...
...
Next Story

Vijay Deverakonda: నా నమ్మకం వాడికి బలుపులా అనిపిస్తే తగ్గాలా.. నేనింట్లో కూసోవాలా: ట్రోల్స్‌కు విజయ్ మార్క్ ఘాటు రిప్లై

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ తనపై వస్తున్న ట్రోల్స్ కు తనదైన స్టైల్లో ఘాటు రిప్లై ఇచ్చారు. రణబాలి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తాను మారనని, ట్రోల్స్ చేసేవాళ్లే మారాలని స్పష్టం చేశారు.

Published on: Oct 8, 2026, 20:47:50 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తనపై వస్తున్న డిజిటల్ నెగెటివిటీపై, ఆన్‌లైన్ పేయిడ్ ట్రోల్స్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన తన లేటెస్ట్ పీరియాడిక్ మాస్ ఎపిక్ 'రణబాలి' (Ranabaali) ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన విజయ్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2' (Jailer 2) సినిమాతో వస్తున్న బాక్సాఫీస్ క్లాష్‌పై, సోషల్ మీడియాలో జరుగుతున్న పేయిడ్ ప్రచారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

“నేను మారను.. ట్రోల్స్ చేసేవాళ్లే మారాలి!”

Vijay Deverakonda: నా నమ్మకం వాడికి బలుపులా అనిపిస్తే తగ్గాలా.. నేనింట్లో కూసోవాలా: ట్రోల్స్‌కు విజయ్ మార్క్ ఘాటు రిప్లై
Vijay Deverakonda: నా నమ్మకం వాడికి బలుపులా అనిపిస్తే తగ్గాలా.. నేనింట్లో కూసోవాలా: ట్రోల్స్‌కు విజయ్ మార్క్ ఘాటు రిప్లై

ఆన్‌లైన్‌లో తనపై వస్తున్న హేట్ కామెంట్స్‌పై మీడియా అడిగిన ప్రశ్నకు విజయ్ చాలా ఇంటెన్స్‌గా స్పందించారు. "నా కలలు, నా కష్టం అనవసరం అని ఎవరో అనుకున్నంత మాత్రాన నేను ఆపేయాలా? నా నిజాయితీని పొగరు అని భావిస్తే నేను నటించడం స్టార్ట్ చేయాలా? నా కాన్ఫిడెన్స్‌ను బలుపు అనుకుంటే నేను వెనక్కి తగ్గాలా? నా సక్సెస్ జర్నీని కొందరు జీర్ణించుకోలేకపోతే నేను ఇంట్లో కూర్చోవాలా?" అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

తాను ఎవరి కోసమో తన ఆటిట్యూడ్ మార్చుకునే ప్రసక్తే లేదని, మారాల్సింది ట్రోల్స్ చేసే వాళ్లేనని రౌడీ హీరో కుండబద్దలు కొట్టారు. జనాలు ఇతరులను తొక్కేయడానికి టైమ్ వేస్ట్ చేసే బదులు, తమ ఫ్యామిలీస్ బాగుపడటానికి ఆ టైమ్‌ను ఉపయోగిస్తే బాగుంటుందని, తానైతే ఇతరుల సక్సెస్ స్టోరీలను చాలా ఎంజాయ్ చేస్తానని సూచించారు.

"90 శాతం నెగెటివిటీ పేయిడ్ ప్రచారమే!"

సూపర్‌స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో వస్తున్న 'జైలర్ 2' అక్టోబర్ 15న, విజయ్ దేవరకొండ 'రణబాలి' అక్టోబర్ 16న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ బాక్సాఫీస్ క్లాష్‌ను పాయింట్ అవుట్ చేస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చపై విజయ్ సీరియస్ అయ్యారు.

ఇక అంతకుముందు ఇదే ఈవెంట్ లో ప్రొడ్యూసర్ రవిశంకర్ గురించి దీనిపై స్పందించారు. విజయ్ చాలా మంచోడని, ఇప్పటికైనా అలాంటి నెగటివ్ ట్రోల్స్ ఆపేయాలని సూచించారు.

'టాక్సీవాలా' కాంబో రీ-యూనియన్.. బాక్సాఫీస్ దగ్గర దసరా వార్

2018లో వచ్చిన సూపర్ హిట్ 'టాక్సీవాలా' తర్వాత డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా 'రణబాలి'. విజయ్ సరసన రష్మిక మందన్న జయమ్మ పాత్రలో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

మరోవైపు రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్ 'జైలర్ 2' కూడా కేవలం ఒక్క రోజు తేడాతో వస్తుండటంతో దసరా రేసులో సౌత్ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ వార్ నడవనుంది. రెండు సినిమాలు తమిళ, తెలుగుతో పాటు అన్ని దక్షిణాది భాషల్లో, హిందీలో భారీగా రిలీజ్ అవుతుండటంతో థియేటర్ల దగ్గర పోటీ ఆసక్తికరంగా మారనుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks