Rashmika Mandanna: ప్రెగ్నెంట్‌గా రష్మిక మందన్న.. జయమ్మగా ప్యాకప్.. రణబాలి షూటింగ్‌కు గుడ్‌బై!
Rashmika Mandanna: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబలి’ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో 'జయమ్మ' పాత్రలో నటిస్తున్న రష్మిక మందన్న తన షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది.
Rashmika Mandanna: టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ జోడీగా పేరుపొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌లో వస్తున్న భారీ పీరియడ్ డ్రామా 'రణబలి' (Ranabaali) కీలక దశకు చేరుకుంది. ఈ చిత్రంలో 'జయమ్మ' అనే ఒక పవర్‌ఫుల్ అండ్ ఎమోషనల్ పాత్రను పోషిస్తున్న రష్మిక మందన్న, తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు.

ప్రెగ్నెంట్ గా జయమ్మ
రణబాలి మూవీ షూటింగ్ లో జయమ్మ జర్మీ ముగిసింది. జయమ్మ క్యారెక్టర్లో ప్రెగ్నెంట్ గా కనిపించిన రష్మిక మందన్న గుడ్ బై చెప్పేసింది. ఈ సందర్భంగా చిత్ర బృందం సెట్స్‌లో రష్మికకు ఘనంగా వీడ్కోలు పలికింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్, మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ రష్మికతో ఉన్న అనుబంధాన్ని చాటుతూ ఒక ప్రత్యేకమైన ఎమోషనల్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి, సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది.
విజయదశమి కానుకగా
'శ్యామ్ సింగ రాయ్' వంటి పీరియడ్ హిట్ తర్వాత దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, పక్కా విజువల్ గ్రాండియర్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ (నవీన్ యెర్నేని, వై. రవిశంకర్), టీ-సిరీస్ (T-Series) సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ రణబాలి మూవీ 2026 అక్టోబర్ 16న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
హాలీవుడ్ నటుడు
ఈ రణబాలి చిత్రంలో హాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ (Arnold Vosloo - The Mummy) ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండటం అంతర్జాతీయంగా ఆకర్షిస్తోంది. అజయ్-అతుల్ (Ajay–Atul) ద్వయం సంగీతం అందిస్తుండగా, నిరవ్ షా, జిష్ణు భట్టాచార్జీ కెమెరా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే.
ఫేవరెట్ కాంబో
తెలుగు చిత్రసీమలో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ అసాధారణమైనది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల తర్వాత వీరిద్దరూ సుదీర్ఘ విరామం అనంతరం 'రణబలి' కోసం మళ్లీ జతకట్టడం ఈ ప్రాజెక్ట్‌కు అతిపెద్ద ప్లస్ పాయింట్.
రాహుల్ సంకృత్యాన్ గతంలో నిర్మించిన పీరియడ్ సెటప్‌లతో పోలిస్తే 'రణబాలి' స్కేల్ అండ్ స్కోప్ చాలా పెద్దది. ఇందులో రష్మిక పాత్ర కేవలం కథానాయికగా పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే 'జయమ్మ'గా ఒక డ్రామాటిక్ షేడ్‌లో కనిపించబోతోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


