Vijay Rashmika: పెళ్లి తర్వాత రష్మిక మందన్న ఫస్ట్ బర్త్‌డే.. విజయ్ దేవరకొండ అదిరే సర్‌ప్రైజ్.. ఐలవ్యూ జయమ్మ
Vijay Rashmika: ఐ లవ్యూ జయమ్మ అంటూ తన భార్య రష్మిక మందన్నపై విజయ్ దేవరకొండ ప్రేమ కురిపించేశాడు. ఇవాళ రష్మిక బర్త్ డే. ఈ సందర్భంగా రణబాలి సినిమాలో ఆమె మేకోవర్ వీడియోను విజయ్ ఇన్ స్టాలో పంచుకున్నాడు.
రష్మిక మందన్న బర్త్ డే సందర్భంగా విజయ్ దేవరకొండ అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. రణబాలి మూవీలో రష్మిక మేకోవర్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు. సినిమా కోసం ఆమె తన లుక్ ను మార్చుకునే మేకింగ్ వీడియో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ వీడియో వైరల్ గా మారింది.

ఐ లవ్యూ జయమ్మ
ఇవాళ (ఏప్రిల్ 5) రష్మిక మందన్న బర్త్ డే. ఈ సందర్భంగా తన భార్యపై విజయ్ దేవరకొండ ప్రేమ కురిపించేశాడు. ‘‘ఐ లవ్యూ జయమ్మ’’ అనే క్యాప్షన్ తో ఇన్ స్టాగ్రామ్ లో వీడియో షేర్ చేశాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న రణబాలి మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే.
జయమ్మగా రష్మిక
రణబాలి మూవీలో రష్మిక మందన్న ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఇందులో ‘జయమ్మ’ అనే క్యారెక్టర్లో రష్మిక నటిస్తోంది. కథానాయకుడి భార్య క్యారెక్టర్ ఇది. ఈ క్యారెక్టర్ పేరును మెన్షన్ చేస్తూ రణబాలి కోసం రష్మిక తన లుక్ మార్చుకున్న వీడియోను విజయ్ పంచుకున్నాడు.
పెళ్లి తర్వాత ఫస్ట్
పెళ్లి తర్వాత రష్మిక మందన్న ఫస్ట్ బర్త్ డే ఇది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26, 2026న ఉదయ్ పూర్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లో ఈ విరోష్ జోడీ గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించింది.
రణబాలి గురించి
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న సినిమా రణబాలి. దీన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయబోతున్నారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ రణబాలి మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ డైరెక్టర్.
రిలీజ్ డేట్
పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రణబాలి తెరకెక్కుతోంది. భారత స్వాతంత్య్రానికి ముందు జరిగే కథతో ఈ సినిమా సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
మూడో సినిమా
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న మూడో సినిమా రణబాలి. ఈ జంట ఇప్పటికే గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. గీత గోవిందం సినిమా షూటింగ్ టైమ్ లోనే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య లవ్ మొదలైందని టాక్. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ తో అది ముదిరిందని అంటారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


