Vijay Deverakonda: ఈ అబ్బాయి చాలా చాలా మంచోడు.. ఎందుకీ పిచ్చి పనులు.. ఎందుకీ నెగటివిటీ: విజయ్‌పై ప్రొడ్యూసర్ రవిశంకర్

Vijay Deverakonda: రణబాలి ట్రైలర్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండపై వస్తున్న ట్రోల్స్ కు ప్రొడ్యూసర్ రవిశంకర్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. విజయ్ చాలా చాలా మంచోడని, ఇప్పటికైనా అవన్నీ ఆపాలని సూచించడం విశేషం.

Published on: Oct 8, 2026, 19:12:39 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో వస్తున్న రణబాలి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురువారం (అక్టోబర్ 8) ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవిశంకర్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మూవీ గురించి, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ గురించి గొప్పగా చెబుతూనే.. విజయ్ దేవరకొండపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Vijay Deverakonda: ఈ అబ్బాయి చాలా చాలా మంచోడు.. ఎందుకీ పిచ్చి పనులు.. ఎందుకీ నెగటివిటీ: విజయ్‌పై ప్రొడ్యూసర్ రవిశంకర్
Vijay Deverakonda: ఈ అబ్బాయి చాలా చాలా మంచోడు.. ఎందుకీ పిచ్చి పనులు.. ఎందుకీ నెగటివిటీ: విజయ్‌పై ప్రొడ్యూసర్ రవిశంకర్

ఈ అబ్బాయి చాలా చాలా మంచోడు..

కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండ ఏం చేసినా సోషల్ మీడియాలో తీవ్రమైన నెగిటివిటీ వస్తున్న విషయం తెలుసు కదా. ఈ విషయాన్ని రవిశంకర్ ప్రస్తావించారు. రణబాలి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేదికపై నుంచి ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేయడం విశేషం.

“అందరికీ ఓ విన్నపం. విజయ్ మాకు తెలిసి ఓ 8 ఏళ్లుగా చూస్తున్నాం. మేం చూసినదాంట్లో అద్భుతమైన వ్యక్తిత్వం, అద్బుతమైన వ్యక్తి. అతను మాకు ఎంతో ఇష్టం. అంత మంచోడు. అలాంటి వ్యక్తిపై ఈ మధ్య సోషల్ మీడియాలో పనిగట్టుకొని నెగటివ్ ప్రచారాలు చేస్తున్నారు. మీ అందరికీ ఒక మాట చెబుతున్నాను.. ఈ అబ్బాయి చాలా మంచోడు. ఎందుకు మీ అందరికీ ఈ పిచ్చి పిచ్చి పనులు.. అతను పెట్టిన ఎఫర్ట్ చూసి మెచ్చుకోండి.. ఏదైనా సినిమా నచ్చకపోతే దానిని విమర్శించండి. అంతేకానీ ఎందుకింత నెగటివిటీ. మళ్లీ మళ్లీ చెబుతున్నాను.. విజయ్ చాలా చాలా మంచోడు” అని రవిశంకర్ అన్నారు. అది విన్న విజయ్ స్టేజ్ కింద నవ్వుతూ కనిపించారు.

ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండానే ఎందుకీ విమర్శలు

రణబాలి మూవీపై వస్తున్న విమర్శలకూ రవిశంకర్ సమాధానం ఇచ్చారు. తాము కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండానే ఇది బ్రిటీష్ కథ అంట… ఇది ఆడుతుందా అని కామెంట్స్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి విజయ్ పై మీ మనసుల్లో ఏదైనా నెగటివిటీ ఉంటే తీసేయాలని, అతడు చాలా చాలా మంచోడని, తన క్యారెక్టర్, తన సినిమాలేవో తాను చూసుకుంటాడు తప్ప ఎవరి గురించీ తప్పుగా మాట్లాడడని స్పష్టం చేశారు.

మరోవైపు విజయ్, రష్మిక పెళ్లి తర్వాత కలిసి తొలిసారి నటించిన రణబాలి మూవీ అక్టోబర్ 16న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్ ఈ మూవీపై భారీ ఆశలే పెట్టుకున్నారు. మరి ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More