వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన లవ్ బర్డ్స్.. ఎయిర్‌పోర్టులో తొలిసారి ఇలా కలిసి కనిపించిన విజయ్, రష్మిక
లవ్ బర్డ్స్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ వెకేషన్ నుంచి తిరిగి వచ్చారు. ఈ ఇద్దరూ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కలిసి కనిపించడం విశేషం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వీళ్లు ఇటలీ వెళ్లిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న న్యూ ఇయర్ వేడుకల కోసం ఇటలీ వెళ్లి, తాజాగా సోమవారం హైదరాబాద్ తిరిగొచ్చారు. వెళ్లేటప్పుడు ఎవరికి వారు విడివిడిగా వెళ్లినా.. వచ్చేటప్పుడు మాత్రం ఒకేసారి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. వీరి ఎయిర్‌పోర్ట్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

విడిగా వెళ్లి.. కలిసి వచ్చి..
సోమవారం (జనవరి 5) హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విజయ్, రష్మిక సందడి చేశారు. ఇటలీలో కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకున్న ఈ జంట, తిరిగి రావడంతో పెళ్లి వార్తలు మళ్ళీ ఊపందుకున్నాయి. మీడియా కంటపడకుండా ఉండేందుకు ఇద్దరూ మాస్కులు ధరించి, లో-ప్రొఫైల్ మెయింటైన్ చేశారు.
రష్మిక గ్రే ట్రౌజర్స్, వైట్ హై-నెక్ టీషర్ట్, బ్లాక్ కోట్ వేసుకోగా.. విజయ్ బ్లాక్ ప్యాంట్స్, లెదర్ జాకెట్, బ్లూ క్యాప్‌తో స్టైలిష్‌గా కనిపించాడు. ఫొటోగ్రాఫర్లకు పోజులివ్వకుండా, తమ సెక్యూరిటీతో కలిసి వేగంగా కారు వైపు వెళ్లిపోయారు.
వీరి వీడియో చూసిన ఫ్యాన్స్.. "పర్ఫెక్ట్ కపుల్", "లవ్ బర్డ్స్", "అతి లేదు, ఫేక్ లేదు.. చాలా జెన్యూన్ జోడి" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
విజయ్, రష్మిక ఇటలీ హింట్స్
కొద్ది రోజుల క్రితం ఇద్దరూ ఇటలీలో ఉన్నప్పుడు షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. వేర్వేరుగా ఫోటోలు దిగినా.. బ్యాక్‌గ్రౌండ్స్ సేమ్ ఉండటంతో ఫ్యాన్స్ ఇట్టే పసిగట్టేశారు. ముఖ్యంగా విజయ్ షేర్ చేసిన ఒక ఫోటోలో ఒక అమ్మాయి తల అతని భుజంపై వాలి ఉండటం చూసి.. అది కచ్చితంగా రష్మికే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.
వీరిద్దరి పెళ్లి గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. హిందుస్తాన్ టైమ్స్ కు ఆ జంట సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 3, 2025 (దసరా మరుసటి రోజు) వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో సీక్రెట్‌గా ఉంగరాలు మార్చుకున్నారట.
ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. కేవలం కుటుంబం, అత్యంత సన్నిహితుల మధ్యే ఈ వేడుక జరగనుందట. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో ఆడియెన్స్ మనసు గెలుచుకున్న ఈ జంట.. త్వరలోనే రియల్ లైఫ్ పార్ట్నర్స్ కాబోతున్నారని టాక్.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


