...
...
Next Story

Vijay Deverakonda: ‘ఎఫ్’ వర్డ్‌తో విజయ్ షాకింగ్ పోస్ట్.. అలాంటి వాళ్లందరూ పక్కకెళ్లి అంటూ.. విమర్శలపై ఘాటుగా రియాక్షన్

Vijay Deverakonda: తమ వ్యక్తిగత బంధంపై, పెల్లిపై అసభ్యకర విమర్శలు చేస్తున్న ట్రోలర్లకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ బూతులతో ఘాటు సమాధానమిచ్చారు. రష్మికతో కలిసి ఉన్న ఒక క్యూట్ వీడియో, ఫోటోను షేర్ చేస్తూ.. "మా సంతోషాన్ని చూసి ఓర్వలేని వారు పక్కకెళ్లి.." అంటూ ఎఫ్ వర్డ్ తో అత్యంత ఘాటుగా పోస్ట్ పెట్టారు.

Published on: Oct 26, 2026, 15:57:57 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Vijay Deverakonda: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పర్సనల్ లైఫ్, పెళ్లికి సంబంధించిన విషయాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారానికి చెక్ పెడుతూ సరికొత్త యుద్ధమే ప్రకటించారు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్ సీజన్ 9' (Koffee With Karan 9)లో ఈ జంట పాల్గొన్న సంగతి తెలిసిందే.

Vijay Deverakonda: ‘ఎఫ్’ వర్డ్‌తో విజయ్ షాకింగ్ పోస్ట్.. అలాంటి వాళ్లందరూ పక్కకెళ్లి అంటూ.. విమర్శలపై ఘాటుగా రియాక్షన్
Vijay Deverakonda: ‘ఎఫ్’ వర్డ్‌తో విజయ్ షాకింగ్ పోస్ట్.. అలాంటి వాళ్లందరూ పక్కకెళ్లి అంటూ.. విమర్శలపై ఘాటుగా రియాక్షన్

ఆ ఎపిసోడ్‌లో తమ ప్రేమ, ప్రపోజల్ గురించి సరదాగా పంచుకున్న మాటలను కొంతమంది సోషల్ మీడియా సైకాలజిస్టులు, నెటిజన్లు తప్పుగా చిత్రీకరిస్తూ విజయ్‌ను 'రెడ్ ఫ్లాగ్' అంటూ విమర్శించడం ప్రారంభించారు. తాజాగా ఈ నెగెటివిటీపై రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన మార్క్ బోల్డ్ స్టైల్లో స్పందిస్తూ నెట్టింట అగ్గి రాజేశారు. ఇప్పటికే రష్మిక సుదీర్ఘ పోస్ట్‌తో ట్రోలర్ల నోళ్లు మూయించగా, ఇప్పుడు విజయ్ వైల్డ్ రెస్పాన్స్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.

"నా బెస్ట్ ఫ్రెండ్.. నా భార్య": విజయ్ ఎమోషనల్ అండ్ రౌడీ పోస్ట్

రష్మికతో కలిసి ఉన్న ఒక రొమాంటిక్ వీడియో, పిక్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న విజయ్.. విమర్శకుల నోళ్లు మూయించేలా ఒక ఘాటైన నోట్ రాసుకొచ్చారు.

"నా బెస్ట్ ఫ్రెండ్, నా భార్య, నా సర్వస్వం. నా జీవితంలో నేను సరిగ్గా ఎంచుకున్న అత్యంత అందమైన భాగం ఆమె. మా గురించి ఆందోళన చెందుతున్న వారందరికీ చెబుతున్నా.. మేమిద్దరం అత్యంత సంతోషంగా, ఆనందంగా ఉన్నాం. ఆ దేవుడి ఆశీస్సులు మాపై ఉన్నాయి. ఒకవేళ ఈ ప్రపంచానికి వ్యతిరేకంగా నేనూ-ఆమె నిలబడాల్సి వచ్చినా నేను సిద్ధమే. నిజమైన ప్రేమను, సాధారణంగా ఆనందంగా జీవించే జీవితాన్ని ఆస్వాదించే ప్రతి ఒక్కరికీ నా బిగ్ లవ్. ఇక మిగిలిన వాళ్లందరికీ.. ఎలాంటి గౌరవం లేదా మర్యాద లేకుండా చెబుతున్నా.. పక్కకెళ్లి.. (f*** Themselves) - దేవరకొండ విజయ్ సాయి" అంటూ విజయ్ రాసుకొచ్చిన క్యాప్షన్ ఇప్పుడు ఇండస్ట్రీ వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తోంది.

విజయ్‌ కంటే ముందే విరుచుకుపడ్డ రష్మిక

"నాకు నా భర్త అంటే పిచ్చి. ఒక భార్య తన భర్తను ప్రేమించడం ఎప్పటినుంచి తప్పు అయిపోయింది?" అని నెటిజన్లను నిలదీశారు. విజయ్ పెళ్లికి సమయం తీసుకోవడం వెనుక ఉన్న ప్రాక్టికల్ ఆలోచనను సమర్థిస్తూ, తమ కుటుంబాలను ఈ వివాదంలోకి లాగడం ఫెమినిజం కాదని, అది కేవలం వేధింపులు మాత్రమేనని స్పష్టం చేశారు.

అసలు వివాదం ఎలా మొదలైంది?

2018లో వచ్చిన 'గీత గోవిందం', 2019లో వచ్చిన 'డియర్ కామ్రేడ్' చిత్రాలతో వెండితెరపై మైండ్ బ్లోయింగ్ కెమిస్ట్రీ పండించిన ఈ జంట.. 2026 ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ వేదికగా వివాహ బంధంతో ఒకటయ్యారు. అయితే 'కాఫీ విత్ కరణ్ 9' షోలో విజయ్ మాట్లాడుతూ.. రష్మిక తనను పెళ్లి చేసుకోవాలని 100 సార్లు అడిగిందని సరదాగా వ్యాఖ్యానించారు.

దీనిని తప్పుబడుతూ కొంతమంది నెటిజన్లు రష్మిక మాత్రమే ఈ బంధంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తోందని, విజయ్ అహంకారంతో ప్రవర్తిస్తున్నారంటూ పాత వీడియోలను కట్ చేసి ట్రోల్ చేయడం ప్రారంభించారు.

ప్రస్తుతం థియేటర్లలో విజయ్-రష్మిక జంటగా నటించిన 'రణబాలి' (Ranabaali) బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదనిపిస్తుండగా.. బయట వీరిద్దరూ ట్రోలర్లకు ఇచ్చిన ఊహించని మాస్ కౌంటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks