విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితీ రావు హైదరీ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రయోగాత్మక సైలెంట్ మూవీ 'గాంధీ టాక్స్'. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా జనవరి 30న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.
గాంధీ టాక్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?

కిశోర్ పాండురంగ బెలెకర్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితీ రావు హైదరీ నటించిన మూవీ 'గాంధీ టాక్స్' (Gandhi Talks). గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (IFFI)లో ప్రదర్శితమైన మూడేళ్ల తర్వాత.. ఈ ఏడాది జనవరి 30న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఇందులో మాటలు ఉండవు, కేవలం సంగీతం, హావభావాలే ప్రధానం. ఏ.ఆర్. రెహమాన్ (AR Rahman) అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజికే సినిమాకు ప్రధాన బలం.
ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన నెలలోపే ఈ సినిమా ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో వినిపిస్తున్న బజ్ ప్రకారం.. ఫిబ్రవరి 26 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
గాంధీ టాక్స్ మూవీ కథ, విశేషాలు
డబ్బు, అవినీతి మనిషి జీవితాన్ని ఎలా శాసిస్తాయి అనేదే ఈ గాంధీ టాక్స్ సినిమా ఇతివృత్తం. గాంధీ బొమ్మ ఉన్న కరెన్సీ నోట్లు మనుషుల నిజాయితీని ఎలా మారుస్తాయో ఇందులో చూపించారు. లంచం ఇవ్వలేక ఉద్యోగం రాని ఒక యువకుడు (విజయ్ సేతుపతి), అవినీతి వల్ల సామ్రాజ్యం కూలిపోతున్న ఒక సంపన్నుడు (అరవింద్ స్వామి).. వీరిద్దరి ప్రపంచాలు ఒకచోట కలిసినప్పుడు ఏం జరిగింది అనేదే కథ.
సిద్ధార్థ్ జాదవ్, మహేష్ మంజ్రేకర్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సైలెంట్ మూవీ, ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి. ఈ మధ్య టాప్ సినిమాల డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంటున్న జీ5 ఓటీటీలోకే ఈ మూవీ రానుంది. స్ట్రీమింగ్ డేట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.
{{/usCountry}}సిద్ధార్థ్ జాదవ్, మహేష్ మంజ్రేకర్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సైలెంట్ మూవీ, ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి. ఈ మధ్య టాప్ సినిమాల డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంటున్న జీ5 ఓటీటీలోకే ఈ మూవీ రానుంది. స్ట్రీమింగ్ డేట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.
{{/usCountry}}