Vijay Deverakonda: పాత ఫోన్ పని చేస్తున్నప్పుడు కొత్త ఐఫోన్ అవసరమా.. ఎవరినో మెప్పించడానికి ఈఎంఐలపై కొనొద్దు: విజయ్ సూచన

Vijay Deverakonda: ఐఫోన్ లేటెస్ట్ మోడల్స్ ను కొనడంపై విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎవరినో మెప్పించడానికి ఈఎంఐలపై కొత్త మోడల్స్ కొనడాన్ని విజయ్ తప్పుబట్టారు. యువతకు ఓ మంచి మెసేజ్ ఇచ్చారు.

Published on: Oct 6, 2026, 19:15:36 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్‌గా చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన 'ఐఫోన్ 18 ప్రో' (iPhone 18 Pro) కొనకుండా, ఇప్పటికీ పాత ఐఫోన్ మోడల్‌నే వాడుతున్నట్లు విజయ్ రివీల్ చేశారు. కేవలం ఇతరులను ఇంప్రెస్ చేయడం కోసం ఈఎంఐలు (EMIs) పెట్టి మరీ కొత్త ఫోన్లు కొనే ట్రెండ్‌పై ఆయన స్పందిస్తూ యూత్‌కు గట్టి మెసేజ్ ఇచ్చారు.

Vijay Deverakonda: పాత ఫోన్ పని చేస్తున్నప్పుడు కొత్త ఐఫోన్ అవసరమా.. ఎవరినో మెప్పించడానికి ఈఎంఐలపై కొనొద్దు: విజయ్ సూచన
Vijay Deverakonda: పాత ఫోన్ పని చేస్తున్నప్పుడు కొత్త ఐఫోన్ అవసరమా.. ఎవరినో మెప్పించడానికి ఈఎంఐలపై కొనొద్దు: విజయ్ సూచన

ఐఫోన్ 18 ప్రో అక్కర్లేదు.. పాత ఫోనే బెస్ట్

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ దేవరకొండ.. ఫోన్ల టెక్నాలజీ పిచ్చిపై ఓపెన్‌గా మాట్లాడారు. మార్కెట్‌లో ప్రతీ ఏటా కొత్త ఆపిల్ మోడల్స్ వస్తూనే ఉంటాయని, అయితే పాత ఫోన్ పర్ఫెక్ట్‌గా పనిచేస్తున్నప్పుడు లక్షలు పోసి కొత్తది కొనాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా పాత ఐఫోన్ మోడల్స్‌నే చాలా కాలం పాటు వాడటం మనం చూశాం. సేమ్ అలాగే తను కూడా టెక్నాలజీ విషయంలో అనవసరమైన హంగామా చేయనని, ఇప్పటికీ పాత మోడల్ ఐఫోన్‌తోనే మేనేజ్ చేస్తున్నట్లు విజయ్ క్లారిటీ ఇచ్చారు.

ఈఎంఐల సంస్కృతిపై విజయ్ సంచలన వ్యాఖ్యలు

సొసైటీలో కొందరు కేవలం షోఆఫ్ కోసం, అందరి ముందు గొప్పలకు పోయి క్రెడిట్ కార్డులు, ఈఎంఐల ద్వారా లేటెస్ట్ ఐఫోన్లు కొంటున్నారని విజయ్ అసహనం వ్యక్తం చేశారు. "మన దగ్గర ఉన్న పాత వర్షన్ ఫోన్ చాలా బాగా పనిచేస్తున్నప్పుడు, కేవలం పక్కవారిని మెప్పించడానికి అప్పులు చేసి కొత్త మోడల్ కొనడం ఏంటి?" అని ఆయన ప్రశ్నించారు.

డబ్బును సరిగ్గా మేనేజ్ చేయడం, అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టడం ఎంత ముఖ్యమో యూత్ తెలుసుకోవాలని విజయ్ హితవు పలికారు. రియల్ లైఫ్‌లో ప్రాక్టికల్‌గా ఆలోచించడం అలవాటు చేసుకోవాలని, అనవసరమైన క్రేజ్ కోసం జేబులు ఖాళీ చేసుకోవద్దని సలహా ఇచ్చారు.

విజయ్ దేవరకొండ లైనప్.. నెక్స్ట్ బాక్సాఫీస్ టార్గెట్!

'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' సినిమాలతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రణబాలి మూవీ రిలీజ్ కోసం వేచి చూస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో తన భార్య రష్మికతో కలిసి విజయ్ నటించాడు. భారీ అంచనాల మధ్య రిలీజైన కింగ్డమ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో ఈ రణబాలిపై విజయ్ భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే ఈ సినిమాకు రజనీకాంత్ జైలర్ 2 నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. మరి పెళ్లి తర్వాత విజయ్, రష్మిక కలిసి నటించిన ఈ తొలి సినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More