విజయ్, రష్మిక సంగీత్ సెలబ్రేషన్స్.. లీకైన అన్‌సీన్ రొమాంటిక్ ఫొటోలు.. కోడలు రష్మికపై విజయ్ తల్లి ఎమోషనల్ స్పీచ్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లికి ముందు జరిగే హల్దీ, సంగీత్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగినట్లు తాజాగా బయటకు వచ్చిన ఫొటోలు, వీడియోలు చూస్తే తెలుస్తోంది. సంగీత్ వేడుక జరిగే సమయంలో వేదిక బయట నుంచి తీసిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం (ఫిబ్రవరి 24) రాత్రి జరిగిన 'సంగీత్' వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు బుధవారం ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఇందులో ఈ జంటకు సంబంధించిన ఎన్నో అన్‌సీన్ రొమాంటిక్ ఫొటోలు ఉండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వధూవరులను ఉద్దేశించి విజయ్ తల్లి మాధవి ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ నెట్టింట వైరల్‌గా మారింది.

అందరి దృష్టిని ఆకర్షించిన అన్‌సీన్ ఫొటోలు
ఉదయ్‌పూర్‌లోని విలాసవంతమైన వేదికలో మంగళవారం సాయంత్రం విజయ్, రష్మికల సంగీత్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బుధవారం నెట్టింట లీక్ అయ్యాయి. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుకల విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.
సంగీత్ వేడుక కోసం వేదికను ప్రకాశవంతమైన దీపాలు, తాజా పూలతో ఎంతో అందంగా అలంకరించారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం అక్కడ ప్రదర్శించిన అన్‌సీన్ ఫొటోలే. ఇన్నేళ్ల ప్రయాణంలో ఈ జంట తీసుకున్న ఎన్నో అందమైన, రొమాంటిక్ ఫొటోలను వేదిక అంతటా ప్రదర్శించారు.
ఇవి చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. "ఎన్ని అందమైన ఫొటోలో కదా" అని ఒకరు కామెంట్ చేయగా.. "రష్మిక గారూ.. దయచేసి ఆ ఒరిజినల్ ఫొటోలు మాకు కావాలి" అని మరొక అభిమాని కామెంట్ చేశారు. చాలా మంది ఈ ఫొటోలు చాలా క్యూట్‌గా ఉన్నాయని చెబుతూ హార్ట్ ఎమోజీలతో తమ ప్రేమను పంచుకుంటున్నారు.
కాబోయే కోడలిపై విజయ్ తల్లి ప్రేమ..
ఈ సంగీత్ వేడుకలో విజయ్ దేవరకొండ తల్లి మాధవి మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. "హలో ఫ్రెండ్స్. నా ముద్దుల పిల్లలు, నా బంగారం విజయ్, రషీ (రష్మికను ప్రేమగా పిలుస్తూ..)లకు ఈ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ పెర్ఫార్మెన్స్‌ను అంకితం చేస్తున్నాను. వుయ్ లవ్ యూ" అని ఎంతో ఎమోషనల్ అయింది.
ఈ వీడియోను షేర్ చేస్తున్న ఫ్యాన్స్ "ఈ స్పీచ్ హృదయాన్ని తాకింది", "ఇదే అసలైన ప్రేమ" అంటూ కాప్షన్స్ పెడుతున్నారు. అయితే ఆ సర్ప్రైజ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఎవరు చేశారో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. బహుశా కుటుంబ సభ్యులే ఈ డ్యాన్స్ ప్లాన్ చేసి ఉంటారని తెలుస్తోంది.
హల్దీ, మెహెందీ సందడి
విజయ్, రష్మికల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు తొలుత 'విరోష్ ప్రీమియర్ లీగ్' ఆటలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. బుధవారం నాడు హల్దీ, మెహందీ కార్యక్రమాలు ఎంతో కోలాహలంగా జరిగాయి. ఈ వేడుకల కోసం అతిథులంతా పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. ప్రముఖ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ తన సోషల్ మీడియాలో ఒక ఫొటోను పోస్ట్ చేసింది. అందులో దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా తదితరులు పసుపు రంగు దుస్తుల్లో ఎంతో ఉత్సాహంగా కనిపించారు.
విరోష్ పెళ్లి ముహూర్తం
హిందుస్థాన్ టైమ్స్ సోర్స్ ప్రకారం.. ఫిబ్రవరి 26 ఉదయం 8 గంటలకు వివాహ ముహూర్తం ఖరారైంది. ఈ పెళ్లికి హాజరయ్యేందుకు 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ఆషికా రంగనాథ్, రాహుల్ రవీంద్రన్ తదితరులు ఉదయ్‌పూర్ చేరుకున్నారు. వివాహానికి హాజరుకాలేకపోయిన ప్రధాని మోదీ.. ఈ జంటకు లేఖ ద్వారా తన ఆశీస్సులు పంపారు. ఈ వివాహం అనంతరం మార్చిలో హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం ఒక గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది.

ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


