Vijay Deverakonda: బోనాల పండుగలో అర్జున్ రెడ్డి కాంబో సందడి.. లాల్ దర్వాజా అమ్మవారి సేవలో విజయ్ దేవరకొండ, సందీప్ వంగా
Vijay Deverakonda: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల జాతర తెలంగాణలో ఘనంగా సాగుతోంది. ఈ సందర్భంగా పాతబస్తీ లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారిని రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ఆనంద్ దేవరకొండ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Vijay Deverakonda: తెలంగాణ వ్యాప్తంగా ఆషాడ బోనాల వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులోనూ హైదరాబాద్ లో ఆ సందడే వేరే లెవల్ లో ఉంటుంది. ఈ రోజు (ఆగస్టు 9) పాతబస్తీలోని చరిత్రాత్మక లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు భక్తులు వేలాదిగా పోటెత్తారు. ఈ పావన పర్వదినాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అమ్మవారిని దర్శించుకున్నారు.

విజయ్ దేవరకొండ పూజలు
ఆలయ ప్రాంగణానికి చేరుకున్న విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగాకు ఆలయ కమిటీ ప్రతినిధులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. వీళ్లు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. తమ కుటుంబ సభ్యులు, అభిమానులు క్షేమంగా ఉండాలని, రాబోయే సినీ ప్రాజెక్టులు విజయవంతం కావాలని కోరుకుంటూ మహంకాళి అమ్మవారి దివ్య ఆశీస్సులు అందుకున్నారు.
పాతబస్తీలో ఫ్యాన్స్ పూనకాలు
తెలుగు చిత్రసీమలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన 'అర్జున్ రెడ్డి' చిత్రంతో సౌత్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన విజయ్ దేవరకొండ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ ఒకే వేదికపై కనిపించడంతో పాతబస్తీ పరిసరాల్లో పండుగ వాతావరణం మరింత వేడెక్కింది.
వీరిద్దరూ కలిసి ఆలయానికి రావడంతో అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో లాల్ దర్వాజాకు చేరుకుని తమ అభిమాన హీరో, దర్శకులను చూడటానికి ఎగబడ్డారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య విజయ్, సందీప్, ఆనంద్ అమ్మవారి దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం వీరు అమ్మవారి సన్నిధిలో దండం పెట్టుకుంటున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
భారీ ప్రాజెక్టులతో బిజీగా
ప్రస్తుతం విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా ఇద్దరూ తమ కెరీర్‌లో అత్యంత క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ ఏమో ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన్’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. రణబాలిలో విజయ్ భార్య రష్మిక మందన్న హీరోయిన్. మరోవైపు ప్రభాస్ హీరోగా స్పిరిట్ ను తెరకెక్కిస్తున్నాడు సందీప్. ఇక ఆనంద్ ఏమో ఎపిక్ అంటూ సందడి చేస్తున్నాడు.
మళ్లీ ఎప్పుడు?
అర్జున్ రెడ్డి లాంటి ట్రెండ్ సెట్టర్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా మళ్లీ కలిసి పని చేయలేదు. ఈ నేపథ్యంలో వీళ్ల కాంబినేషన్లో తర్వాతి సినిమా ఎప్పుడు అనే క్యూరియాసిటీ కొనసాగుతూనే ఉంది. సినిమా పరంగానే కాకుండా బయట కూడా వీళ్లిద్దరు మంచి ఫ్రెండ్స్. మరి త్వరలోనే అర్జున్ రెడ్డి కాంబో రిపీట్ అవుతుందేమో చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


