Vijay Rashmika: పెళ్లికి పిలవలేదని అలిగిన క్యూట్ ఫ్యాన్‌ను ఇంటికి పిలిచి మరీ లంచ్ పెట్టిన విజయ్, రష్మిక!

Vijay Rashmika: తనను పెళ్లికి పిలవలేదని ఫీలైన చిన్న పాపను ఇంటికి పిలిచి మాట నిలబెట్టుకున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు. లడ్డూలు పెట్టిర్రు, అన్నదానం పెట్టిర్రు అంటూ ఓ క్యూట్ రీల్ చేసి వైరల్ అయిన ఆ పాప తాజాగా మరో వీడియో షేర్ చేసింది.

Published on: Mar 20, 2026, 18:36:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రీసెంట్‌గా పెళ్లి చేసుకున్న మన టాలీవుడ్ క్యూట్ కపుల్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫైనల్‌గా తమ క్యూట్ లిటిల్ ఫ్యాన్‌ను కలిశారు. తమ పెళ్లికి ఎందుకు పిలవలేదని క్యూట్‌గా అలిగిన ఆ చిన్నారిని, వాళ్ల ఫ్యామిలీని ఏకంగా హైదరాబాద్‌లోని తమ ఇంటికే పిలిచి స్పెషల్‌గా లంచ్ పెట్టడం విశేషం. ఆ చిన్నారి ఫ్యాన్ వాళ్ల ఇంట్లో గడిపిన బ్యూటిఫుల్ డేను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో ద్వారా పోస్ట్ చేసింది. ఆ వీడియోలోని క్యూట్‌నెస్‌ను చూసి ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోతున్నారు. ఫైనల్‌గా ఆ పాప కోరిక తీరినందుకు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Vijay Rashmika: లడ్డూలు పెట్టిర్రు.. అన్నదానం పెట్టిర్రు..: ఆ వైరల్ పాపను ఇంటికి పిలిచిన విజయ్, రష్మిక.. వీడియో వైరల్
Vijay Rashmika: లడ్డూలు పెట్టిర్రు.. అన్నదానం పెట్టిర్రు..: ఆ వైరల్ పాపను ఇంటికి పిలిచిన విజయ్, రష్మిక.. వీడియో వైరల్

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్, రష్మిక

యువర్స్ లక్కీ తల్లి (urs_luckythalli) అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఉన్న ఆ చిన్నారి పాప.. విజయ్, రష్మికల ఇంట్లో గడిపిన బ్యూటిఫుల్ టైమ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో తనను పెళ్లికి ఎందుకు పిలవలేదని ఆ పాప అడుగుతుంటే విజయ్ ఎంతో ముద్దుగా ఆమెను ఎత్తుకున్నాడు. రష్మిక అయితే ఆ పాప ప్లేట్ నిండా లడ్డూలు పెట్టి, ఒక స్వీట్ కిస్ కూడా ఇచ్చింది.

విజయ్ కూడా ఆ పాపకు తన చేత్తో అన్నం తినిపించాడు. మనం కూడా ఫ్రెండ్సే కదా అని ఆ చిన్నారి ఎంతో క్యూట్‌గా అడుగుతుంటే విజయ్, రష్మిక ఇద్దరూ నవ్వుతూ మురిసిపోయారు. ఫైనల్‌గా వాళ్లను కలిసినందుకు తను చాలా హ్యాపీగా ఉన్నానని ఆ పాప వాళ్లతో చెప్పింది.

ఆ వీడియో కింద క్యాప్షన్‌లో ఆమె ఇలా రాసుకొచ్చింది.. రీల్ టు రియల్. విజయ్ దేవరకొండను వాళ్ల ఇంట్లో కలవడం నాకు, నా ఫ్యామిలీకి నిజంగా ఒక అద్భుతమైన, ఎప్పటికీ మర్చిపోలేని మెమొరీ. మేం అక్కడికి వెళ్లినప్పటి నుంచి, ఆయన మమ్మల్ని చాలా ఆప్యాయంగా, ఎంతో బాగా చూసుకున్నారు. మమ్మల్ని ఫుల్ కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలా చేశారు. అలాగే రష్మిక మందన్నను కలవడం కూడా ఎంతో ఆనందంగా అనిపించింది. ఆమె చిరునవ్వు, ఆ ఫ్రెండ్లీ నేచర్ మాకు మరింత సంతోషాన్ని ఇచ్చింది అని ఆ పాప పోస్ట్ చేసింది.

పాప చేసిన వైరల్ రీల్ ఇదీ

ఫిబ్రవరి 26న విజయ్, రష్మికల పెళ్లి జరిగిన తర్వాత.. మార్చి ఫస్ట్ వీక్‌లో ఈ క్యూట్ ఫ్యాన్ ఒక వీడియో పోస్ట్ చేసింది. అందులో తనను పెళ్లికి ఎందుకు పిలవలేదని చాలా ముద్దుగా అడిగింది. వాళ్లు అందరికీ లడ్డూలు పెడుతున్నారని, అన్నదానం చేస్తున్నారని, కానీ తనను మాత్రం పిలవలేదని ఆ వీడియోలో అలిగింది. మనం కూడా ఫ్యాన్సే కదా అని క్యూట్‌గా అడుగుతూ, ఈ వీడియో చూస్తున్న వాళ్లంతా దాన్ని ఆ కపుల్‌కు చేరేలా షేర్ చేయాలని అడిగింది.

ఆ వీడియో చూసి ఫుల్ కనెక్ట్ అయిపోయిన విజయ్.. సో క్యూట్ అని కామెంట్ చేశాడు. అంతేకాదు బుజ్జితల్లీ.. ఇంటికి పిలుస్తా లంచ్‌కి.. నీ ఫేవరెట్ ఫుడ్, స్వీట్స్ నాకు చెప్పు, అన్నీ ఇంట్లో చేయించి మంచిగా తిందాము అని రిప్లై ఇచ్చాడు. రష్మిక కూడా ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసి, ఆ పాపకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తానని ప్రామిస్ చేసింది. వాళ్లు చెప్పినట్లుగానే ఆ చిన్నారిని సంతోష పెట్టడానికి తమ ప్రామిస్ నిలబెట్టుకున్నారు. ఇక వీళ్ల నెక్స్ట్ సినిమాల విషయానికొస్తే.. రష్మిక, విజయ్ ఇద్దరూ త్వరలో రణబాలి అనే సినిమాలో కలిసి నటించబోతున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More