరిగింది. వివాహ బంధంతో ఈ లవ్ బర్డ్స్ ఒక్కటయ్యారు. తమ పెళ్లి నేపథ్యంలో ఫ్యాన్స్ కు స్వీట్ సర్ ప్రైజ్ ఇవ్వాలని విరోష్ జోడీ నిర్ణయించుకుంది. అందుకే దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని అభిమానులకు ఇవాళ (మార్చి 1) స్వీట్లు పంచనున్నారు. కొన్ని గుళ్లలో అన్నదానం చేయనున్నారు.

ఫ్యాన్స్ కోసం స్వీట్లు
తమ పెళ్లి కానుకగా అభిమానులకు స్వీట్లు పంపించనున్నట్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ప్రకటించారు.
‘‘ఈ దేశంలోని ప్రజలు ఎల్లప్పుడూ మా ప్రయాణంలో, ప్రేమలో భాగమయ్యారు. మా పెళ్లిని మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా మాకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇండియాలో ప్రతిదాన్ని స్వీట్లు, ఆహారంతో సెలబ్రేట్ చేసుకుంటారు’’ అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో విరోష్ రాసుకొచ్చింది.
స్వీట్ ట్రక్కులు
‘‘మా జీవితంలోని ఈ పెద్ద మూమెంట్ ను మీతో పంచుకోవడానికి స్వీట్లు, ప్రేమ నిండిన ట్రక్కులను దేశవ్యాప్తంగా మార్చి 1న పంపిస్తున్నాం. అలాగే దేశంలోని కొన్ని దేవాలయాల్లో అన్నదానం చేస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి’’ అని విరోష్ జోడీ పేర్కొంది.
ఈ ప్లేసులకు
ఢిల్లీ, బీహార్, తెలంగాణ, చండీగఢ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరిలో ఫ్యాన్స్ కు విరోష్ స్వీట్లు పంపించనున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్ కు ఈ స్వీట్ ట్రక్కులు వెళ్తాయి. ఏపీలోని వైజాగ్, విజయవాడ, పుట్టపర్తిలో స్వీట్లు పంచుతారు.
మరోవైపు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, అస్సాం, గుజరాత్, చండీగఢ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని గుళ్లలో అన్నదానం చేయనున్నారు. తెలంగాణలోని చింతపల్లి సాయిబాబా టెంపుల్ (చింతపల్లి), మన్యంకొండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి టెంపుల్ (మహబూబ్ నగర్), హరేకృష్ణ హెరిటేజ్ (హైదరాబాద్) దేవాలయాలను ఇందుకు ఎంచుకున్నారు. ఏపీలో శ్రీ కనక మహాలక్ష్మి టెంపుల్ (వైజాగ్), ద్వారక తిరుమల టెంపుల్ (ఏలూరు), కనకదుర్గ టెంపుల్ (విజయవాడ)లో అన్నదానం చేయనున్నారు.

విరోష్ రిసెప్షన్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ రిసార్ట్ లో జరిగింది. ఈ విరోష్ జోడీ తమ వెడ్డింగ్ రిసెప్షన్ ను మార్చి 4న హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారు. ఈ రిసెప్షన్ కు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు, ప్రముఖులు అటెండ్ కాబోతున్నారు. తమ పెళ్తి తర్వాత ఢిల్లీ వెళ్లిన విజయ్, రష్మిక.. రిసెప్షన్ కు ప్రధాని మోదీని ఆహ్వానించారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


